నాన్న జీవితంపై డాక్యుమెంటరీ తీస్తా: జెమినీ గణేశన్ కూతురు

First Published May 21, 2018, 11:09 AM IST
Highlights

'మహానటి' సినిమా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే

'మహానటి' సినిమా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే సినిమాలో సావిత్రి భర్త నటుడు జెమినీ గణేశన్ పాత్రను డిజైన్ చేసిన తీరు, తెరపై ఆయన పాత్రను ప్రెజంట్ చేసిన విధానంపై జెమినీ గణేశన్ కూతురు కమలా సెల్వరాజ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తమిళ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ మహానటి టీమ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఈమె తన తండ్రి జీవితం ఆధారంగా డాక్యుమెంటరీ రూపొందించనున్నట్లు ప్రకటించారు.

తమిళ ప్రేక్షకులు జెమినీను 'కాదల్ మన్నన్'ని పిలుచుకునేవారు. అంటే కింగ్ ఆఫ్ రొమాన్స్ అని అర్ధం. ఈ డాక్యుమెంటరీకు అదే పేరును టైటిల్ గా పెట్టబోతున్నట్లు స్పష్టం చేశారు. గంట నలభై నిమిషాల రన్ టైం తో ఈ డాక్యుమెంటరీ సాగుతుందని.. తమిళంతో పాటు తెలుగులో కూడా దీన్ని విడుదల చేస్తామని ఆమె వెల్లడించారు. ఈ డాక్యుమెంటరీ ద్వారా 'మహానటి'లో తన తండ్రిని ఎంత తప్పుగా చూపించారనే విషయం ప్రజలకు అర్ధమవుతుందని ఆమె అన్నారు.

మహానటిలో నిజాలు చూపించడం మానేసి ఫిక్షన్ పై ఎక్కువగా దృష్టి పెట్టారని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. తన తండ్రి నటుడిగా ఎప్పుడూ బిజీగానే ఉన్నారని, అటువంటి వ్యక్తిని అవకాశాలు లేని వాడిగా చూపించారని పేర్కొన్నారు. మరి డాక్యుమెంటరీలో ఎలాంటి విషయాలను ప్రస్తావిస్తారో చూడాలి! 

click me!