కన్నీళ్లు పెట్టిన అమీర్ ఖాన్ .. చిన్ననాటి పేదరికాన్ని గుర్తు చేసుకున్న బాలీవుడ్ స్టార్

By Mahesh JujjuriFirst Published Aug 8, 2022, 1:57 PM IST
Highlights

బాలీవుడ్ లో స్టార్ హీరో.. మిస్టర్ పర్ఫెక్ట్.. ధైర్యానికి నిదర్శణం అంటే వెంటనే వినిపించే పేరు అమీర్ ఖాన్. అటువంటి అమీర్ ఖాన్ కన్నీళ్లు పెట్టాడు. అది కూడా తన జీవితాన్ని గుర్తు చేసుకుని. ఇంతకీ అమీర్ కన్నీళ్లు పెట్టుకోవల్సిన అవసరం ఏమోచ్చింది. 

ఓవర్ ఆల్ ఇండియాలో  అద్భుత నటుడు అంటే వెంటనే వినిపించే పేరు ఆమిర్ ఖాన్. ప్రపంచం మెచ్చిన నటుడు అమీర్ ఖాన్. ఆయన సాధించిన విజయాలు ఎన్నో.. దంగల్ తో ప్రపంచ రికార్డ్ సాధించిన ఈ స్టార్ హీరో..  ఎన్నో సూపర్ హిట్స్ అందించి, బాక్సాఫీసు వసూళ్లలో రికార్డులు సృష్టించారు.  నటనలో వైవిధ్యాన్ని చూపించి.. ప్రయోగాలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడే స్టార్ హీరో అమీర్ ఖాన్. 

నటుడిగా నిరూపించుకున్న ఆమిర్ ఖాన్... కన్నీరు కార్చగా ఇప్పటి వరకూ ఎవరూ చూడలేదు. ఆయన బాధపడ్డారంటేనే అది చిత్రమైన పరిస్థితి. ఇక రీసెంట్ గా అమీర్ ఖాన్  తన చిన్ననాటి రోజులను గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్నారు. హ్యుమన్స్ ఆఫ్ బాంబే ఇంటర్వ్యూలో భాగంగా ఆయన గత అనుభవాలను గుర్తు చేసుకున్నారు. ఫీజులు కట్టలేని పరిస్థితిలో తను చదువుకున్న స్కూల్ లో ఎన్నో  అవమానాలు ఎదుర్కొన్న విషయాన్ని పంచుకున్నారు.

తన చిన్నతనంలో  తమ కుటుంబం బాగా అప్పుల్లో ఉండేదట, ఎనిమిదేళ్ల పాటు గడ్డు పరిస్థితులను చూసినట్టు తెలిపారు. స్కూల్లో తను చదువుకునే రోజుల్లో  6  క్లాస్ కు 6 రూపాయిలు.. 7వ తరగతికి 7 రూపాయలు.. ఎనిమిదో తరగతికి 8 రూపాయిలు ఫీజు ఉండేదని ఆయన చెప్పాడు. ఆమిర్, ఆయన అక్క,అన్నలు  ఎప్పుడూ సమయానికి ఫీజులు చెల్లించే వారు కాదు. దీంతో వారిని ఒకటి, రెండు సార్లు హెచ్చరించిన తరువాత స్కూల్ అసెంబ్లీలో ప్రిన్సిపల్ వారి పేర్లను పెద్దగా చదివేవారట. అది ఒక స్టూడెంట్ కు ఎంతో అవమానకరంగా ఉంటుంది అన్నారు అమీర్. 

ఇక  ఈ విషయాలన్ని చెపుతూ.. అమీర్ ఖాన్ బాధను దిగమింగలేకపోయారు.. ఇవన్నీ చెపుతన్న  సందర్భంలె  కన్నీరు ఆపుకోలేకపోయారు.ఇక అమీర్ జీవితం గురించి చూసుకుంటే.. నిర్మాత తాహిర్ హుస్సేన్, జీనత్ హుస్సేన్ దంపతుల తనయుడు  ఆమిర్ ఖాన్ . అమీర్ కు ఒక అన్నయ్య ఫైసల్ ఖాన్, ఇద్దరు అక్కలు ఫర్హత్ ఖాన్, నిఖత్ ఖాన్ ఉన్నారు. ఆమిర్ ఖాన్ 1973లో వచ్చిన యాదోన్ కి బారాత్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండితెరకు పరిచయం అయ్యారు. నిర్మాతగా తన తండ్రి పడిన కష్టాలు చూసిన అమీర్..  తను కూడా నిర్మాతగా మారి.. ఎన్నో విజయాలు సాధిస్తున్నారు. 

click me!