టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత - అక్కినేని నాగచైతన్య జంటగా నటించిన చిత్రం ‘మజిలి’ విడుదలై నేటికీ నాలుగేండ్లు పూర్తైంది. దీంతో సమంత సినిమా చేసే సమయంలో తనకున్న జ్ఞాపకాలను అభిమానులతో షేర్ చేసుకోవడం ఆసక్తికరంగా మారింది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం సమంత సౌత్ సినిమాలే కాకుండా బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాల్లోనూ ఆఫర్లను దక్కించుకుంటోంది. అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya)తో విడాకుల తర్వాత కేరీర్ పైనే ఫుల్ ఫోకస్ పెట్టారు సామ్. ‘పుష్ప’లోని స్పెషల్ నెంబర్ లో నటించడం మొదలు వరుస చిత్రాలతో హిట్లు అందుకుంటూ వస్తున్నారు. ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకుంటున్నారు.
అయితే, నాగచైతన్య - సమంత జంటగా నటించిన చిత్రం ‘మజిలి’ Majili. శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ఈ రొమాంటిక్ స్పోర్ట్స్ డ్రామా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. 2019 ఏప్రిల్ 5న విడుదలైన ఈ చిత్రానికి ఆడియెన్స్ తో పాటు క్రిటిక్స్ నుంచి ప్రశంసలు దక్కాయి. బాక్సాఫీస్ వద్ద కూడా మంచి కలెక్షన్లను రాబట్టింది. అటు నాగచైతన్య, ఇటు సమంత నటనకు ఫ్యాన్స్ తో పాటు ఆడియెన్స్ కూడా ఫిదా అయ్యారు. అయితే ఈరోజుతో ఈ చిత్రం విడుదలై నాలుగేండ్లు పూర్తైంది. ఈ సందర్భంగా సామ్ తన మెమోరీస్ ను షేర్ చేసుకున్నారు.
‘మజిలి’ నాలుగేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సమంత ఇంట్రెస్టింగ్ గా పోస్టు పెట్టారు. తన డైరెక్టర్ శివ నిర్వాణతో కలిసి ‘మజిలి’ సెట్స్ లో సందడి చేసిన ఓ ఫొటోను పంచుకుంది. ‘లవ్ యూ శివ నిర్వాణ. శ్రావణి లాంటి రోల్ ను అందించినందుకు. ఇక ప్రస్తుతం ఖుషిలో ‘ఆరాధ్య’తో అదరగొడుదాం’ అంటూ తన ఫీలింగ్ ను షేర్ చేసుకున్నారు. అలాగే మజిలిలోని తన ఎంట్రీ సీన్ ను ఇన్ స్టా స్టోరీలో షేర్ చేశారు. ఆ పోస్టులను ఫ్యాన్స్ నెట్టింట వైరల్ చేస్తున్నారు.
డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఖుషి’ Khushi. విజయ్ దేవరకొండ - సమంత జంటగా నటిస్తున్నారు. ఇప్పటికే పలు షెడ్యూళ్లు కూడా పూర్తయ్యాయి. ప్రస్తుతం షూటింగ్ చకాచకా కొనసాగుతోంది. సెప్టెంబర్ 1, 2023న తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఇక సమంత నటించిన ‘శాకుంతలం’ చిత్రం ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకురానుంది. ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్స్ లో సామ్ ఫుల్ బిజీగా ఉన్నారు.
entry in is nothing less than the hero's entry 😍
One of the best entry scenes for any actress...Sam's innocent look & screen presence ❤️
- A character role that f will never forget. BGM ❤️
pic.twitter.com/V6WekuYHid