
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కలిసి నటించిన పవర్ ఫుల్ యాక్షన్ డ్రామా ‘ఆచార్య’. ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన ట్రైలర్, టీజర్, సాంగ్స్ ఇప్పటికే సినిమాపై భారీ హైప్ ను పెంచాయి. మరోవైపు కొరటాల శివ దర్శకత్వం వహించడం, మెగా తండ్రీకొడుకులు నటించడంతో అభిమానులు సినిమాకోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలను షురూ చేసిన చిత్ర యూనిట్ నిన్న Acharya ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లోని యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ లో గ్రాండ్ గా నిర్వహించారు.
ఈ ఈవెంట్ కు చిరంజీవీ, రామ్ చరణ్, ముఖ్య అతిథిగా రాజమౌళి, దర్శకులు కొరటాల శివ, బాబీ, మోహన్ రాజా, మేహర్ రాజా, నిర్మాతలు నిరంజన్ రెడ్డి, డీవీవీ దానయ్య, హీరోయిన్ పూజా హెగ్దే హాజరై ఈవెంట్ ను విజయవంతం చేశారు. అయితే వేదికపై దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ ఆచార్య మూవీలోని టెంపుల్ టౌన్ ‘ధర్మపురి’ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఆ టెంపుల్ టౌన్ ను నిర్మించేందుకు ఎంతలా శ్రమించారో తెలియజేశారు.
సినిమా ఎక్కువ శాతం ధర్మం గురించే చెప్పాల్సి రావడంతో.. దానికోసం ప్రత్యేకమైన టౌన్ అవసరం పడింది. అది చాలా ఆధ్యాత్మికతంగానూ, ధర్మ నియమాలను పాటించేది కనిపించాలని అనుకున్నారు. అయితే ఇందుకోసం దేశంలోని పలు ఆధ్యాత్మిక క్షేత్రాలు, పలు ప్రాంతాలను చిత్ర యూనిట్ సందర్శించింది. అక్కడక్కడ కొన్ని అంశాలను వారికి నచ్చాయి. కానీ వీరు అనుకున్న సరైన ప్రాంతం కంట పడలేదు. దీంతో ఆ ప్రత్యేకమైన టెంపుల్ టౌన్ నే నిర్మించాలనుకున్నారు.
ఇందుకోసం రూ. కోట్లు వెచ్చించి ఏకంగా 20 ఏకరాల్లో టెంపుల్ టౌన్ ను నిర్మించారు. ఆ ప్రాంతమే ధర్మం వెలిసిన చోటుగా పరిగణిస్తూ ‘ధర్మపురి’ అని నామకరణం చేశారు. సెట్ ప్రారంభం నాటి నుంచే అక్కడి ఆలయాల్లో పూజలు కూడా చేశామని తెలిపారు. ఆర్ట్ డైరెక్టర్ సురేశ్ సెల్వరాజన్ ఎన్నో గంటలు శ్రమించి టెంపుల్ టౌన్ ను నిర్మించారని తెలిపారు. సినిమాలో ‘ధర్మపురి’ చాలా అద్భుతంగా విజువల్ ఫీస్ట్ గా చెప్పొచ్చని దర్శకుడు కొరటాల శివ అభిప్రాయపడ్డారు.
ఏప్రిల్ 29న రిలీజ్ కానున్న ఈ చిత్రంలో చిరంజీవి, రామ్ చరణ్ దేవాలయ భూ కబ్జాదారులకు వ్యతిరేకంగా పోరాడే నక్సలైట్ల పాత్రను పోషించనున్నట్టు తెలుస్తోంది. వీరికి జంటగా హీరోయిన్లు కాజల్ అగర్వాల్, పూజా హెగ్దే (Pooja Hegde) నటించారు. మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ అద్భుతమైన సాంగ్స్ అందించారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్ సంయుక్తంగా నిర్మించాయి.