Drishyam 3: 150 కోట్లు దాటి దూసుకుపోతున్న మోహన్ లాల్ మూవీ, మేకింగ్ వీడియో చూశారా?

Published : May 27, 2026, 12:55 PM IST
Drishyam 3 Box Office Success and Behind The Scenes Video Released

సారాంశం

మోహన్‌లాల్ 'దృశ్యం 3' సినిమా ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల కలెక్షన్లు దాటింది. ఇప్పుడు ఈ సినిమా మేకింగ్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది.

మోహన్‌లాల్ హీరోగా మే 21న రిలీజైన 'దృశ్యం 3' సినిమా బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతోంది. మలయాళంలో ఎవర్ గ్రీన్ హిట్ ఫ్రాంచైజీగా నిలిచిన 'దృశ్యం' సిరీస్‌లో వచ్చిన ఈ మూడో భాగం కూడా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇప్పటికే 150 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఈ నేపథ్యంలో, సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోను (బిహైండ్ ద సీన్స్) మేకర్స్ రిలీజ్ చేశారు.

కలెక్షన్ల వర్షం కురిపిస్తోన్న దృశ్యం 3

మలయాళ సినీ ఇండస్ట్రీలో 'దృశ్యం 3' కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. దీనికి కారణం, ఈ సిరీస్‌లోని మొదటి రెండు భాగాలు సృష్టించిన అంచనాలే. తన కుటుంబంలోకి అనుకోకుండా వచ్చిన సమస్య నుంచి జార్జ్‌కుట్టి, అతని కుటుంబం ఈసారి బయటపడతారా? లేక పోలీసులకు దొరికిపోతారా? కేవలం నాలుగో తరగతి చదివిన ఆ వ్యక్తి తెలివితేటలు ఈసారి కూడా కుటుంబాన్ని కాపాడతాయా? అని అందరూ ఉత్కంఠగా ఎదురుచూశారు. ఈ మూడో భాగంలో ఎమోషన్స్‌కు ఎక్కువ ఇంపార్టెన్స్  ఇచ్చారు. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టే 'దృశ్యం 3' థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

ఈ సినిమాకు U/A 13+ సర్టిఫికెట్ లభించింది. నిజానికి ఈ సినిమాను ఏప్రిల్ 2న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ, పశ్చిమ ఆసియాలో యుద్ధ వాతావరణం కారణంగా మే 21కి వాయిదా వేశారు. ఈ సినిమాలో మోహన్‌లాల్‌తో పాటు మీనా, అన్సిబా హసన్, ఎస్తర్ అనిల్, ఆశా శరత్, సిద్ధిఖ్, కళాభవన్ షాజోన్, ఇర్షాద్, గణేష్ కుమార్ వంటి తారలు నటించారు. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై ఆంటోనీ పెరుంబవూర్ ఈ సినిమాను నిర్మించారు. 

 

హిందీ వెర్షన్ రిలీజ్ ఎప్పుడు? 

ఇక ఈ సినిమా హిందీ వెర్షన్‌ను 2026 అక్టోబర్ 2న రిలీజ్ చేయనున్నారు.'దృశ్యం 3' హిందీ వెర్షన్ నిర్మిస్తున్న పనోరమ స్టూడియోస్, మలయాళం ఒరిజినల్ వెర్షన్ గ్లోబల్ థియేట్రికల్, డిజిటల్ రైట్స్‌ను కూడా కొనుగోలు చేసినట్లు గతంలో వార్తలు వచ్చాయి. అంతేకాదు, బాలీవుడ్‌కు చెందిన మరో ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్, పనోరమ స్టూడియోస్ ద్వారా ఆశీర్వాద్ సినిమాస్‌లో 100 కోట్ల రూపాయల పెట్టుబడి కూడా పెడుతోంది.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Prakash Raj Controversy: చిక్కుల్లో ప్రకాశ్ రాజ్, వివాదాస్పద వ్యాఖ్యలపై కోర్టులో క్రిమినల్ కేసు
Vijay Divorce: విజయ్ విడాకుల కేసులో ట్విస్ట్.. త్రిషతో సంబంధంపై సంగీత సంచలన ఆరోపణలు