
యాక్షన్ ఇమేజ్ కోసం ట్రై చేసే ప్రాసెస్ లో దుల్కర్ సల్మాన్ కింగ్ ఆఫ్ కొత్త సినిమాతో గ్యాంగ్ స్టర్ ను చేశాడు. దుల్కర్‌ను మనం ఇంత వరకు లవర్ బాయ్‌గానే చూశాం. మొదటి సారిగా ఇలా గ్యాంగ్ స్టర్ డ్రామా, మాసీగా, యాక్షన్ జానర్‌లో దుల్కర్ సల్మాన్ ఇవ్వటంతో ఖచ్చితంగా సినిమా పై అంచనాలు ఏర్పడ్డతాయి ఓపినింగ్స్ అదిరిపోతాయనే నమ్మారు. అందుకు తగ్గట్లుగానే పాన్ ఇండియన్ రేంజ్‌లో ఈ మూవీని రిలీజ్ చేశాడు. అయితే సినిమా డిజాస్టర్ అయ్యింది. అంతేకాదు సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో మినిమం ఓపినింగ్స్ కూడా చాలా చోట్ల రాలేదు. అయితే కేరళలలో సీన్ వేరే.
అయితే కేరళలో మాత్రం సినిమాపై సూపర్ ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. అక్కడ ప్రముఖ దర్శకుడు జోషి కుమారుడు డైరక్టర్ కావటం, ఫామ్ లో ఉన్న దుల్కర్ హీరో కావటం హైప్ తీసుకువచ్చాయి. సినిమాకు అందరూ ఊహించినట్లుగానే రికార్డ్ ఓపినింగ్స్ వచ్చాయి. కేరళలో బిగ్గెస్ట్ ఓపినింగ్స్ లో ఒకటిగా నిలిచింది. అక్కడ కేజీఎఫ్ మొదటి రోజు కలెక్షన్స్ ని బీట్ చేసింది. అయితే రెండో రోజుకే దారుణమైన డ్రాప్ స్టార్ట్ అయ్యింది. మొదటి రోజు కేరళలో 5.75 కోట్లు వస్తే, రెండో రోజుకు అది 50% డ్రాప్ అయ్యిపోయింది. రెండు కోట్లు కూడా రావటం కష్టమైపోయింది. మౌత్ టాక్, రివ్యూలు సినిమాని దెబ్బ కొట్టేసాయి. ఈ సినిమా వీకెండ్స్ లో కూడా వర్కవుట్ అయ్యేటట్లు లేదు. దుల్కర్ కెరీర్ లోనే పెద్ద ఫెయిల్యూర్ గా మిగిలిపోయేటట్లు ఉందని ట్రేడ్ అంచనా.
ఈ సినిమా దర్శకుడు అభిలాష్ జోషికి ఇది తొలిసినిమా. అతను తండ్రి జోషి పెద్ద మళయాళ దర్శకుడు. దాంతో ఈ సినిమా పై మంచి ఎక్సపెక్టేషన్స్ అన్ని వర్గాల్లోనూ ఉన్నాయి. దానికి తగినట్లే సినిమాలో అన్ని ఎమోషన్స్ వచ్చేలా ప్రేమ, స్నేహం, చెల్లి సెంటిమెంట్, ఫ్యామిలీ ఎమోషన్స్.. ఇలా అన్నీ కలిపి కథ వండారు. అయితే అన్నిటికన్నా ముఖ్యమైన కాంప్లిక్ట్స్ అనే ఎలిమెంట్ మర్చిపోయారు. సినిమా ప్రారంభమైన అరగంట దాకా హీరో కనపడడు. ఆ తర్వాత కూడా అతను లైవ్ లోకి రాడు. కేవలం వేరే వాళ్ల ప్లాష్ బ్యాక్ లోనే కనపడతాడు.సెకండాఫ్ లోకి కానీ హీరో లైవ్ లోకి వచ్చి యాక్షన్ లోకి దిగడు. ఆ తర్వాత అయినా విలన్, హీరో మధ్య యాక్షన్ గేమ్ సజావుగా సాగడు. దాంతో సినిమా బోరింగ్ గా మారిపోయింది.