శ్రీసత్యకు మెహబూబ్ లవ్ ప్రపోజల్... నో అనడంతో ఆత్మహత్యాయత్నం!

Published : Feb 15, 2023, 04:58 PM ISTUpdated : Feb 15, 2023, 05:08 PM IST
శ్రీసత్యకు మెహబూబ్ లవ్ ప్రపోజల్... నో అనడంతో ఆత్మహత్యాయత్నం!

సారాంశం

యూట్యూబర్ మెహబూబ్ శ్రీసత్య ప్రేమలో పడిపోయాడట. ఐ లవ్ యూ అంటూ ప్రేమికుల రోజు ప్రపోజ్ చేశాడు. అయితే శ్రీసత్య నో అనడంతో ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు.   

శ్రీసత్యలో ఏదో మాయ ఉంది. ఆమెను చూడగానే కుర్రాళ్లు పడిపోతున్నారు. బిగ్ బాస్ హౌస్లో ఇద్దరిని ఫ్లాట్ చేసింది. అర్జున్ కళ్యాణ్ అయితే ఇప్పటికీ కుక్కపిల్లలా చుట్టూ తిరుగుతున్నాడు. శ్రీహాన్ సైతం శ్రీసత్యతో రొమాన్స్ చేశాడు. శ్రీహాన్ మీద ఆమె కూడా ఇంట్రెస్ట్ చూపడం విశేషం. తాజాగా మెహబూబ్ వంతు. బీబీ జోడీలో మెహబూబ్-శ్రీసత్య జంటగా పెర్ఫార్మ్ చేస్తున్నారు. పిచ్చెక్కించే రొమాంటిక్ సాంగ్స్ సెలెక్ట్ చేసుకుంటున్న ఈ జంట... వేదికపై మమేకమై నర్తిస్తున్నారు. మెహబూబ్-శ్రీసత్య మధ్య కెమిస్ట్రీ అద్బుతమన్న మాట వినిపిస్తోంది. 

ఈ క్రమంలో మెహబూబ్ ఆమెకు ఆకర్షితుడు అయ్యాడు. మనసులో శ్రీసత్య అంటే ప్రేమ కలిగింది. సందర్భం కోసం ఎదురుచూస్తున్న మెహబూబ్ ఫిబ్రవరి 14న లవ్ ప్రపోజల్ పెట్టాడు. నేరుగా శ్రీసత్య వద్దకు వెళ్లి నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు. పక్కనే మెహబూబ్ టీమ్ మెంబర్స్ కూడా ఉన్నారు. శ్రీసత్య మొదట ఫ్రాంక్ అని భావించింది. అయితే మెహబూబ్ సీరియస్ గా రెండు నెలల నుండి ప్రేమిస్తున్నానని చెప్పడంతో షాక్ అయ్యింది. ఇవేమీ వద్దు. నాకు రిలేషన్స్ సెట్ కావు. ఒకసారి దెబ్బతిన్నాను... నాకు వద్దని శ్రీసత్య వారించింది. 

బిగ్ బాస్ హౌస్లో ఇదే పెంట అయ్యింది. మళ్ళీ బీబీ జోడీలో కూడానా. నా వాల్ల కాదు. నాకు నా భవిష్యత్ ముఖ్యమని అక్కడ నుండి వెళ్ళిపోయింది. మెహబూబ్ మాత్రం ఒప్పించేందుకు మాక్సిమమ్ ట్రై చేశాడు. సత్య వెళ్లిపోవడంతో మెహబూబ్ హర్ట్ అయ్యాడు. తన ప్రేమను ఒప్పుకోనందుకు ఆత్మహత్యాయత్నం చేశాడు. శ్రీసత్యతో పాటు పక్కన ఉన్న ఇద్దరూ మెహబూబ్ ని ఆపారు. ఒక పది నిమిషాల హైడ్రామా నడిచింది. వెంటనే మెహబూబ్ జస్ట్ ప్రాంక్ అని చెప్పి షాక్ ఇచ్చాడు.

మెహబూబ్ తన యూట్యూబ్ ఛానల్ కోసం ఈ ఫ్రాంక్ వీడియో చేశారు. మెహబూబ్ బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొన్నారు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా చాలా వారాలు హౌస్లో ఉన్నాడు. మెహబూబ్ ఫ్రెండ్ సోహైల్ ఫైనల్ కి వెళ్ళాడు. ఫినాలేలో డబ్బులు తీసుకొని టైటిల్ రేసు నుంచి తప్పుకున్నాడు. ఫైనల్ కి ముందు బిగ్ బాస్ హౌస్ కి వెళ్లిన మెహబూబ్ ఫ్రెండ్ సోహైల్ కి సైగలతో మేటర్ లీక్ చేశాడని, అందుకే డబ్బులు తీసుకొన్నాడన్న అపవాదు మోశాడు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?