మహేష్ బాబు వేసుకున్న జాకెట్ ధర అన్ని లక్షలా..? వింటే అవాక్కవుతారు..?

By Mahesh JujjuriFirst Published Feb 4, 2024, 9:48 AM IST
Highlights

ఈమధ్య సెలబ్రిటీలు వాడే వస్తువులు.. తిరిగే కార్లు.. వేసుకునే బట్టల కాస్ట్ చూస్తే కళ్లు తిరిగిపోతున్నాయి. చిన్న చిన్న వాటికే లక్షలు పోసేస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రాండ్ జాకెట్ కాస్ట్ వైరల్ అవుతోంది.


గుంటూరు కారం హడావిడి అయిపోయింది. ఇక రాజమౌళి సినిమా కోసం రంగం సిద్దం చేసుకుంటున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ప్రస్తుతం ఈ స్టార్ హీరో జర్మనీలో ఉన్నాడు. అక్కడ ఓ డాక్టర్ ను కలిసి ఫిట్ నెస్ కు సబంధించిన ట్రీట్మెంట్ ఏదో  ప్రస్తుతం మహేష్ బాబు.. 50 ఏళ్ళకు కూడా కుర్రహీరోలా ఉండటానికి ఆ డాక్టర్ చెప్పినవి చేయడం వల్లే అంటూ టాలీవుడ్ ల టాక్. ఇక రాజమౌళి సినిమా కోసం..సరికొత్తగా మేకోవర్ అవ్వడానికి వెళ్లాడట మహేష్. అందుకే సింగిల్ గా..సోలో ట్రిప్ వేశాడ సూపర్ స్టార్. 

జక్కన్న పాన్ వరల్డ్‌ మూవీ ప్రీప్రొడక్షన్స్‌ వర్క్‌లో భాగంగా స్టంట్స్‌లో..యాక్షన్‌లో.. ఫారెన్లో ట్రైనింగ్ తీసుకుంటున్నారు మహేష్ బాబు. రీసెంట్‌గా ట్రెక్కింగ్ చేస్తూ.. కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అయితే ఈ ఫోటోలో మహేష్ బాబు డాక్టర్ తో కలిసి ఉన్నాడు.. నమ్రతను, పిల్లలను మిస్ అవుతున్నాడు అనే పాయింట్ మాత్రమే చూశారు కాని.. కొంత మంది నెటిజన్లు మాత్రం మహేష్ బాబు ఆ టైమ్ లో వేసుకున్న జాకెట్ గురించి ఆరా తీయ్యడం స్టార్ట్ చేశారు. అది ఏ బ్రాండ్..? కాస్ట్ ఎంత..? ఇలా రకరకాలుగా ఆరాలు తీసి.. మొత్తానికి సాధించారు. 

Latest Videos

 

 మహేష్. డాక్టర్ హ్యారీతో మహేష్ కలిసి ఉన్న ఫోటోలలో సూపర్ స్టార్ బ్రూనెల్లో కుసినెల్లి బ్రాండ్ ధరించాడు. సింపుల్ అండ్ స్టైలీష్ గా కనిపిస్తున్న ఆ జాకెట్ ధర ఎంతో తెలుసా..? తెలిస్తే  అవాక్కవుతున్నారు నెటిజన్స్. ఇంతకీ దాని విలువ ఎంతో తెలుసా ?.. అక్షరాల 3.18 లక్షలు. బ్రూనెల్లో కుసినెల్లి అనేది ఇటాలియన్ ప్రీమియం ఫ్యాషన్ బ్రాండ్. ఇది చాలా క్వాలిటీ ప్రాడెక్ట్స్ తయారు చేయడంలో బ్రాండ్ ఇమేజ్ ను కలిగి ఉంది. స్టార్ సెలబ్రిటీస్ చాలా మంది ఈ బ్రాండ్ ను యూస్ చేస్తారు. 


 

click me!