ఆడదని.. మాస్ రాజా మూవీని ఆపేసారు

By Prashanth MFirst Published Apr 10, 2019, 6:20 PM IST
Highlights

కొన్ని సినిమాలు ప్రారంభం కాకుండానే వాటి భవిష్యత్  అర్దమైపోతుంది. అయినా సరే కొందరు నిర్మాతలు ప్రెస్టేజ్ కోసమో, లేక వేరే వాళ్లు ఇబ్బంది పడతారనో కంటిన్యూ చేస్తారు.  అలాంటిదే ‘తెరి’ రీమేక్ విషయంలో జరుగుతోందని మీడియా మొత్తం భావించింది.

కొన్ని సినిమాలు ప్రారంభం కాకుండానే వాటి భవిష్యత్  అర్దమైపోతుంది. అయినా సరే కొందరు నిర్మాతలు ప్రెస్టేజ్ కోసమో, లేక వేరే వాళ్లు ఇబ్బంది పడతారనో కంటిన్యూ చేస్తారు.  అలాంటిదే ‘తెరి’ రీమేక్ విషయంలో జరుగుతోందని మీడియా మొత్తం భావించింది. ఆ సినిమా తెలుగులో ఆడటం కష్టమంటూ కథనాలు వెలువరించింది. అవి మొత్తానికి మైత్రీ మూవీస్ బ్యానర్ ని చేరినట్లున్నాయి. ఫైనల్ గా దర్శకుడు,హీరోతో మీటింగ్ పెట్టి సినిమా ఆపేసినట్లు సమాచారం.

విజయ్ హీరోగా మూడేళ్ల క్రితం తమిళంలో వచ్చిన ‘తెరి’ ఘన విజయం సాధించింది. ఆ సినిమాని తెలుగులో ‘పోలీసోడు’ పేరుతో విడుదల చేశారు కానీ, ఇక్కడ ఆడలేదు. అయినప్పటికీ ఆ సినిమాని తెలుగులో రీమేక్ చెయ్యడానికి హీరో రవితేజ, డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ రెడీ అయ్యారు.

మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమా నిర్మాణాన్ని చేపట్టింది. కొద్ది రోజుల షూటింగ్ తర్వాత హఠాత్తుగా ఆపేశారు. కారణాలేమిటనే విషయంపై  బయిటకు న్యూస్ రాలేదు. తర్వాత మళ్లీ మొదలెడదామనుకున్నారు కానీ రవితేజకు కూడా ఈ సినిమా ఆడుతుందనే నమ్మకం లేకపోవటంతో నిర్మాతలతో మాట్లాడి నో అనేసినట్లు సమాచారం.

ఇక ప్రస్తుతం రవితేజ 1980ల నేపథ్యంలో నడిచే కథతో ‘డిస్కో రాజా’ సినిమా చేస్తున్నాడు. వీఐ ఆనంద్ దర్శకుడు. ప్రస్తుతం దాని షూటింగ్  జరుగుతోంది.  

click me!