
అల్లు అర్జున్ ''చెప్పను బ్రదర్'' అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులపై మొదలుపెట్టిన పోరు.. ఇప్పుడు డీజే టీజర్ కు డిజ్ లైక్ లలో రికార్డ్ క్రియేట్ చేసే దాకా వెళ్లింది. పవన్ ఫ్యాన్స్ కావాలనే భారీ ఎత్తున ఆ టీజర్ కు డిస్లయిక్స్ కొట్టేస్తున్నారు. బన్నీ టీజర్ కోసం ఎప్పటి నుండో వెయిట్ చేస్తూ వచ్చిన పవన్ ఫ్యాన్స్ ఇప్పుడు ఏకంగా సినిమా టీజర్ డిస్లయిక్స్ లో రికార్డు సృష్టించే స్థాయికి తీసుకెళ్లారు. అందుకే లైక్స్ కు దాదాపు ఈక్వల్ గా డిస్లయిక్స్ కూడా కనిపిస్తున్నాయి. సినిమా లవర్స్ ఎవరైనా నిజంగానే టీజర్ నచ్చకపోయినా డిస్లయిక్ మాత్రం కొట్టరు. ఎవడో ఒక్కడిద్దరు తప్ప. కాని ఇలా రికార్డ్ క్రియేట్ చేసే రేంజులో డిజ్లయిక్ చేయడం మాత్రం.. డిజె టీజర్ కే చెల్లింది.
మరోవైపు టీజర్ కు వచ్చిన రెస్పాన్స్ అద్భుతంగా ఉందని.. అందరికీ థ్యాంక్స్.. అంటూ అల్లు అర్జున్ ట్వీటేసి థ్యాంక్స్ చెప్పాడు. స్టైలిష్ ఫస్ట్ లుక్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన డీజే టీం ఇప్పుడు టీజర్ తో రికార్డుల వేట మొదలు పెట్టింది. గురువారం రిలీజ్ అయిన డీజే ఫస్ట్ లుక్ టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. కేవలం 50 గంటల్లో ఈ టీజర్ మిలియన్ మార్క్ దాటి బన్నీ కెరీర్ లో సరికొత్త రికార్డ్ సృష్టించింది.
దువ్వాడ జగన్నాథమ్ టీజర్ ముందు ముందు మరిన్ని రికార్డ్ లు సృష్టిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్. బ్రాహ్మణుడి గెటప్‌లో అల్లు అర్జున్ కనిపించిన ఈ టీజర్‌లో హీరోయిన్ పూజాహెగ్డే ముద్దుపెట్టుకున్న సన్నివేశం కనిపిస్తుంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ 'ఇలా.. ఇలా ముద్దులు పెట్టేసి సభ్యసమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని' అంటూ చెప్పిన డైలాగ్ అందరికీ నచ్చింది.
టీజర్ మంచి ఆదరణ పొందుతోందని నిర్మాత దిల్‌రాజు తెలిపారు. తమ సంస్థ నుండి సినిమా అంటేనే ప్రేక్షకులలో భారీ అంచనాలు వుంటాయని, అలాగే అల్లు అర్జున్ తమ సంస్థలో చేస్తున్న హ్యాట్రిక్ మూవీగా డి.జె నిలుస్తుందని నిర్మాత తెలిపారు. సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయని, ప్రేక్షకులకు అంచనాలకు తగ్గట్టుగానే సినిమాను ప్రెస్టేజియస్‌గా రూపొందించామన్నారు.