మొదటి చిత్రం `దృశ్యం` కథకి కొనసాగింపుగా `దృశ్యం2` సాగుతుందని ట్రైలర్‌ని బట్టి చూస్తే అర్థమవుతుంది. రాంబాబు కేసు ఏమైందని ఊర్లో వాళ్లు గుసగుసలాడుకోవడంతో ట్రైలర్ ప్రారంభమైంది.
`విక్టరీ` వెంకటేష్ (Venkatesh) హీరోగా నటించిన చిత్రం `దృశ్యం2`(Drushyam 2). గతంలో వచ్చిన `దృశ్యం` చిత్రానికిది సీక్వెల్. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. మీనా.. వెంకీకి జోడిగా నటించారు. ఈ సినిమా ఈ నెల(నవంబర్ 25న) 25న సినిమా అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో సోమవారం ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో చిత్ర ట్రైలర్‌ని విడుదల చేశారు. ఆద్యంతం ఉత్కంఠభరితంగా ట్రైలర్ సాగుతూ ఆకట్టుకుంటోంది.
మొదటి చిత్రం `దృశ్యం` కథకి కొనసాగింపుగా Drushyam2 సాగుతుందని ట్రైలర్‌ని బట్టి చూస్తే అర్థమవుతుంది. రాంబాబు కేసు ఏమైందని ఊర్లో వాళ్లు గుసగుసలాడుకోవడంతో ట్రైలర్ ప్రారంభమైంది. ఎంత దొరికినా బాడీ దొరకలేదని ఊర్లో వాళ్లు చర్చించుకుంటారు. అయితే ఆ కేసు నుంచి బయటపడి తిరిగి తన లైఫ్‌ని నార్మల్‌కి తీసుకొస్తాడు వెంకటేష్. ఈ సారి రాంబాబు(వెంకీ) థియేటర్లు నడిపిస్తుంటాడు. థియేటర్ అంటే ప్రాణమని, దాన్ని బాగా చూసుకుంటాడు. సినిమాలు తీయాలనేది తన డ్రీమ్. నిర్మాతగా తాను తీయబోయే సినిమా అందరికి నచ్చేలా ఉండాలనుకుంటున్నట్టు చెబుతాడు వెంకీ.
సినిమా తీయడం మనకు అవసరమా.. అంజు(రాంబాబు పెద్ద కూతురు)కి పెళ్లి చేయడం ముఖ్యం కదా అంటుంది మీనా. తనేమో ఇప్పుడే తనకు పెళ్లి వద్దు అని, తాను ఉన్నత చదువులు చదువుకోవాలనుకుంటున్నట్టు చెబుతుంది. అక్క ఇన్సిడెంట్ తర్వాత అమ్మ అలా తయారైపోయిందని రాంబాబు చిన్నకూతురు చెబుతుంది. దీంతో ఒక్కసారిగా గతం గుర్తుకొస్తుంటుంది. మరోవైపు నదియా.. నరేష్‌తో తన కొడుకు గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. థియేటర్‌పై ఫోకస్‌తో రాంబాబు ఉన్నాడని, అతన్ని పట్టుకోవడం ఇదే సమయం అన్నట్టుగా గత కేసుని తిరగదోడుతున్నట్టు తెలుస్తుంది. `వాడు సినిమా తీసే లోపు వాడికి సినిమా చూపిద్దాం` అంటాడు పోలీస్ కమిషనర్ సంపత్ రాజ్. దీంతో మళ్లీ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతాడు వెంకీ.
మరి ఆ కేసులో రాంబాబుగా వెంకీ ఎలాంటి ఎత్తులేశాడు. మరోసారి తన జీవితంలో ఎదురైన క్లిష్ట పరిస్థితుల నుంచి ఎలా బయటపడ్డాడనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ట్రైలర్ ఎంగేజింగ్‌గా, ఆసక్తికరంగా సాగుతుంది. సురేష్ ప్రొడక్షన్ పతాకంపై రూపొందిన ఈ చిత్రంలో వెంకటేష్, మీనాలతోపాటు తనికెళ్ల భరణి, నదియా, నరేష్, సంపత్రాజ్, కృతిక, జయకుమార్, ఎస్తర్ అనీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
also read: Samantha: ఫస్ట్ టైమ్‌లో సమంత ఐటెమ్ సాంగ్.. `పుష్ప` టీమ్ అఫీషియల్ అనౌన్స్ మెంట్