బాడీ మేకోవర్‌తో షాకిస్తున్న వరుణ్‌ తేజ్‌.. కండలు తిరిగిన దేహానికి ఫ్యాన్స్ ఫిదా

Published : Nov 04, 2021, 12:02 AM IST
బాడీ మేకోవర్‌తో షాకిస్తున్న వరుణ్‌ తేజ్‌.. కండలు తిరిగిన దేహానికి ఫ్యాన్స్ ఫిదా

సారాంశం

వరుణ్‌ తేజ్‌ లేటెస్ట్ ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో వరుణ్‌ తేజ్‌ బాడీని చూసిన నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. ఆయన అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

చిత్ర పరిశ్రమలో ఫిట్‌నెస్‌ ఎంత ముఖ్యమో తెలిసిందే. హీరోగా నటించాలంటే బాడీ చాలా ఫిట్‌గా ఉండాలి, మంచి షేప్ ఉండాలి. కండలు తిరిగిన దేహం ఉండాలి. అప్పుడే అందరిని ఆకట్టుకోగలుగుతారు. తెరపై హ్యాండ్సమ్‌గా, గుడ్‌ లుకింగ్‌తో కనిపిస్తారు. అందుకోసమే చాలా మంది హీరోలు గంటల తరబడి జిమ్‌లో వర్కౌట్‌ చేస్తుంటారు. మరికొందరైతే ఏకంగా సిక్స్ ప్యాక్ లు చేస్తుంటారు. అందులో మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌ తాను తక్కువ కాదని నిరూపించుకుంటున్నాడు. జిమ్‌లో వర్కౌట్‌ లో కష్టపడుతూ కండలు తిరిగిన దేహాన్ని పొందుతున్నాడు. 

తాజాగా వరుణ్‌ తేజ్‌(Varun Tej) లేటెస్ట్ ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో Varun Tej బాడీని చూసిన నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. ఆయన అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వరుణ్‌ సినిమా కోసం ట్రాన్ఫ్‌ ఫామ్‌ అయిన తీరుపట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వరుణ్‌ తేజ్‌ ప్రస్తుతం `గని`(Ghani) చిత్రంలో నటిస్తున్నారు. కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. వరుణ్ తేజ్ ఈ సినిమా కోసం తనని తాను పూర్తిగా మార్చుకున్నారు. ఈయన మేకోవర్ చూసి అభిమానులతో పాటు ఇండస్ట్రీ కూడా వారేవా అంటుంది.

తాజాగా విడుదలైన వరుణ్ ఫోటోలు చూస్తుంటే ఆయన పడిన కష్టం కళ్ల ముందు కనిపిస్తోంది. సిక్స్ ప్యాక్ బాడీతో ఫిట్ గా కనిపిస్తున్నారు వరుణ్ తేజ్. గ్రీకు శిల్పం లాంటి బాడీ అంటారు కదా.. అలా మారిపోయారు వరుణ్ తేజ్. అచ్చంగా హాలీవుడ్ హీరో మాదిరి ఉన్న ఈయనను చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. Ghani Movieను అల్లు అరవింద్ గారి పెద్దబ్బాయి బాబి నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మొదటి పాటకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. డిసెంబర్ 3న ఈ సినిమా విడుదల కానుంది. 

మరోవైపు కామెడీ ఎంటర్‌టైనర్‌ `ఎఫ్‌3`లో నటిస్తున్నారు వరుణ్‌ తేజ్. రెండేళ్ల క్రితం వచ్చిన సూపర్‌ హిట్‌ అయిన `ఎఫ్‌2` చిత్రానికిది సీక్వెల్‌. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తుండగా, ఇందులో వెంకటేష్‌తో కలిసి వరుణ్‌ తేజ్‌ నటిస్తున్నారు. తమన్నా, మెహరీన్‌ కథానాయికలు. జస్ట్ ఫన్‌, కామెడీ, ఫ్రస్టేషన్‌ ప్రధానంగా సాగే `ఎఫ్‌2` వంద కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు డబ్బుతో కూడిన ఫ్రస్టేషన్‌ ప్రధానంగా `ఎఫ్‌3` చిత్రాన్ని రూపొందిస్తున్నాడు అనిల్ రావిపూడి. ఈ సినిమా ఆల్మోస్ట్ చిత్రీకరణ పూర్తయ్యింది. విడుదలకు సన్నాహాలు చేసుకుంటోంది. వచ్చే ఏడాది జనవరి 25న విడుదల కాబోతుంది.

also read: Lala Bheemla: దీపావళి ముందుగానే తీసుకొచ్చిన పవన్‌ కళ్యాణ్‌..

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Thanuja: ఇదీ తనూజ అసలు స్వరూపం, విన్నర్ అయ్యే ఛాన్స్ గోవిందా.. ఆమెకి ఎలివేషన్స్ ఇచ్చి వేస్ట్
Raktha Sambandham Review : ఎన్టీఆర్, సావిత్రి.. అన్నా చెల్లెలుగా నటించే సాహసం ఎలా చేశారు? ఆడియన్స్ ను ఏడిపించిన మహానటి