కాటమరాయుడుతో కాలుదువ్వుతున్న దువ్వాడ జగన్నాథం

First Published Mar 7, 2017, 12:46 PM IST
Highlights
  • టీజర్ రికార్డులన్నీ బద్ధలు కొట్టిన కాటమరాయుడు
  • వెనకే దూసుకొస్తున్న దువ్వాడ జగన్నాథం
  • యూ ట్యూబ్ లో కొనసాగుతున్న పవన్, అర్జున్ ఫ్యాన్స్ వార్

యేళ్లుగా రికార్డులు సృష్టించి నిలబడిన తెలుగు టీజర్ల రికార్డుల పరంపరను గత నెల రోజులుగా వచ్చిన టీజర్లు గల్లంతు చేసేశాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘కాటమరాయుడు’ టీజర్.. యూట్యూబ్‌లో తెలుగు టీజర్ల రికార్డులన్నింటినీ క్రాస్ చేసింది. గతంలో వివిధ కేటగిరీల్లో నమోదైన ఏ రికార్డు కూడా కాటమరాయుడు టీజర్ ధాటికి నిలవలేకపోయాయి.

 

‘ఖైదీ నెంబర్ 150’ దాదాపు 75 లక్షల వ్యూస్‌తో నెంబర్ వన్ ప్లేస్‌లో నిలవగా వారం పది రోజుల్లోనే ఆ మార్కును అందుకుని రికార్డు సృష్టించింది పవన్ కాటమరాయుడు టీజర్. ఇప్పుడీ టీజర్ ఒక మహా రికార్డు దిశగా సాగుతోంది. తెలుగులో కోటి వ్యూస్ మార్కును టచ్ చేసిన తొలి టీజర్‌గా రికార్డు సృష్టించడానికి అత్యంత చేరువలో ఉంది ‘కాటమరాయుడు’.


ప్రస్తుతం కాటమరాయుడు టీజర్ వ్యూస్ 95.5 లక్షలు. ఇంకో నాలుగున్నర లక్షల వ్యూస్ వస్తే కోటి మార్కును రీచ్ అవుతుంది. ఈ టీజర్‌కు రికార్డు స్థాయిలో 2.43 లక్షల లైక్స్ రావడం విశేషం. డిజ్ లైక్స్ కూడా ఉన్నా అవి 38 వేలే. ఇది కూడా ఇటీవల జరుగుతున్న కొన్ని పరిణామాల మూలంగానే వచ్చాయి. ఇక ‘కాటమరాయుడు’ టీజర్ వచ్చాక 20 రోజుల తర్వాత యూట్యూబ్‌ లోకి దూసుకొచ్చిన ‘దువ్వాడ జగన్నాథం’ టీజర్ కూడా ఇదే స్థాయిలో మోత మోగిస్తోంది. ఈ టీజర్ ‘ఖైదీ నెంబర్ 150’ని కూడా దాటేసి ‘కాటమరాయుడు’ తర్వాత 8 మిలియన్ మార్కును అందుకున్న తెలుగు టీజర్‌గా రికార్డు సృష్టించింది.

 

ప్రస్తుతం దీని వ్యూస్ 83 లక్షల మార్కు దగ్గర ఉన్నాయి. త్వరలోనే ఇది కూడా కోటి మార్కును అందుకున్నా ఆశ్చర్యం లేదు. ఈ టీజర్‌కు 1.6 లక్షల లైక్స్ వస్తే.. డిజ్ లైక్స్ 1.5 లక్షలుగా ఉండటం విశేషం. సౌత్ ఇండియాలో మరే టీజర్‌కూ ఇన్ని డిజ్ లైక్స్ రాలేదు. ఇదంతా పవన్ కళ్యాణ్ అభిమానుల ఘనత. మొత్తానికి సౌత్ లోనే ఇన్ని డిజ్ లైక్స్ వచ్చిన ఫస్ట్ టీజర్ ఇదే. గతంలో ఏ టీజర్ కు కనీసం లక్ష డిజ్ లైక్స్ పడలేదు.

click me!