నాగచైతన్యతో మరోసారి రొమాన్స్ చేయనున్న పూజా హెగ్డే

Published : Aug 02, 2017, 02:30 PM ISTUpdated : Mar 25, 2018, 11:51 PM IST
నాగచైతన్యతో మరోసారి రొమాన్స్ చేయనున్న పూజా హెగ్డే

సారాంశం

డీజే దువ్వాడ జగన్నాథం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన పూజా హెగ్డే డీజే హిట్ తో తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ సరసన ఛాన్స్ గతంలో నాగచైతన్య సరసన ఒక లైలా కోసంలో నటించిన పూజ మరోసారి చందు మొండేటి సినిమాలో చైతూ తో రొమాన్స్ చేయనున్న పూజ హెగ్డే  

డీజే సినిమాలో పూజ పాత్రలో తనదైన గ్లామర్ తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన హీరోయిన్ పూజా హెగ్డే. ఈ డీజే గర్ల్ యువసామ్రాట్ నాగచైతన్య సరసన మరోసారి నటించబోతోంది. ఇప్పటికే డీజే సక్సెస్ తో యమా క్రేజ్ సంపాదించిన పూజ.. బెల్లంకొండ శ్రీనివాస్ సరసన ఛాన్స్ కొట్టేసింది. ఇప్పుడు నాగచైతన్య సరసన మరోసారి ఛాన్స్ కొట్టేసి తెలుగు ఇండస్ట్రీలో సెటిలయ్యేందుకు బాటలు వేసుకుంటోంది. పూజ బాలీవుడ్ లో క్రిష్ హృతిక్ రోషన్ సరసన నటించినా.. తెలుగు ఇండస్ట్రీపైనే ఎక్కువ కాన్ సెంట్రేట్ చేస్తున్నట్లు చెప్తోంది.

 

పూజ గతంలో నాగచైతన్ సరసన ఒక లైలా కోసం చిత్రంలో హిరోయిన్ గా నటించింది. తాజాగా కార్తికేయ, ప్రేమమ్ లాంటి వరుస హిట్లతో దూకుడు మీదున్న చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో చైతూ సరసన మరోసారి పూజ నటిస్తోంది.

 

ప్రస్థుతం యుద్ధం శరణంతో ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైతున్న నాగచైతన్య ఆ తర్వాత.. సమంతతో పెళ్లి వేడుకల కోసం రెండు నెలలపాటు బ్రేక్ తీసుకోనున్నాడు. వివాహం తర్వాత అన్ని పనులు ముగించుకుని చందు మొండేటి చిత్రంలో నటించనున్నాడు. ఇదే చిత్రంలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.

PREV
click me!

Recommended Stories

Ustaad Bhagat Singh: ఊపేసేలా ఉన్న `దేఖ్‌ లేంగే సాలా` పాట.. మళ్లీ ఆ రోజులను గుర్తు చేసిన పవన్‌ కళ్యాణ్‌
అడివి శేష్ గూఢచారి 2 తో పాటు బోల్డ్ హీరోయిన్ నుంచి రాబోతున్న 5 సినిమాలు ఇవే