జై లవ కుశ వీడియో లీకేజీపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కళ్యాణ్ రామ్

Published : Jun 28, 2017, 03:41 PM ISTUpdated : Mar 25, 2018, 11:47 PM IST
జై లవ కుశ వీడియో లీకేజీపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కళ్యాణ్ రామ్

సారాంశం

ఎన్టీఆర్ జైలవకుశ సినిమాకు సంబంధించిన ఫోటోలు వీడియో లీకేజీ ఎన్టీఆర్ ఆర్ట్స్ బేనర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న కళ్యాణ్ రామ్ లీకేజీపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కళ్యాణ్ రామ్, నిందితుడు గణేష్ అరెస్ట్  

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘జై లవకుశ’. ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నారనడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అభిమానులైతే తమ హీరో ఏ గెటప్‌లో.. ఏ విధంగా కనిపిస్తాడో అని ఆతృతతో ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన స్టిల్స్ లీక్ అయ్యాయి. ఈ చిత్రంలో కీలకమైన ఫైట్ సీన్‌కు సంబంధించిన స్టిల్స్‌ను గణేష్ అనే వ్యక్తి లీక్ చేశాడు. కువైట్ నుంచి అతడు తన స్నేహితులతో ఈ పని చేయించినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై నిన్నే సైబర్ క్రైమ్ పోలీసులకు నిర్మాత నందమూరి కల్యాణ్ రామ్ ఫిర్యాదు చేశారు. అయితే వేగంగా చర్యలు తీసుకోకపోవడంతో ఆయన ఇవాళ నేరుగా సైబర్ క్రైమ్ ఏసీపీ రఘువీర్‌ను కలిశారు.

 

కల్యాణ్ కంప్లైంట్‌ను పరిశీలించిన ఏసీపీ రఘువీర్.. నిన్న ఎవరైతే ఫిర్యాదును స్వీకరించారో ఆ అధికారికి ఫోన్ చేసి ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు అని ప్రశ్నించారు. వెంటనే చర్యలు తీసుకుని స్టిల్స్‌ను లీక్ చేసిన వారిని పట్టుకుంటామని కల్యాణ్ రామ్‌కు ఏసీపీ రఘువీర్ చెప్పారు. ఏసీపీ స్పందన బాగుందని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ఏసీపీ చెప్పారని నిర్మాత కల్యాణ్ రామ్ ఈ సందర్భంగా మీడియాకు చెప్పారు.

PREV
click me!

Recommended Stories

Nivetha Thomas: రష్మిక, శ్రీలీల, ఇప్పుడు నివేదా థామస్‌.. ఏఐ ఫేక్‌ ఫోటోలకు బలి.. నటి స్ట్రాంగ్‌ వార్నింగ్
Illu Illalu Pillalu Today Episode Dec 18: ఇంట్లో పెద్ద చిచ్చే పెట్టిన వల్లి, ధీరజ్ పై కత్తి ఎత్తిన ప్రేమ