థ్రిల్లింగ్ :దుల్కర్‌ ‘కురుప్‌’ తెలుగు ట్రైలర్‌

Surya Prakash   | Asianet News
Published : Nov 04, 2021, 08:21 AM IST
థ్రిల్లింగ్ :దుల్కర్‌ ‘కురుప్‌’ తెలుగు ట్రైలర్‌

సారాంశం

కేరళకు చెందిన ఒకప్పటి మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ సుకుమార కురుప్‌ జీవితాధారంగా తెరకెక్కుతోంది. కురుప్‌, గోపీకృష్ణన్‌ అనే రెండు విభిన్న కోణాల్లో దుల్కర్‌ కనిపించారు. తన నటనతో అందరికీ కట్టిపడేసేలా ఉన్నారు. 

దుల్కర్ సల్మాన్(Dulkar Salman) కు మహా నటి చిత్రంతో తెలుగులో మంచి క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత కనులు కనులను దోచాయంటే చిత్రం కూజా బాగా ఆడింది. తాజాగా Dulkar Salman హీరోగా `కురుప్` (Kurup) టైటిల్ తో ఓ చిత్రం రిలీజ్ కు రెడీ అయ్యింది. నవంబర్ 12న ఈ కురుప్ సినిమా వరల్డ్ వైడ్‌గా థియేటర్లలోకి రానున్న నేపథ్యంలో తాజాగా మేకర్స్ కురుప్ ట్రైలర్‌ని విడుదల చేశారు. తెలుగులోనూ ఈ సినిమాని రిలీజ్ చేస్తూండటంతో తెలుగు ట్రైలర్ కూడా విడుదల చేసారు. సినిమాలో ట్విస్టులు, థ్రిల్లింగ్ రేపే సీన్స్ ఎక్కువగా ఉన్నాయని కురుప్ ట్రైలర్ (Kurup trailer) చూస్తే అర్థమవుతోంది. మీరూ ఓ లుక్కేయండి.

కేరళకు చెందిన ఒకప్పటి మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ సుకుమార కురుప్‌ జీవితాధారంగా తెరకెక్కుతోంది. కురుప్‌, గోపీకృష్ణన్‌ అనే రెండు విభిన్న కోణాల్లో దుల్కర్‌ కనిపించారు. తన నటనతో అందరికీ కట్టిపడేసేలా ఉన్నారు. క్రిమినల్‌ని పట్టుకునేందుకు పోలీసులు చేసే ప్రయత్నాలు, వాటి నుంచి తప్పించుకునేందుకు కురుప్‌ వేసే ప్లాన్లతో ట్రైలర్‌ అదిరిపోయింది. గోపీకృష్ణన్‌.. కురుప్‌గా ఎందుకు మారాడు? పరిస్థితుల ప్రభావమా? పోలీసులు ఆయన్ను పట్టుకున్నారా? అసలు సుకుమార కురుప్‌ జీవితం ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రధానబలంగా నిలిచింది.

శ్రీనాథ్ రాజేంద్రన్ డైరెక్ట్ చేస్తున్న కురుప్ మూవీలో దుల్కర్ సల్మాన్ సరసన శోబిత దూళిపాల జంటగా నటిస్తోంది. ఇంద్రజిత్ సుకుమారన్, షైన్ టామ్ చాకో, సన్ని వేన్, భరత్ నివాస్ సపోర్టింగ్ పాత్రల్లో కనిపించనున్నారు. సంగీతం: సుషిన్‌ శ్యామ్‌, ఛాయాగ్రహణం: నిమిష్‌ రవి. ఈ సినిమా మలయాళం, తెలుగుతోపాటు కన్నడ, తమిళం, హిందీ భాషల్లోనూ విడుదలకానుంది.

also read: Review: `మంచి రోజులు వచ్చాయి` సినిమా రివ్యూ.. మారుతి బ్రాండ్‌ వర్కౌట్‌ అయ్యిందా?

PREV
click me!

Recommended Stories

అఖండ 2 ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..? బాలయ్య సినిమా ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
Bharani Elimination: ఫలించని నాగబాబు ప్రయత్నం, భరణి ఎలిమినేట్‌.. గ్రాండ్‌ ఫినాలేకి చేరింది వీరే