పివి.సింధు బయోపిక్.. అరుంధతి విలన్ ఇంపార్టెంట్ రోల్!

Published : Dec 10, 2018, 07:58 PM IST
పివి.సింధు బయోపిక్.. అరుంధతి విలన్ ఇంపార్టెంట్ రోల్!

సారాంశం

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ప్రస్తుతం బయోపిక్ ల పర్వం ఏ విధంగా నడుస్తుందో అందరికి తెలిసిందే. క్రీడాకారుల నుంచి స్ఫూర్తిగా నిలిచినా ఎందరో ప్రముఖుల కథలను తెరపై చూపించడానికి సినీ ప్రముఖులు తెగ ఇష్టపడుతున్నారు. 

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ప్రస్తుతం బయోపిక్ ల పర్వం ఏ విధంగా నడుస్తుందో అందరికి తెలిసిందే. క్రీడాకారుల నుంచి స్ఫూర్తిగా నిలిచినా ఎందరో ప్రముఖుల కథలను తెరపై చూపించడానికి సినీ ప్రముఖులు తెగ ఇష్టపడుతున్నారు. అసలు మ్యాటర్ లోకి వస్తే బ్యాట్మింటన్ రంగంలో చరిత్ర సృష్టించిన పివి. సింధు బయోపిక్ కూడా రూపొందుతున్న సంగతి తెలిసిందే. 

ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఈ బయోపిక్ ను నిర్మించనున్నాడు. అయితే ఈ అరుంధతి విలన్ సినిమాలో ఒక మంచి పాత్ర పోషించనున్నట్లు క్లారిటీ ఇచ్చేశాడు. గత కొంత కాలంగా సింధు కోచ్ పుల్లెల గోపీచంద్ క్యారెక్టర్ గురించి అనేక రకాల రూమర్స్ వినిపించాయి. అయితే రూమర్స్ కి చెక్ పెడుతూ సినిమాలో గోపీచంద్ పాత్రలో కనిపించబోయేది తానే అని సోనూసూద్ వివరణ ఇచ్చాడు. 

ఇంకా సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చాలా జరగాల్సి ఉంది. ఇప్పటికే ఫుల్ స్క్రిప్ట్ రెడీ అయినప్పటికీదాన్ని లీడ్ చేయాల్సిన దర్శకుడు ఎవరనేది ఇంకా ఫైనల్ కాలేదు. త్వరలోనే స్పెషల్ ఎనౌన్స్మెంట్ తో సినిమాను మొదలుపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  

PREV
click me!

Recommended Stories

Janhvi Kapoor: త్వరలో ప్రియుడితో జాన్వీ కపూర్ పెళ్లి.. కెరీర్ పీక్ లో ఉండగా ఇలా, తండ్రి ఏమంటున్నాడో తెలుసా
Thalapathy Vijay: బాక్సాఫీస్ నుంచి బ్యాలెట్ బాక్స్ వరకు.. దళపతి విజయ్ మాస్ జర్నీ ఎలా సాగిందో తెలుసా?