దుల్కర్, అనుపమ 'అందమైన జీవితం' సెన్సార్ పూర్తి

Published : Aug 14, 2017, 06:51 PM ISTUpdated : Mar 26, 2018, 12:02 AM IST
దుల్కర్, అనుపమ 'అందమైన జీవితం' సెన్సార్ పూర్తి

సారాంశం

మలయాళం లో సంచలన విజయం సాధించిన 'జొమోంటే సువిశేషంగాళ్' ఈ చిత్రాన్ని అందమైన జీవితం పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న పత్తిపాటి శ్రీనివాసరావు దుల్కర్ సల్మాన్, అనుపమ పరమేశ్వరన్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలు

మేఘవర్ష క్రియేషన్స్ పతాకంపై, మలయాళం లో సంచలన విజయం సాధించిన 'జొమోంటే సువిశేషంగాళ్' చిత్రాన్ని అందమైన జీవితం పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు అభిరుచి గల నిర్మాత పత్తిపాటి శ్రీనివాసరావు. సత్యన్ అంతిక్కాడ్ ఈ చిత్రానికి దర్శకుడు.  దుల్కర్ సల్మాన్, అనుపమ పరమేశ్వరన్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి విద్యాసాగర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా వుంది. 

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత పత్తిపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ..'ఇదొక లవ్ అండ్ ఫ్యామిలీ సెంటిమెంట్ మూవీ. తండ్రీకొడుకుల మధ్య అనుబంధాన్ని, ప్రేమికుల మధ్య వుండే ప్రేమని అద్భుతంగా చిత్రీకరించిన చిత్రమే అందమైన జీవితం. సంగీతానికి మంచి ఇంపార్టెన్స్ వున్న మ్యూజికల్ హిట్ చిత్రమిది. మలయాళం లో ఈ చిత్రం 50 కోట్ల క్లబ్ లో నిలిచింది.  ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. క్లీన్ యు సర్టిఫికెట్ వచ్చింది. ఈ నెలాఖరున సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాం..అని అన్నారు.

దుల్కర్ సల్మాన్, అనుపమ పరమేశ్వరన్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: విద్యాసాగర్, మాటలు: ఘంటసాల రత్నకుమార్, ఎడిటింగ్: ఈ. ఎమ్. నాగేశ్వరరావు, ఫోటోగ్రఫీ: ఎస్. కుమార్, పాటలు: శ్రీరామమూర్తి, నిర్మాత: పత్తిపాటి శ్రీనివాసరావు, దర్శకత్వం: సత్యన్ అంతిక్కాడ్.  

PREV
click me!

Recommended Stories

Divi Vadthya: లవ్ బ్రేకప్‌తో డిప్రెషన్‌లోకి వెళ్లా, మళ్లీ ఆ కష్టాలు రావద్దు.. నటి దివి వద్త్య ఎమోషనల్‌
Om Shanti Shanti Shantihi Trailer Review: తరుణ్‌ భాస్కర్‌ కి వణుకు పుట్టించిన ఈషా రెబ్బా, ట్రైలర్‌ ఎలా ఉందంటే?