తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ వరుస చిత్రాలను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా 170వ సినిమాను అనౌన్స్ చేయగా.. తాజాగా 171వ చిత్రాన్ని సెన్సేషనల్ డైరెక్టర్ తో లాక్ చేసినట్టు తెలుస్తోంది.
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) యంగ్ హీరోలతో పోటీపడి మరీ జోష్ గా సినిమాలు చేస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో దుమ్ములేపుతున్నారు. గతేడాది ‘అన్నాతే’ చిత్రంతో అలరించిన రజినీ ప్రస్తుతం మూడు చిత్రాలను లైన్ లో పెట్టారు. ఒక్కో చిత్రాన్ని పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం Thalaivar 171కి కూడా రజినీకాంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అంతే కాదు ఈ చిత్రానికి తమిళ క్రేజీ డైరెక్టర్ దర్శకత్వం వహించబోతున్నారని కోలీవుడ్ వర్గాల్లో గట్టి ప్రచారం జరుగుతోంది.
తాజా సమాచారం ప్రకారం.. రజినీకాంత్ తన 171వ చిత్రాన్ని ‘మాస్టర్’,‘ఖైదీ’,‘విక్రమ్’ చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన లోకేష్ కనగరాజ్ (Lokesh Kangaraj) డైరెక్షన్ లో నటించబోతున్నట్టు తెలుస్తోంది. ఈమేరకు కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం ‘లియో’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత రజనీతో సినిమా చేయబోతున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే ఇండియా మొత్తంగా కనగరాజ్ తన డైరెక్షన్ తో సత్తా చాటారు. ఆడియెన్స్ లో మంచి క్రేజ్ దక్కించుకున్నారు. ఈ క్రమంలో రజినీతో ఎలాంటి చిత్రం తీయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతం రజినీ‘బీస్ట్’ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ‘జైలర్’ (Jailer) చిత్రంలో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ క్- తమన్నా భాటియా జంటగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ తుది దశకు చేరుకుంది. దీని తర్వాత రజనీ తన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ (Aishwarya Rajinikanth) దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న 'లాల్ సలామ్' Lal Salaam సెట్స్‌లో జాయిన్ కానున్నారు. పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. 'లాల్ సలామ్' చిత్రానికి సంగీతం: ఎ.ఆర్. రెహమాన్ అందిస్తున్నారు. విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రలు పోషించగా, సెంథిల్ సహాయక పాత్రల్లో నటిస్తున్నారు. చిత్రంలో టాప్ కామెడీ, క్యారెక్టర్ యాక్టర్ తంబి రామయ్య కూడా ఉన్నారు.
ఈ చిత్రం తర్వాత రజనీ తన 170వ చిత్రంలో నటించనున్నారు. ‘జై భీం’ దర్శకుడు డీజే జ్ఞానవేల్ డైరెక్ట్ చేయబోతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా కంపెనీ Thalaivar 170గా వర్క్ టైటిల్ ను కూడా అనౌన్స్ చేసింది. అనిరుధ్ సంగీతం అందించనున్నారు. ప్రస్తుతం రజినీ చేతిలో క్రేజీ ప్రాజెక్ట్స్ ఉండటంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.