హైకోర్టులో బిగ్ బాస్ కి ఊరట!

Published : Jul 17, 2019, 04:23 PM IST
హైకోర్టులో బిగ్ బాస్ కి ఊరట!

సారాంశం

* బిగ్ బాస్ నిర్వాహకులకు హైకోర్టులో ఊరటలభించింది. * వారంలోపు కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. *బిగ్ బాస్ నిర్వాహకులను అరెస్ట్ చేయడానికి వీలులేదని తదుపరి విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేసింది హైకోర్టు. 

తెలుగులో రెండు సీజన్ లను పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో ఇప్పుడు మూడో సీజన్ కోసం సిద్ధమవుతోంది. అయితే ఈ షో మొదలుకాకముందే వివాదాలు చుట్టుముడుతున్నాయి. బిగ్ బాస్ షో కోసం ఎంపిక చేసే ప్రాసెస్ లో కూడా కాస్టింగ్ కౌచ్ ఉందంటూ యాంకర్ శ్వేతారెడ్డి, నటి గాయత్రి గుప్తా రాయదుర్గం, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లలో బిగ్ బాస్ షోపై  కేసులు పెట్టారు.

దీంతో బిగ్ బాస్ నిర్వాహకులు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. పోలీస్ స్టేషన్ లలో నమోదైన కేసులను కొట్టేయాలని పిటిషన్ వేశారు. ఈ క్రమంలో బిగ్ బాస్ నిర్వాహకులకు హైకోర్టులో ఊరట లభించింది. వారంలోపు కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

బిగ్ బాస్ నిర్వాహకులను అరెస్ట్ చేయడానికి వీలులేదని తదుపరి విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేసింది హైకోర్టు. ఇది ఇలా ఉండగా.. ఈ షోని సినిమాలాగా ఎపిసోడ్ లను సెన్సార్ చేయాలని కొందరు విజ్ఞప్తి చేస్తున్నారు. రాత్రి 11 గంటల తరువాత ప్రోగ్రాంని ప్రసారం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

నాగార్జునకి తలనొప్పి.. హైకోర్టుకి బిగ్ బాస్ టీమ్!

PREV
click me!

Recommended Stories

ప్రభాస్, రామ్ చరణ్ తో పాటు.. 2026లో బాక్సాఫీస్ ను షేక్ చేయబోతున్న స్టార్ హీరోల సినిమాలు
Bigg Boss Telugu 9: నిధి అగర్వాల్ కి చుక్కలు చూపించిన ఇమ్మాన్యుయేల్.. హౌస్ లో కూడా ఆమె పరిస్థితి అంతేనా ?