లాజిక్ తో అలోచించి ఓటెయ్యండి.. హీరో కామెంట్

By Prashanth MFirst Published Apr 10, 2019, 5:29 PM IST
Highlights

గురువారం జరగనున్న తొలివిడత జనరల్ ఎలక్షన్స్ కి ఎలక్షన్ కమిషన్ అంతా సిద్ధం చేసింది. అయితే నేడు చివరి రోజు కావడంతో దేశం కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం అలోచించి ఓటు వేయాలని సినీ ప్రముఖులు జనాలకు అవగాహన కల్పిస్తున్నారు. 

సుదీర్ బాబు కూడా సోషల్ మీడియా ద్వారా తన వివరణ ఇచ్చాడు. సుదీర్ మాట్లాడుతూ.. రేపు అందరూ ఓటు వేస్తున్నారు కదా .. అలోచించి ఓటు వేయండి.. వెయ్యి..  రెండు వేలు మీ పిల్లల చదువులకు కూడా పనికిరాదు. అలాగే మీకు ఆపద వస్తే మీ ప్రాణాలను కూడా కాపాడలేదు. మీ మతం మీకు ఉద్యోగం ఇవ్వదు అలాగే మీ కులం మీ ఇంటి ముందు రోడ్లు వేసి ఇవ్వదు. 

సో డబ్బుకి కులానికి మతానికి కాకుండా మీ భవిష్యత్తుకు - రాష్ట్ర , దేశ భవిష్యత్తు కోసం ఓటు వేయండి.. ఎమోషన్స్ తో కాకుండా లాజిక్ తో ఆలోచించండి.. జై హింద్'  అని సుదీర్ బాబు తన మాటలతో ఓటుపై అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. 

click me!