షణ్ముఖ్‌ తనకు ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాడంటూ బాంబ్‌ పేల్చిన సిరి.. అమ్మ కోసం టైటిల్‌ అంటూ సన్నీ రిక్వెస్ట్

Published : Dec 10, 2021, 11:42 PM IST
షణ్ముఖ్‌ తనకు ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాడంటూ బాంబ్‌ పేల్చిన సిరి.. అమ్మ కోసం టైటిల్‌ అంటూ సన్నీ రిక్వెస్ట్

సారాంశం

 `జగదేక వీరుడు అతిలోక సుందరి` చిత్రంలో శ్రీదేవి ఉంగరం పోగొట్టుకునే ఎపిసోడ్‌ని ఇమిటేట్‌ చేశారు. కాజల్‌.. తన వాయిస్‌ మాడ్యులేషన్‌తో ఆకట్టుకుంది. తన ఉంగరం కోసం పోలీస్‌ స్టేషన్‌కి వెళ్లాలనుకున్నప్పుడు ముఠామేస్త్రీ గెటప్‌లో ఉన్న చిరంజీవి ఆమెని సింగం పోలీస్‌ స్టేషన్‌కి, ఆ తర్వాత గబ్బర్‌ సింగ్‌ పోలీస్‌ స్టేషన్లకి తీసుకెళ్లడం చేస్తాడు. 

బిగ్‌బాస్‌ తెలుగు 5(Bigg Boss Telugu 5).. 97ఎపిసోడ్‌ (శుక్రవారం) సైతం ఆద్యంతం ఎంటర్‌టైనింగ్‌గా సాగింది. నిన్నటి ఎంటర్‌టైనింగ్‌ టాస్క్ ని కంటిన్యూ చేశారు. నామినేషన్‌లో ఉన్న సభ్యులు డైరెక్ట్ గా ఆడియెన్స్ కి తమకు ఓటు వేయాలని అడుక్కునేందుకు అవకాశం కల్పిస్తున్నాడు. అందుకు టాస్క్ లను ఇచ్చాడు. ఇందులో భాగంగా ఇంటి సభ్యులకు ఒక్కొక్కరికి ఒక్కో హీరో పాత్రలిచ్చిన విషయం తెలిసిందే. చిరంజీవిగా శ్రీరామ్‌, బాలకృష్ణగా సన్నీ, పవన్‌ కళ్యాణ్‌గా మానస్‌, సూర్యగా షణ్ముఖ్, శ్రీదేవిగా కాజల్‌, జెనీలియాగా సిరి యాక్ట్ చేయాల్సి ఉంటుంది. వారి పాటలు వచ్చినప్పుడు డాన్సులు వేయడం, వారి టైమ్‌ వచ్చినప్పుడు డైలాగ్‌లు చెప్పడం చేయాలి.

ఇందులో `జగదేక వీరుడు అతిలోక సుందరి` చిత్రంలో శ్రీదేవి ఉంగరం పోగొట్టుకునే ఎపిసోడ్‌ని ఇమిటేట్‌ చేశారు. కాజల్‌.. తన వాయిస్‌ మాడ్యులేషన్‌తో ఆకట్టుకుంది. తన ఉంగరం కోసం పోలీస్‌ స్టేషన్‌కి వెళ్లాలనుకున్నప్పుడు ముఠామేస్త్రీ గెటప్‌లో ఉన్న చిరంజీవి ఆమెని సింగం పోలీస్‌ స్టేషన్‌కి, ఆ తర్వాత గబ్బర్‌ సింగ్‌ పోలీస్‌ స్టేషన్లకి తీసుకెళ్లడం చేస్తాడు. ఈ క్రమంలో వీరి పాత్రల డైలాగులు, యాక్టింగ్‌ నవ్వులు పూయించాయి. ఈ ఎపిసోడ్‌ మొత్తం బాగా ఎంటర్‌టైనింగ్‌గా సాగింది. 

ఈ టాస్క్ లో బాగా ఎంటర్‌టైన్‌ చేసిన వారికి ఆడియెన్స్ తో డైరెక్ట్ గా తమకి ఓటు వేయాలని, గెలిపించాలని చెప్పుకునే అవకాశం ఉంటుంది. ఈ టాస్క్ లో కాజల్‌కి అందరు ఓటు వేశారు. బాలకృష్ణగా చేసిన సన్నీతో పాటు పోటీ పడగా, అంతా శ్రీదేవి పాత్రలో అద్బుతంగా చేశావని, వాయిస్‌ మాడ్యూలేషన్‌ బాగా చేసిందని కాజల్‌ని విన్నర్‌గా నిర్ణయించారు. దీంతో ఆడియెన్స్ కి కాజల్‌ తనకు ఓటు వేయాలని తెలిపింది. అలాగే తన ఫ్రెండ్స్  సన్నీ, మానస్‌లకు కూడా ఓటు వేయాలని పేర్కొంది. 

అనంతరం ఆడియెన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇందులోనూ అనేక ఆసక్తికర ప్రశ్నలు వచ్చాయి. తాను హౌజ్‌లో స్ట్రాంగ్‌ ప్లేయర్‌ అయి ఉండి కూడా షణ్ముఖ్‌ విన్నర్‌గా నిలవాలని కోరుకోవడమంటే నువ్వు వీక్ ప్లేయర్‌ అనుకుంటున్నావా? అడిగిన ప్రశ్నకి సిరి సమాధానం చెప్పింది. కచ్చితంగా తాను స్ట్రాంగ్‌ ప్లేయర్‌ని అని, షణ్ముఖ్‌ స్ట్రాంగ్‌ ప్లేయర్‌ అని, అతను తన ఫ్రెండ్‌ కాబట్టి అతను విన్నర్‌గా, టాప్‌ 5లో ఉండాలని కోరుకుంటానని తెలిపింది. షణ్ముఖ్‌తో తాను ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యానని తెలిపింది సిరి. 

 మరోవైపు సిరి బాగా పొసెసివ్‌ చేస్తున్నావని ఆడియెన్స్ అడగ్గా, షణ్ముక్‌ చెబుతూ, తను ఎలా ఉండాలో చెప్పే ప్రయత్నం చేస్తున్నానని, బారియర్స్ దాటకుండా ఉండేందుకు కంట్రోల్‌ చేస్తున్నానని,కానీ అది కొన్నిసార్లు తనకు తెలియకుండా మరో రూపంలో కంట్రోల్‌ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ విషయంలో తను కూడా కన్‌ఫ్యూజ్‌ అవుతున్నానని,ఈ విషయంలో క్షమాపణలు చెప్పారు షణ్ముఖ్‌. పింకీ విషయంలో తను చేసిన దానికి మానస్‌ స్పందిస్తూ, ఆమెని ఓ ఫ్రెండ్‌లాగే చూశానని, ఆమె మంచి కోసమే తాను అలా ప్రవర్తించాల్సి వచ్చిందని,కానీ ఎప్పటికీ ఆమె ఫ్రెండ్‌ అని చెప్పారు. కాజల్‌ చెబుతూ, సన్నీ, మానస్‌ తనకు ఫ్రెండ్స్ అని, వాళ్లిద్దరు హార్ట్ టూ హాట్‌ కనెక్ట్ అయ్యారని తెలిపింది. దీంతో వాళ్లతో ఫ్రెండ్లీగా ఉంటానని తెలిపింది. 

ఈ టాస్క్ లో సన్నీ, సిరి మధ్య పోటీ నడిచింది. సిరి.. సన్నీ కోసం త్యాగం చేయగా, సన్నీ గెలిచి ఆడియెన్స్ ని ఓటింగ్‌ కోసం రిక్వెస్ట్ చేశాడు. తెలియకుండా కొన్ని పొరపాట్లు చేశానని, మళ్లీ అవి రిపీట్‌ కావని తెలిపారు. అమ్మ తనని టైటిల్‌ గెలుచుకుని రమ్మని, తన కోరికగా తెలిపింది. అమ్మ ముఖంలో నవ్వు చూడాలని, తాను టైటిల్‌ విన్నర్‌గా నిలవాలని, అందుకు సపోర్ట్ చేయాలని తెలిపాడు మానస్‌. అయితే మధ్య మధ్యలో టాస్క్ కి సంబంధించి వచ్చిన గ్యాప్‌లో సిరి, షణ్ముఖ్‌, శ్రీరామ్‌ ఒక టీమ్‌గా, సన్నీ, మానస్‌,కాజల్‌ మరో టీమ్‌గా ఏర్పడి వారిపై వీళ్లు, వీళ్లపై వాళ్లు కామెంట్ చేసుకోవడం విశేషం. 

also read: Bigg Boss Telugu 5: అలగడం.. హగ్గులు చేసుకోవడం.. సిరి, షణ్ముఖ్ వ్యవహారం రోజు రోజుకి ముదురుతోందిగా

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Kartik Aaryan: చెల్లి పెళ్లి వేడుకలో హంగామా చేసిన యంగ్ హీరో, సందడి మొత్తం అతడిదే.. వైరల్ ఫోటోస్
Radha Daughter: చిరంజీవి హీరోయిన్ కూతురు, గుర్తుపట్టలేనంతగా ఎలా మారిపోయిందో చూడండి