Balakrishna: ఊటీ ఫ్లైట్ ఎక్కబోతున్న బాలయ్య, స్పీడ్ పెంచిన బాబీ..

Published : Nov 21, 2023, 05:23 PM ISTUpdated : Nov 21, 2023, 05:26 PM IST
Balakrishna: ఊటీ ఫ్లైట్ ఎక్కబోతున్న బాలయ్య, స్పీడ్ పెంచిన బాబీ..

సారాంశం

దూసుకెళ్తున్నాడు బాలయ్య బాబు. ఏమాత్రం తగ్గడం లేదు.కుర్ర హీరోలు కుళ్లు కునేలా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తోన్న బాలయ్య.. ప్రస్తుతం బాబీ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఊటీ ఫ్లైట్ఎక్కడానికి రెడీ అవుతున్నాడు బాలయ్య బాబు.    

నందమూరి నట సింహం బాలకృష్ణ  హీరోగా  మెగా హీరో బాబీ  దర్శకత్వంలో తెరకెక్కుతుంది సినిమా. NBK109 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈసినిమాను  శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు కలిపి  సంయుక్తంగా  నిర్మిస్తున్నాయి.  త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య, సూర్యదేవర నాగవంశీ నిర్మాతలు.  భగవంత్ కేసరి సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టాడు బాలయ్య. నెక్ట్స్ సినిమాలను కూడా జాగ్రత్తగా సెలక్ట్ చేసుకుంటున్నాడు. 

వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు బాలయ్య.. తాజాగా హ్యాట్రిక్ హిట్ కూడా కొట్టాడు.  బాలకృష్ణ కెరీర్ లో 109వ సినిమాగా రూపొందుతున్న ఈ మూవీ నుంచి తాజాగా ఓ అప్ డేట్ వినిపిస్తోంది. పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లో.. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ మాస్ ఇమేజ్ కు తగ్గట్టుగా కథను తయారు చేశాడు బాబీ. అంతే కాదు బాలయ్య బాబు బర్త్ డే సందర్భంగా సెట్స్ ఎక్కింది మూవీ. ఇక ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే  ఫస్ట్ షెడ్యుల్ షూట్ కంప్లీట్ అవ్వగా.. సెకండ్ షెడ్యుల్ కోసం రెడీ అవుతున్నారు టీమ్. 

అయితే ఈసెకండ్ షుడ్యూల్ ను అవుడోర్ లో ప్లాన్ చేస్తున్నాడు బాబీ.  ప్రస్తుతం రెండో షెడ్యూల్ షూటింగ్ కు టీమ్  రెడీ అవుతోంది. తాజా షెడ్యూల్ ను ఊటీలో ప్లాన్ చేస్తున్నారట. అంతే కాదు  ఈ నెల 24 నుంచి అక్కడ షూటింగ్ మొదలు కానుంది. హీరో బాలయ్యతో పాటుగా లీడ్ కాస్ట్ అంతా ఊటీలో వాలిపోబోతున్నారు.  

ఈమూవీ సెకండ్ షెడ్యూల్ అయిన తరువాత  అప్ డేట్స్ ను వరుసగా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే.. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ ఈమూవీ నుంచి  ఓ కాన్సెప్ట్ పోస్టర్ ను రిలీజ్ చేశారు టీమ్.  గొడ్డలి, సుత్తి, కత్తి సహా  కొన్ని వెపన్స్ తో కూడిన ఈ పోస్టర్ ను రూపొందించారు. 'వయలెన్స్ కి విజిటింగ్ కార్డు' అంటూ క్యాప్షన్ పెట్టారు. ఈ పోస్టర్ చూసి అభిమానులు బాలయ్య నుంచి మరో ఊచకోత మూవీ రాబోతోందంటూ కామెంట్స్ చేశారు. ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు వెల్లడించారు. వచ్చే ఏడాది వేసవికి సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.   

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode:అత్తను ఒప్పించిన దీప-సారీ చెప్పిన శౌర్య-కావేరికి దొరికిపోయిన శ్రీధర్
OTT లో ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాలు వెబ్ సిరీసులు, సస్పెన్స్,థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి పండగే..