
ఇండస్ట్రీలో ఉన్న లెజెండరీ ప్రొడ్యూసర్లలో అల్లు అరవింద్ ఒకరనేది కాదనలేని సత్యం. ఎంతో ప్లానింగ్ తో ముందుకు వెళ్లే ఆయన చిరంజీవి కెరీర్ ని మాత్రమే కాకుండా మెగా క్యాంప్ నుంచి వచ్చే హీరోలందరికీ వెనక అండగా నిలబడ్డారు. ఓ స్టేజికి వారందరూ వచ్చేలా ప్రణాళికలు రచించారు. అలాగే ఈ రోజు ఆహా..ఓటిటి రంగంలో తనదైన ముద్ర వేయగలిగింది అంటే అది అరవింద్ తెలివితేటలే అని చెప్పాలి. అలా తన సినిమాలు, వాటి విడుదల విషయంలో సరైన ప్లాన్స్ వేసుకుంటాడు. కానీ పాపం, తాజాగా ఆయనకు రెండు ఎదురు దెబ్బలు తగలాయి.
ఆయన ప్రొడ్యూస్ చేసిన వరుణ్ తేజ్ గని, షాహిద్ కపూర్ యొక్క జెర్సీతో బ్యాక్-టు-బ్యాక్ ఫ్లాప్‌లను చూశాడు. గనీ దాదాపు మూడేళ్ల పాటు మేకింగ్‌లో ఉన్నాడు. కంటెంట్ పాతది కావటంతో ఘోరంగా ఫ్లాప్ అయింది. అల్లు అరవింద్ తన కొడుకు బాబీని నిర్మాతగా ముందుకు సాగడానికి మరియు పాత సబ్జెక్ట్‌తో ఈ సినిమా చేయడానికి ఎలా అంగీకరించాడు అని ఇండస్ట్రీలో అంటున్నారు. మరో ప్రక్క ఆర్.ఆర్.ఆర్ ఇంఫాక్ట్ తో ఈ సినిమా జనాలకు ఆనలేదు అని తేల్చారు.
అలాగే దిల్ రాజు తో కలిసి అల్లు అరవింద్... హిందీలో నిర్మించిన జెర్సీతో మరో తప్పు చేశాడు. ఈ చిత్రం కూడా స్పోర్ట్స్ డ్రామా. కోవిడ్ కారణంగా ఈ సినిమా చాలా కాలం నిలిచిపోయింది. కరెక్ట ్గా KGF 2 రిలీజ్ అయ్యి పెద్ద హిట్టైన వారంలోనే ఈ సినిమా రిలీజ్ చేసారు. దాంతో జెర్సీ డల్ మౌత్ టాక్ , డల్ కలెక్షన్లతో విడుదలైంది. అయితే, KGF 2 హిందీలో ఖచ్చితంగా జెర్సీని తినేస్తుంది అందరూ అన్నారు. అదే నిజంగా జరిగింది.
అయితే అల్లు అరవింద్ లాంటి అనుభవజ్ఞుడైన నిర్మాత ఈ సినిమాల రిజల్ట్‌ని ఎలా అంచనా వేసి రిలీజ్‌కి ప్లాన్ చేస్తాడో అడగకుండా ఉండలేం.గనీ స్క్రిప్ట్ పరంగా, జెర్శీ రాంగ్ రిలీజ్ ప్లానింగ్ తో దెబ్బ తినటంతో అందరూ అరవింద్ వైపే చూస్తున్నారు. ఇదెలా జరిగింది సారు అంటన్నారు.