తెలుగు విడుదల‌కు సిద్ధ‌మ‌వుతోన్న దుల్క‌ర్ స‌ల్మాన్‌, సాయిప‌ల్ల‌వి `క‌లి`

Published : Aug 01, 2017, 07:12 PM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
తెలుగు విడుదల‌కు సిద్ధ‌మ‌వుతోన్న దుల్క‌ర్ స‌ల్మాన్‌, సాయిప‌ల్ల‌వి `క‌లి`

సారాంశం

ఓకే బంగారంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన దుల్కర్ సల్మాన్ ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను పిదా చేసిన సాయి పల్లవి ఇద్దరి కాంబినేషన్ లో మలయాళ సూపర్ హిట్ కలి  త్వరలో లుగులో..  

ఓకే బంగారం సినిమాతో దుల్క‌ర్ స‌ల్మాన్‌, ఇటీవ‌ల విడుద‌లైన సెన్సేష‌న‌ల్ హిట్ అయిన `ఫిదా`తో భానుమ‌తిగా ప్రేక్ష‌కుల హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర వేసిన సాయి ప‌ల్ల‌వి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యారు. ప్ర‌స్తుతం దుల్క‌ర్ స‌ల్మాన్ తెలుగులో మ‌హాన‌టి సావిత్రి బ‌యోపిక్‌లో న‌టిస్తున్నారు. సాయిప‌ల్ల‌వి `ఎంసిఎ` చిత్రంలో న‌టిస్తుంది. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో రూపొందిన సినిమా తెలుగులో విడుద‌ల కానుంది. దుల్క‌ర్ స‌ల్మాన్, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన మ‌ల‌యాళ సూప‌ర్‌హిట్‌ చిత్రం `క‌లి`. ఈ సినిమాను తెలుగు అనువాద హ‌క్కుల‌ను ప్ర‌ముఖ సీడెడ్ డిస్ట్రిబ్యూట‌ర్ డి.వి.కృష్ణ‌స్వామి ద‌క్కించుకున్నారు.



ప్రస్తుతం తెలుగు అనువదానికి సంబంధించిన డబ్బింగ్, మిక్సింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ ఆగ‌స్ట్ 2వ వారంలో ఈ సినిమా టైటిల్, లోగో విడుద‌ల చేస్తారు. సెప్టెంబ‌ర్‌లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ప‌లు ఉత్త‌మ చిత్రాల‌కు సంగీతం అందించి జాతీయ‌స్థాయిలో ఉత్త‌మ సంగీత ద‌ర్శ‌కుడిగా అవార్డ్స్ అందుకున్న గోపీసుంద‌ర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సెప్టెంబ‌ర్ నెల‌లో సినిమాను తెలుగులో విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.



ఈ చిత్రానికి మాట‌లుః భాషా శ్రీ, సాహిత్యంః సురేంద్ర కృష్ణ‌, సంగీతంః గోపీసుంద‌ర్‌, సినిమాటోగ్ర‌ఫీః గిరీష్ గంగాధ‌ర‌న్‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః ద‌క్షిణ్ శ్రీనివాస్‌, కో ప్రొడ్యూస‌ర్ః వి.చంద్ర‌శేఖ‌ర్‌, నిర్మాతః డి.వి.కృష్ణ‌స్వామి, ద‌ర్శ‌క‌త్వంః స‌మీర్ తాహిర్‌.

PREV
click me!

Recommended Stories

Ustaad Bhagat Singh: ఊపేసేలా ఉన్న `దేఖ్‌ లేంగే సాలా` పాట.. మళ్లీ ఆ రోజులను గుర్తు చేసిన పవన్‌ కళ్యాణ్‌
అడివి శేష్ గూఢచారి 2 తో పాటు బోల్డ్ హీరోయిన్ నుంచి రాబోతున్న 5 సినిమాలు ఇవే