‘హనుమాన్’ చిత్ర నిర్మాతలు ఆయోధ్య రామ మందిరానికి విరాళం ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు మొత్తం ఎన్ని కోట్లు ఇచ్చారో తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే.
టాలీవుడ్ లో ఈ ఏడాది ‘హనుమాన్’ HanuMan మూవీ ప్రేక్షకాదరణ పొందింది. అలాగే బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టింది. చిన్న సినిమాగా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం వందల కోట్లలో కలెక్షన్లు చేసింది. ఇప్పటి వరకు మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. సంక్రాంతి చిత్రాల విన్నర్ గా నిలిచింది. అయితే ఈ చిత్రం జనవరి 12న విడుదలైంది. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ‘అయోధ్య రామ మందిరం’ Ayodhya Rama mandir నిర్మాణం కోసం విరాళం ఇస్తామని మేకర్స్ ప్రకటించారు.
వారు అప్పుడు చెప్పిన దాని ప్రకారం.. పది లేదా 20 లక్షల రూపాయలు విరాళంగా అందిస్తామని భావించారంట. కానీ సినిమా సెన్సేషన్ గా మారడంతో రూ. 2,66, 41,055 అయోధ్య రామ మందిర్ కి డొనేట్ చేశారు. అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు కూడా.. ఇక మేకర్స్ అక్కడితోనే ఆగిపోలేదు. ఇంకా విరాళాలు అందించారంట. ఇప్పటి వరకు మొత్తంగా రూ.5 కోట్ల వరకు డొనేట్ చేసినట్టు దర్శకుడు ప్రశాంత్ వర్మ Prashanth Varma రీసెంట్ సక్సెస్ మీట్ లో తెలియజేశారు. చిన్న సినిమా నుంచి వచ్చిన ఆదాయంలో ఐదు కోట్ల రూపాయలకు పైగా డొనేట్ చేయడం అంటే మాములు విషయం కాదు.
టాలీవుడ్ లోనే కాదు.. దేశ వ్యాప్తంగా ఉన్న చిత్ర పరిశ్రమల నుంచి ఆలయాలకు ముఖ్యంగా రామాలయానికి ఇంత పెద్ద మొత్తంలో విరాళాలు అందలేదు. ఆ పేరు కేవలం ‘హనుమాన్’ టీమ్ కే దక్కింది. ఇక ప్రశాంత్ వర్మ నెక్ట్స్ ‘జై హనుమాన్’ Jai HanuMan చిత్రంపై ఫోకస్ పెట్టారు. ఇందులో పెద్ద హీరోను ఎంపిక చేస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, మహేశ్ బాబు పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇక హనుమాన్ మూవీలో తేజ సజ్జాకు జంటగా అమృత అయ్యర్ నటించింది. వరలక్ష్మి శరత్ కుమార్ హీరో అక్క పాత్రలో అలరించింది. వినయ్ రాయ్ విలన్ రోల్ చేశాడు.