విషాదం.. 'కిక్' మూవీ నటుడు మృతి.. కారణాలు ఇవే

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 21, 2022, 10:15 AM IST
విషాదం.. 'కిక్' మూవీ నటుడు మృతి.. కారణాలు ఇవే

సారాంశం

రవితేజ బ్లాక్ బస్టర్ మూవీ కిక్ చిత్రాన్ని సల్మాన్ ఖాన్ హిందీలో రీమేక్ చేశారు. అక్కడ కూడా కిక్ మూవీ ఘనవిజయం సాధించింది. వసూళ్ల వర్షం కురిపించింది. ఈ చిత్రంలో మెరిసిన నటుడు అరుణ్ వర్మ(62) గురువారం తుదిశ్వాస విడిచారు.

రవితేజ బ్లాక్ బస్టర్ మూవీ కిక్ చిత్రాన్ని సల్మాన్ ఖాన్ హిందీలో రీమేక్ చేశారు. అక్కడ కూడా కిక్ మూవీ ఘనవిజయం సాధించింది. వసూళ్ల వర్షం కురిపించింది. ఈ చిత్రంలో మెరిసిన నటుడు అరుణ్ వర్మ(62) గురువారం తుదిశ్వాస విడిచారు. దీనితో బాలీవుడ్ లో అతడి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

అరుణ్ వర్మ బాలీవుడ్ లో అనేక చిత్రాల్లో నటించారు. రిషి కపూర్ 'ప్రేమ్ గ్రంథ్', అనిల్ కపూర్ 'నాయక్' లాంటి చిత్రాల్లో మెరిశారు. అరుణ్ వర్మ గురువారం తెల్లవారు జామున మరణించినట్లు ఆయన మేనల్లుడు ప్రకటించారు. 

కొంతకాలంగా అరుణ్ వర్మ తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అరుణ్ వర్మ కు బ్రెయిన్ లో బ్లాక్ ఉందట. దాని ఫలితంగా ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తాయి. అనారోగ్యం తీవ్రం కావడంతో కిడ్నీల ఫంక్షన్ కూడా ఆగిపోయింది. దీనితో ఆయన మృతి చెందినట్లు తెలిపారు. 

కుటుంబ సభ్యుల సమక్షంలో భోపాల్ లో అరుణ్ వర్మ అంత్యక్రియలు నిర్వహించారు. రీసెంట్ గా అరుణ్ వర్మ కంగనా రనౌత్ నటిస్తున్న టికు వెడ్స్ షేరు షూటింగ్ కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇక అరుణ్ వర్మ ఖల్నాయక్, హీరోపంతి లాంటి మరిన్ని చిత్రాల్లో నటించారు. 

PREV
click me!

Recommended Stories

Shilpa Shetty ఇంట్లో ఐటీ దాడులు? 60 కోట్ల మోసం విషయంలో అసలు నిజం ఏంటో తెలుసా?
మూడో వారంలో ఎలిమినేట్ కావలసిన వాడు తనూజని వాడుకుని విన్నర్ రేసులోకి వచ్చేశాడు.. భరణి సంచలన వ్యాఖ్యలు