మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కూతురు పుట్టిన ఆనందంలో మునిగి తేలుతున్నారు. నిన్న ఫస్ట్ టైమ్ మీడియా ముందుకూ వచ్చారు. ఈ సందర్భంగా చెర్రీకి సంబంధించిన క్రేజీ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది.
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ - ఉపాసన తల్లిదండ్రులయ్యారు. కొణిదెల వారి ఇంట మెగా ప్రిన్సెస్ అడుగుపెట్టింది. ఈనెల 20న ఉదయం ఒంటిగంట ప్రాంతంలో పుట్టినట్టు చిరంజీవి వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో మెగా ఇంట సంబురాలు జరుగుతున్నాయి. అభిమానులు, మెగా ఫ్యామిలీ, శ్రేయోభిలాషులు చెర్రీఉపాసన దంపతులకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఆ రోజు Mega Princess ట్విట్టర్ ఇండియా వైడ్ ట్రెండ్ అయ్యింది.
ఇక నిన్న రామ్ చరణ్ - ఉపాసన (Upasana) తొలిసారిగా మీడియా ముందుకు వచ్చారు. కూతురు పుట్టడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఆశీర్వదించిన అభిమానులు, శ్రేయోభిలాషులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇదిలా ఉంటే.. తాజాగా చెర్రీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. అందేంటో కాదు చరణ్ ధరించిన వాచ్ గురించే. ఆ వాచ్ ధర ఎంతో తెలిస్తే అందరూ నోరెళ్ల బెట్టాల్సిందే.
రిచర్డ్ మిల్లే బ్రాండ్ కు చెందిన వాచ్ ను చరణ్ ధరించారు. ఆ వాచ్ ధర ఎంతనే దానిపై కొందరు అభిమానులు సెర్చ్ చేశారు. అక్షరాల రూ.కోటీ 62 లక్షలకు పైగా ఉంటుందని తెలుస్తోంది. విషయం తెలుసుకున్న ఫ్యాన్స్,, నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఆ డబ్బుతో లగ్జరీ ఇల్లు కొనొచ్చు సామీ అంటూ.. ఆ వాచ్ అమ్మితే మా బ్యాచ్ సెటిల్ అయిపోద్ది అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇక గతంలో ఓ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ తనకు వాచ్ లు అంటే ఎంతో ఇష్టమని చెప్పారు. కార్లు, ఇతర వస్తువులకన్నా వ్రిస్ట్ వాచెస్ పై చాలా మక్కువ ఉంటుందని తెలిపారు. ఈ క్రమంలో తాజాగా చరణ్ ధరించిన వాచ్ కోసం అంత ఖర్చు పెట్టారని ఆశ్చర్యపోతున్నారు. ఇక ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత నుంచి రామ్ చరణ్ డ్రెస్సింగ్ స్టైల్, హెయిర్ స్టైల్స్ ట్రెండింగ్ గా మారుతున్న విషయం తెలిసిందే.
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. తమిళ స్టార్ డైరెక్టర్ ఎస్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్. థమన్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఉపాసన పండంటి పాపకు జన్మనివ్వడంతో కొద్ది రోజులు షూటింగ్ కు దూరంగా ఉంటారని అందరూ భావించారు. కానీ అలాంటివేవీ లేవని.. చరణ్ షూట్ కు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతం శంకర్ ‘ఇండియన్ 2’తో బిజీగా ఉన్నారు. త్వరలోనే Game Changer షూట్ రెస్యూమ్ కానుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.