బలగం టీమ్ ను ఘనంగా సన్మానించిన మోహన్ బాబు, మంచు వారింట బలగం టీమ్ సందడి

Published : Apr 05, 2023, 05:21 PM IST
బలగం టీమ్ ను ఘనంగా సన్మానించిన మోహన్ బాబు,  మంచు వారింట బలగం టీమ్ సందడి

సారాంశం

ప్రస్తుతం టాలీవుడ్ లో బలగం సినిమా మ్యానియా నడుస్తోంది. ఎక్కడ చూసినా.. ఈసినిమా గురించే చర్చ. ముఖ్యంగా తెలంగాణ పల్లెల్లో ఈమూవీ గురించి అరుగుల మీద కూర్చొని మరీ.. మాట్లాడుకుంటున్నారు.. ఇక టాలీవుడ్ వుడ్ పెద్దల నుంచి కూడా బలగం కు బలమైన సపోర్ట్ లభిస్తుంది.


ఫస్ట్ సినిమా బలగంతో తన బలం ఎంతో నిరూపించుకున్నాడు వేణు. చిన్న కమెడియన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. జబర్థస్త్ షోతో పాపులర్ అయ్యాడు వేణు. కామెడీ రోల్స్ చేస్తూ.. సైలెంట్ గా దర్శకుడి అవతారం ఎత్తాడు. అచ్చ మైన తెలంగాన పల్లెలో.. మన పక్కింట్లో ఏం జరుగుతుంది.. ఎదురింటి గొడవలు.. పంచాయితీలో పెద్దల మాట, కుటుంబంలో అన్నదముమలు మధ్య గొడవలు.. ఇలాంటి సన్నివేశాలతో.. ఏమాత్రం కృత్రిమత్వం లేకుండా.. సహజసిద్థంగా సినిమా చేసి చూపించాడు వేణు. ఈసినిమాలో సెంటిమెంట్ తో.. ప్రతీ ఒక్కరిని కంటతడి పెట్టించాడు. 

ఇక ఈసినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఫిల్మ్ సెలబ్రిటీలు కూడా ఈసినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దిల్ రాజు రిలీజ్ చేసిన ఈసినిమాకు అన్ని వర్గాల నుంచి ఆదరణ లభిస్తుంది. రీసెంట్ గా భోళా శంకర్ సెట్ లో మెగాస్టార్ చిరంజీవి వేణు టీమ్ ను పిలిపించుకుని.. ప్రత్యేకంగా అభినందించారు. శాలువాలు, బొకేలతో వేణు, ప్రియదర్శిలను సత్కరించాడు. దాంతో టీమ్ సంతోషానికి అవదుల్లేకుండా పోయింది. 

 

ఇక ప్రస్తుతం మంచువారింట్లో బలగం టీమ్ సందడి చేసింది. రీసెంట్ గా బలగం సినిమా చూసిన మంచు మోహన్ బాబు, మంచు విష్ణు .. టీమ్ ను తమ ఇంటికి ఆహ్వానించారు. ఈ సినిమాను చూసి చాలా ఎమోషనల్ అయినట్టు వారు వెల్లడించారు. వెంటనే మూవీ టీమ్ ను ఇంటికి పిలిపించారు. తొలి ప్రయత్నంలోనే అద్భుతమైన సినిమాను తెరకెక్కించాడని.. సినిమాలో చేసిన ప్రతి ఒక్కరు తమ తమ పాత్రల్లో జీవించారని ప్రశంసించారు. ఈ క్రమంలో.. ఈసినిమాలో  నటించిన ప్రియదర్శి, రూపా లక్ష్మితో పాటు దర్శకుడు వేణుని ఇంటికి ఆహ్వానించి.. మోహన్ బాబు, విష్ణు సత్కరించారు. ఈ ఫోటోలు ప్రస్తుం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

PREV
click me!

Recommended Stories

జైలర్ 2 లో తమన్నాకి నో ఛాన్స్.. రజినీకాంత్ తో ఐటెం సాంగ్ లో స్టెప్పులేయబోతున్న బ్యూటీ ఎవరో తెలుసా ?
చిరంజీవి ఫ్రెండ్ తో లవ్ ఎఫైర్ పెట్టుకున్న స్టార్ హీరోయిన్ ? పెళ్లి కాకుండా ఒంటరిగా మిగిలిపోయింది