'మహానటి' కోసం ముందు నన్నే అడిగారు.. అమలాపాల్ కామెంట్స్!

Published : Jul 17, 2019, 04:02 PM IST
'మహానటి' కోసం ముందు నన్నే అడిగారు.. అమలాపాల్ కామెంట్స్!

సారాంశం

* 'మహానటి' సినిమాలో ముందుగా తనకు అవకాశం వచ్చిందని చెబుతోంది నటి అమలాపాల్. * కానీ అప్పటికే తన వ్యక్తిగత విషయాలతో సతమతమవుతున్నట్లు దాంతో సినిమా చేయలేకపోయానని అంటోంది

అలనాటి స్టార్ హీరోయిన్ సావిత్రి జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కిన 'మహానటి' సినిమాలో ముందుగా తనకు అవకాశం వచ్చిందని చెబుతోంది నటి అమలాపాల్. ఆమె ప్రధాన పాత్రలో నటించిన 'ఆమె' సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ విషయాన్ని వెల్లడించింది. 

'మహానటి' సినిమాలో ముందుగా తనకు ఛాన్స్ వచ్చిందని.. కానీ అప్పటికే తన వ్యక్తిగత విషయాలతో సతమతమవుతున్నట్లు దాంతో సినిమా చేయలేకపోయానని కానీ 'మహానటి' సినిమా కోసం చిత్రబృందం ముందు తననే సంప్రదించారనే విషయం మాత్రం నిజమని తెలిపింది.

అమలాపాల్ ఒప్పుకోకపోవడం వల్ల చిత్రబృందం కీర్తి సురేష్ ను ఎంపిక చేసుకుందని తెలుస్తోంది. అమలాపాల్ నటిస్తోన్న 'ఆమె' సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 

ఈ సినిమాలో ఆమె నగ్నంగా కనిపించబోతుంది. ఇటీవల విడుదలైన సినిమా టీజర్, ట్రైలర్ లలో అమలాపాల్ చాలా బోల్డ్ గా కనిపించింది. రత్నకుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు రానుంది. 

PREV
click me!

Recommended Stories

Sanjana Remuneration : విన్నర్ రేంజ్ లో పారితోషికం అందుకున్న సంజన గల్రానీ, 15 వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు ఎంత ఇచ్చారంటే?
Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి