పోకిరి సినిమా చూపిస్తూ.. బ్రెయిన్ ఆపరేషన్ చేసిన వైద్యులు..

Published : Feb 04, 2024, 12:18 PM IST
పోకిరి సినిమా చూపిస్తూ.. బ్రెయిన్ ఆపరేషన్ చేసిన వైద్యులు..

సారాంశం

సినిమా చూస్తూ బ్రెయిన్ ఆపరేషన్ చేయించుకన్నాడు ఓ పేషంట్.. తను అభిమానించే హీరో.. ఇష్టమైన  సినిమా చూస్తూ.. హాయిగా సర్జరీ చేయిచుకున్నాడు. ఇక వివరాల్లోకి వెళ్తే..?

ఈమధ్య బ్రెయిన్ ఆపరేషన్లు చేస్తున్నప్పుడు పేషంట్లు గిటారువాయించడం, సినిమాలు చూడటం, మ్యూజిక్ ఎంజాయ్ చేయడం..ఇలా రకరాల పనులు చేస్తూ.. ఆపరేషన్లు చేయడం.. చేయించుకోవడం చూస్తూనే ఉన్నాం. కాని అవన్నీ ఏ ఫారెన్ లోనో జరగడం తెలుసు కాని.. తాజాగా మన దేశంలో.. అది కూడా తెలుగు రాష్ట్రంలో ఇలాంటి ఆపరేషన్  ఒకటి జరిగింది. ప్రస్తుతం అది వైరల్ అవుతోంది. ఇంతకీ విషయం ఏంటీ అంటే..? 

గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రిలోని ఆపరేషన్‌ థియేటర్‌ లో రోగి మెలకువతో ఉండగానే బ్రెయిన్ ఆపరేషన్ చేశారు. పేషంట్  మహేష్ బాబు అభిమాని కాగా.. ఆయనకు ఎంతో  ఇష్టమైన పోకిరి సినిమా చూపిస్తూ వైద్యులు అతనికి బ్రెయిన్‌ ట్యూమర్‌ సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు.  అయితే ఇటువంటి ఆపరేషన్లు ప్రైవేట్ హాస్పిటల్స్ లో చాలా జరిగాయి. కాని ఒక గవర్నమెంట్ హాస్పిటలో లో ఇలాంటి ఆపరేషన్ జరగడం ఇదే మొదటి సారి. 

ఏపీ ప్రభుత్వ వైద్యరంగంలో మాత్రం  ఇలాంటి ఆపరేషన్ తొలిసారి అంటున్నారు..ఎవేకెన్‌ బ్రెయిన్‌ సర్జరీ చేసిన గుంటూరు జీజీహెచ్‌ వైద్యులు. ఇక వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం ఐలాపురానికి చెందిన కోటి పండు(48) కాలు, చేయి బలహీనపడి అపస్మారక స్థితికి చేరడంతో జనవరి 2న గుంటూరు ప్రభుత్వ సమగ్రాసుపత్రికి తీసుకొచ్చారు.న్యూరో విభాగం వైద్యులు పరీక్షలు చేసి మెదడులో ఎడమవైపు కుడి కాలు, కుడి చెయ్యి పనిచేసే నోటారకార్డెక్స్‌ భాగంలో కణితి ఉన్నట్టు గుర్తించారు. 

అయితే ఆపరేషన్‌ చేసి ట్యూమర్‌ తొలగించే ప్రక్రియలో కుడికాలు, కుడిచెయ్యి చచ్చుపడిపోయే అవకాశం ఉందని భావించిన డాక్టర్లు.  రోగి మెలకువగా ఉండగానే ఆపరేషన్‌ చేయాలని నిర్ణయించారు. అంతే కాదు ఈరకమైన  ఆపరేషన్‌కు రోగి సహకరించడంతో అతడి అభిమాన హీరో మహేష్‌బాబు నటించిన పోకిరి సినిమాను ల్యాప్‌టాప్‌లో చూపిస్తూ జనవరి 25న అవేక్‌ బ్రెయిన్‌ సర్జరీ చేసి కణితి తొలగించినట్టు వివరించారు. 


ఆపరేషన్‌ చేసిన తరువాత రోగికి ఎటువంటి ప్రాబ్లమ్ రాకపోవడం.. ఆతరువాత కోలుకోవడంతో ఈ శనివారం డిశ్చార్జి చేశామన్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతే కాదు.. ఏపి ప్రభుత్వ వైద్యులపై ప్రసంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా ఈ న్యూస్ లో తమ గ్రూప్స్ లో శేర్ చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు
BMW Teaser: 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ రివ్యూ.. వరుస డిజాస్టర్లతో రూటు మార్చిన రవితేజ, రొమాన్స్ షురూ