నీ వల్ల నా పరువు పోతుంది.. దుల్కర్ సల్మాన్ ని చివాట్లు పెట్టిన మమ్ముట్టి

By team teluguFirst Published Aug 8, 2022, 3:39 PM IST
Highlights

హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ నటించిన స్ట్రైట్ తెలుగు చిత్రం సీతా రామం. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. 

మలయాళీ హ్యాండ్సమ్ హీరో దుల్కర్ సల్మాన్ నెమ్మదిగా తెలుగులో క్రేజ్ పెంచుకుంటున్నాడు. మహానటి చిత్రంలో దుల్కర్ సల్మాన్ తన నటనని తెలుగు ప్రేక్షకులకు రుచి చూపించాడు. ఆ తర్వాత దుల్కర్ నటించిన చిత్రాలు తెలుగులో కూడా డబ్ అవుతూ వచ్చాయి. కానీ సాలిడ్ మూవీ పడడం లేదు అనే ఫీలింగ్ ఉంది. ఆ కోరిక సీతా రామంతో నెరవేరింది అనే చెప్పొచ్చు. 

హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ నటించిన స్ట్రైట్ తెలుగు చిత్రం ఇది. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి, క్రిటిక్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంటోంది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రానికి రోజు రోజుకు వసూళ్లు పెరుగుతున్నాయి. 

ఈ చిత్రం విజయం సాధించిన తర్వాత దుల్కర్ పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఓ ఇంటర్వ్యూలో హీరోగా తాను ఇండస్ట్రీకి పరిచయం కావడం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నేను నటించడం నాన్న మమ్ముట్టి గారికి ఇష్టం లేదు. అందుకే చదువు పూర్తయ్యాక ఉద్యోగం చేసుకోమని దుబాయ్ పంపించారు. 

నాన్న చెప్పినట్లుగానే కొన్ని రోజులు జాబ్ చేశాను. కానీ నాలుగు గోడల మధ్య కూర్చుని ఉద్యోగం చేయడం నావల్ల కాలేదు. దీనితో ఇంటికి తిరిగి వచ్చేశాను. హీరోగా ట్రై చేస్తాను అని నాన్నతో చెప్పను. దీనితో నాన్న బాధపడడమే కాదు.. చివాట్లు కూడా పెట్టారు. నేను యాక్టింగ్ కి సెట్ కానని నాన్న నాకు డ్యాన్సులు, ఫైట్లు లాంటివి కూడా నేర్పించలేదు. 

నువ్వు ఎప్పుడూ నటించడానికి కానీ, చిన్న డ్యాన్స్ చేయడానికి కానీ ప్రయత్నించినట్లు నేను చూడలేదు. నటన అంటే నువ్వు అనుకున్నంత సులువు కాదు. నా పరువు తీసే ఆలోచన మానుకో అని అని కోపంగా తిట్టినట్లు దుల్కర్ సల్మాన్ గుర్తు చేసుకున్నారు. నీకు నటించడం చేతకాకపోతే అందరూ నన్నే తిడతారు అని నాన్న కోపంగా అన్నారు. కానీ ఆయనే ఇప్పుడు నాకు సినిమాల విషయంలో సలహాలు ఇస్తుంటారని తెలిపారు.  

సీతారామం చిత్రంలో దుల్కర్ సల్మాన్ లెఫ్టినంట్ రామ్ పాత్రలో అదరగొట్టేశాడు. దుల్కర్ నటనకి ప్రేక్షకులు కంట తడి పెట్టడం ఖాయం అన్నట్లుగా అతడి నటన సాగింది. 

click me!