'దొరసాని' ట్రైలర్.. 'నా ప్రేమ కూడా ఉద్యమమే'!

Published : Jul 01, 2019, 10:00 AM IST
'దొరసాని' ట్రైలర్.. 'నా ప్రేమ కూడా ఉద్యమమే'!

సారాంశం

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా 'దొరసాని' అనే సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. 

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా 'దొరసాని' అనే సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. రాజశేఖర్ చిన్న కుమార్తె శివాత్మిక ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ద్వారా కేవీఆర్ మహేంద్ర దర్శకుడిగా పరిచయమవుతున్నారు. 

తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు. తెలంగాణలో 80వ దశకంలో దొరల కాలంలో జరిగిన ఒక నిజజీవిత ప్రేమకథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అప్పటి దొరల కాలం, తెలంగాణా ప్రాంతం వంటి అంశాలతో ట్రైలర్ ని కట్ చేశారు.

దొరల కుటుంబానికి చెందిన ఓ అమ్మాయి తక్కువ జాతిలో పుట్టిన ఓ కుర్రాడిని ప్రేమిస్తే ఏం జరుగుతుందనేదే ఈ సినిమా కథ.  దొరసానిగా శివాత్మిక లుక్ చాలా బాగుంది. 
ఆనంద్ దేవరకొండ కూడా పర్వాలేదనిపించాడు.

ట్రైలర్ లో సినిమాటోగ్రఫీ, డైలాగ్స్ హైలైట్ గా నిలిచాయి. 'నా ప్రేమ కూడా ఉద్యమమే' అంటూ ఆనంద్ దేవరకొండ చెప్పిన డైలాగ్ ఆకట్టుకునే విధంగా ఉంది. విజువల్స్ బాగున్నాయి. జూలై 12న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

ఆ ఒక్క కారణంతో యంగ్ డైరెక్టర్ ని రిజెక్ట్ చేసిన రవితేజ.. అతడే ఇప్పుడు 300 కోట్లు ఉఫ్ అని ఊదేస్తున్నాడు
Disaster Heroes: దారుణంగా పడిపోయిన ఈ హీరోల కెరీర్ గ్రాఫ్... ఆడియన్స్ ఇంట్రస్ట్ కూడా తగ్గిందా?