RRR Movie: టికెట్ ధరల కోసం ఎన్టీఆర్ హెల్ప్ తీసుకుంటున్న దానయ్య.. ఎందుకో తెలుసా ?

Sreeharsha Gopagani   | Asianet News
Published : Dec 11, 2021, 11:12 AM IST
RRR Movie: టికెట్ ధరల కోసం ఎన్టీఆర్ హెల్ప్ తీసుకుంటున్న దానయ్య.. ఎందుకో తెలుసా ?

సారాంశం

యంగ్ టైగర్ NTR , మెగా పవర్ స్టార్ Ram Charan నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రస్తుతం దేశం మొత్తం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ట్రైలర్ విడుదలయ్యాక సినిమాపై అంచనాలు మరోస్థాయికి చేరాయి. క

యంగ్ టైగర్ NTR , మెగా పవర్ స్టార్ Ram Charan నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రస్తుతం దేశం మొత్తం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ట్రైలర్ విడుదలయ్యాక సినిమాపై అంచనాలు మరోస్థాయికి చేరాయి. కళ్ళు చెదిరే యాక్షన్ సన్నివేశాలు, గుండెల్లి పిండేసే ఎమోషనల్ సన్నివేశాలతో ఈ చిత్రం ఉండబోతున్నట్లు ట్రైలర్ ద్వారా అర్థం అవుతోంది. ఇండియన్ స్క్రీన్ పై మునుపెన్నడూ చూడని విధంగా ఈ చిత్రం ఉండబోతున్నట్లు ట్రైలర్ తో అర్థం అవుతోంది.ట్రైలర్ లో ప్రతి బిట్ గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉంది. 

ట్రైలర్ విడుదలయ్యాక జక్కన్న అండ్ టీం మొత్తం ఇండియాని చుట్టేస్తున్నారు. ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముంబై, బెంగళూరు, చెన్నై నగరాలలో ఇప్పటికే ప్రెస్ మీట్లు ముగిశాయి. నేడు హైదరాబాద్ లో తెలుగు మీడియాతో RRR చిత్ర యూనిట్ ఇంటరాక్ట్ అయింది. ఈ కార్యక్రమానికి రాజమౌళి, రాంచరణ్, ఎన్టీఆర్ తో పాటు అలియా భట్ కూడా హాజరైంది. 

మీడియా ప్రతినిధుల నుంచి చిత్ర యూనిట్ అనేక ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇండియా మొత్తం ఆర్ఆర్ఆర్ రిలీజ్ కి ఎలాంటి సమస్య లేదు. కానీ ఏపీలో మాత్రం ప్రభుత్వం నిర్ణయించిన టికెట్ ధరల విషయంలో సమస్య ఉంది. తక్కువ టికెట్ ధరలతో ఇంత పెద్ద చిత్రాన్ని విడుదల చేస్తే కలక్షన్స్ పై ప్రభావం ఉంటుందనే వాదన వినిపిస్తోంది. 

దీని గురించి నిర్మాత దానయ్యకు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఏపీలో టికెట్ ధరల సమస్య అధికమించేందుకు మీరు ఎన్టీఆర్ హెల్ప్ తీసుకుంటున్నారా అని మీడియా ప్రశ్నించింది. ఎందుకంటే ఏపీ ప్రభుత్వంలో కోడలి నాని లాంటి వారు ఎన్టీఆర్ కి సన్నిహితులు కదా అని పరోక్షంగా ప్రశ్నించారు. వివాదం కాకుండా ఈ ప్రశ్నకు దానయ్య చాలా తెలివిగా సమాధానం ఇచ్చారు. తక్కువ టికెట్ ధరలతో పెద్ద సినిమాలకు ఇబ్బందే. ప్రభుత్వంతో చర్చించేందుకు ప్రయత్నిస్తున్నాం అని సమాధానం ఇచ్చారు. ఎన్టీఆర్ స్నేహితుల గురించి మాట్లాడలేదు. 

Also Read: Pushpa: సమంత స్పెషల్ సాంగ్.. మైకంలో ముంచెత్తుతున్న ఆమె మంగ్లీకి ఏమవుతుందంటే..

PREV
click me!

Recommended Stories

Pawan Kalyan తో నటించి కనిపించకుండా పోయిన హీరోయిన్లు, లిస్ట్ లో ఐదుగురు.. ఆమె మాత్రం చేజేతులా..
10 భాషల్లో 90 సినిమాలు.. 50 ఏళ్ల పెళ్లి కాని బ్యాచిలర్ హీరోయిన్ ఎవరో తెలుసా ?