మంచువారింట సన్నీ లియోన్ సందడి, ఆలూ పరాటా రుచి చూపించిన బాలీవుడ్ బ్యూటీ

Published : Apr 21, 2022, 01:12 PM ISTUpdated : Apr 21, 2022, 01:13 PM IST
మంచువారింట సన్నీ లియోన్ సందడి, ఆలూ పరాటా రుచి చూపించిన బాలీవుడ్ బ్యూటీ

సారాంశం

కొన్ని రోజులుగా హైదరాబాద్ లో సందడి చేస్తోంది బాలీవుడ్ శృంగార తార సన్నీలియోన్. మంచువారి ఆతిథ్యాన్ని అందుకుని ఆనందిస్తోంది. రిటర్న్ గిఫ్గ్ గా మంచువారికి వండిపెడుతోంది కూడా.   

కొన్ని రోజులుగా హైదరాబాద్ లో సందడి చేస్తోంది బాలీవుడ్ శృంగార తార సన్నీలియోన్. మంచువారి ఆతిథ్యాన్ని అందుకుని ఆనందిస్తోంది. రిటర్న్ గిఫ్గ్ గా మంచువారికి వండిపెడుతోంది కూడా. 

బాలీవుడ్ శృంగార తార సన్నీ లియోన్ ఈమధ్య టాలీవుడ్ లో కూడా ఎక్కువగా సందడి చేస్తోంది. మన టాలీవుడ్  ప్రేక్షకులకు కూడా సన్నీ బాగా దగ్గరయ్యింది. టాలీవుడ్ లో ఆమెకు డై హార్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇక ఈ మధ్య హైదరాబాద్ లో .. మంచువారి ఇంట్లో తెగ సందడి చేస్తోంది బాలీవుడ్ స్టార్. గతంలో మంచు మనోజ్ కరెంట్ తీగ లో సన్నీ నటించి మెప్పించింది. ఇక  ఇప్పుడు మంచు విష్ణు సినిమాలో నటిస్తోంది. 
బాలీవుడ్ లో హాట్ బ్యూటీగా పేరున్న ఈబ్యూటీ తెలుగులో.. ఇప్పటికే మూడు సినిమాలు చేయగా.. అందులో రెండుసినిమాలు మంచు వారివే అవ్వడం విశేషం. 

మరోవైపు మంచు విష్ణు సినిమాలో నటిస్తున్న సన్నీ హైదరాబాదులో ఎంజాయ్ చేస్తోంది. తాజాగా మంచు విష్ణు ఇంట్లో ఆమె  సందడి చేస్తోంది. ఆమధ్య మంచు విష్ణు, శివబాలాజీతో కలిసి ఫన్నీ వీడియో చేసి సోషల్ మీడియలో రిలీస్ చేయగా మంచి రెస్పాన్స్వ వచ్చింది. 
ఇక ఇప్పుడు సన్నీ లియోన్ ఏకంగా మంచు విష్ణు ఇంట్లో వంట చేస్తూ.. హడావిడి చేసింది.  ఆమె ఆలూ పరాటా తయారు చేసి మంచు ఫ్యామిలీకి టేస్ట్ చూపించింది. ఆ ప్రాసెస్ అంతా వీడియో చేసిన మంచు విష్ణు.. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా... ప్రస్తుతం అది వైరల్ అవుతోంది. 

 

హాఫ్ శారీ కట్టుకున్న సన్నీ లియోన్ విష్ణు ఇంట్లో ఉన్న కిచెన్ లో పరాటా చేసింది. పక్కన ఉన్న విష్ణు ఆమెకు ట్రైనింగ్ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఇద్దరూ సరదాగా మాట్లాడుతూ జోక్స్ వేసుకున్నారు. తమ కాలేజీ రోజుల్లో ఎవరైనా బ్యాక్ ఓపెన్ అయినట్టు ఉంటే ఆమ్లెట్ వేసేవాళ్లమని విష్ణు చెప్పాడు. ఇలా ఫన్నీ ఫన్నీ మాటలతో... సరదా సరదా జోక్స్ తో సందడిగా ఉన్న వీడియో..నెట్టింట్లో హడావిడి చేస్తోంది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?