ఫేస్ బుక్ లో డీజే సినిమా లీకేజీపై పోలీసులకు ఫిర్యాదు చేసిన దిల్ రాజు

Published : Jun 28, 2017, 04:04 PM ISTUpdated : Mar 25, 2018, 11:47 PM IST
ఫేస్ బుక్ లో డీజే సినిమా లీకేజీపై పోలీసులకు ఫిర్యాదు చేసిన దిల్ రాజు

సారాంశం

దువ్వాడ జగన్నాథం సినిమా ఫేస్ బుక్ లో లీక్ లీకేజీ పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసిన నిర్మాత దిల్ రాజు సైబర్ క్రైమ్ ఏసీపీ రఘువీర్ ను కలిసి ఫిర్యాదు చేసిన దిల్ రాజు, హరీశ్ శంకర్

నెగెటివ్ రివ్యూలను తట్టుకుని మరీ కలెక్షన్స్ సాధిస్తోందనుకున్న డీజే దువ్వాడ జగన్నాథం సినిమాకు పైరసీ దెబ్బ తగిలింది. డీజే మూవీని పైరసీ చేసిన మాఫియా ఏకంగా ఫేస్ బుక్ లో లైవ్ పెట్టి సినిమా కలెక్షన్లకు గండి కొడుతోంది. ఈ చిత్రం మౌత్ పబ్లిసిటీతో కేకః, కేకస్య, కేకోభ్యః అనిపించుకుంటున్న తరుణంలో పైరసీ ఎఫెక్ట్ తీవ్రంగా దెబ్బతీస్తోంది. అయితే దీనిపై నిర్మాత దిల్ రాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

‘దువ్వాడ జగన్నాథం’ సినిమాను పైరసీ చేసి ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేసిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని ఆ చిత్ర నిర్మాత దిల్‌రాజు, దర్శకుడు హరీష్‌ శంకర్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పైరసీని నిర్మూలించేందుకు ఎలాంటి తీసుకోవాలనే అంశంపై సీసీఎస్‌సైబర్‌ క్రైమ్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ రఘువీర్‌తో చర్చించారు. చిత్రాన్ని పైరసీ చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరారు.

PREV
click me!

Recommended Stories

Eesha Rebba: తరుణ్‌ భాస్కర్‌ చెంప చెల్లుమనిపించిన ఈషా.. మార్షల్‌ ఆర్ట్స్ నేర్చుకుని మరీ ప్రతీకారం
Padma Awardsపై మురళీ మోహన్‌, రాజేంద్రప్రసాద్‌ ఎమోషనల్‌ కామెంట్‌.. చిరంజీవి సత్కారం