Vaishnav Tej : చిరుపై అభిమానం.. మెగా ఫ్యామిలీలో ఉన్నా వైష్ణవ్ తేజ్ అలా చేశాడంటే.!

By Asianet News  |  First Published Nov 21, 2023, 5:39 PM IST

తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవికి అభిమానులు ఏ రేంజ్లో ఉంటారో తెలిసిందే. అప్పుడప్పుడు పలు రకాలు వారి అభిమానాన్ని చాటుకుంటుంటారు. వైష్ణవ్ తేజ్ కూడా వినూత్నంగా తన అభిమానాన్ని చూపించారు. 


 

మెగా స్టార్ చిరంజీవి (Chiranjeevi)  తెలుగు చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఎన్నో రికార్డులను క్రియేట్ చేశారు. ఎందరికో స్ఫూర్తినిచ్చారు. మెగా ఫ్యామిలీ నుంచి తెలుగు పరిశ్రమకు హీరోలనూ కూడా అందించారు. ఆరుపదుల వయస్సు దాటినా ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీగా సినిమాలు చేస్తున్నారంటే.. ఆయనపై అభిమానులు చూపించే ప్రేమ ఎంతటి అర్థం చేసుకోవచ్చు. 

Latest Videos

undefined

అయితే, పంజా వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) ప్రస్తుతం ‘ఆదికేశవ‘ Aadhikeshava  చిత్ర ప్రచారంలో బిజీగా ఉన్నారు. పలు కార్యక్రమాలకు హాజరవుతూ తన సినిమా బాగా ప్రమోట్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో తాజా ఇంటర్వ్యూలో చిరంజీవికి తాను ఎంత పెద్ద అభిమానో చెప్పుకొచ్చారు. మెగా ఫ్యామిలీలో ఫుట్టినప్పటికీ, మెగా స్టార్ చేతుల్లో పెరిగినప్పటికీ సాధారణ అభిమానుల వలే తన ప్రేమను వినూత్నంగా తెలియజేసే ప్రయత్నం చేశాడంట.

అదేంటో కాదు.. అప్పట్లో చిరు అభిమానులు ఆయన ఫొటోలను, పేర్లను పచ్చబొట్టు వేయించుకుని ప్రేమను చాటుకునే వారు. ఇక వైష్ణవ్ తేజ్ తలపై వెనకభాగంలో చిరుపేరు వచ్చేలా హెయిర్ కట్ చేయించారు. ఆ ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఎక్కువ సందర్భాల్లో వైష్ణవ్ తన అభిమానాన్ని చెప్పకున్నా.. ఈ ఫొటోను చూస్తే చిరుపై ఎంత ప్రేమ ఉందో  అర్థం చేసుకోవచ్చు.  మెగా ఫ్యామిలీలో ఉండి కూడా ఇంత ప్రత్యేకంగా అభిమానాన్ని చాటుకున్నారంటే చిరుకు ఎంత పెద్ద ఫ్యానో అర్థమవుతుంది.

ఇక వైష్ణవ్ `ఉప్పెన` సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి  బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత వచ్చిన ‘కొండపొలం’, ‘రంగ రంగ వైభవంగా’ చిత్రాలు పరాజయం అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో  `ఆదికేశవ` చిత్రంలో ఎలాగైనా హిట్ కొట్టాలని వస్తున్నారు. ఇందులో టాలీవుడ్ యంగ్‌ సెన్సేషన్‌ శ్రీలీల (Sreeleela)  కథానాయికగా నటించింది. మలయాళ నటులు అపర్ణ దాస్‌, జోజు జార్జ్ ముఖ్య పాత్రల్లో అలరించనున్నారు. దీంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ కు మాసీవ్ రెస్పాన్స్ దక్కుతోంది. నవంబర్ 24న ఈ చిత్రం థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది.  

click me!