
ఈరోజు ఎపిసోడ్ లో తులసి నీ అనుభూతికి ఎవరు అడ్డొచ్చారు అనగా ఇది నాకు ఇష్టమైన పెళ్లి చూపులు కాదు కదా బలవంతపు పెళ్లి చూపులు అని దివ్య అనడంతో జీవితంలో అన్నీ అనుకున్నట్టుగా జరగవు అని అంటుంది తులసి. పెళ్లిచూపులో కూర్చున్నప్పుడు నిర్ణయం తీసుకుని కూర్చోవద్దు కూర్చున్నాక నిర్ణయం తీసుకో అని అంటుంది తులసి. సర్లే వెళ్ళాం పదా అని తులసి దివ్యని అక్కడి నుంచి పిలుచుకొని వెళ్తుంది. మరోవైపు అందరూ దివ్య కోసం వెయిట్ చేస్తూ ఉండగా అప్పుడు లాస్య నందు మీద సీరియస్ అవుతూ ఈ తులసితో ఇదే వచ్చింది అందరూ ఎదురు చూస్తున్నారు తీసుకొని రావచ్చు కదా అని వాగుతూ ఉండగా ఇంతలోనే తులసి దివ్య అని పిలుచుకొని వస్తుంది.
ఇప్పుడు పెళ్ళికొడుకు వాళ్ళు దివ్యవైపు అలాగే చూస్తూ ఉంటారు. అప్పుడు దివ్య పెళ్లి కొడుకు వైపు చూసి నవ్వుతూ పలకరించగా చూసి చూడకుండా మొబైల్ ఫోన్ వైపు చూస్తూ ఉంటాడు. అప్పుడు లాస్య మా ఇంటి అమ్మాయి అని చెప్పుకోవడం కాదు కానీ దివ్య బుద్ధిమంతురాలు పనిమంతురాలు. మేమిద్దరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ గా ఉంటాం అంటూ ఒకటికి రెండు లేనిపోనివ్వని చెప్పి ఓవరాక్షన్ చేస్తూ ఉంటుంది లాస్య. మీ అబ్బాయి మా ఇంటి అల్లుడు అవడం ఎంత అదృష్టమో మా అమ్మాయి మీ ఇంటికి కోడలు అవ్వడం కూడా అంతే అదృష్టం అంటూ హడావిడి చేస్తూ ఉంటుంది. అప్పుడు తులసి దివ్య ఒకరి వైపు ఒకరు చూసుకుని నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడు దివ్య నేను అబ్బాయితో విడిగా మాట్లాడాలి అనడంతో వెంటనే లాస్య విడిగా మాట్లాడటానికి ఏముంది.
ఏమైనా అడగాలని ఉంటే మాముందే అడుగు అనడంతో లేదు నేను పర్సనల్ గా మాట్లాడాలి అని అంటుంది దివ్య. అప్పుడు తులసి బాబు నీకేమైనా అభ్యంతరమా అనడంతో మగాన్ని నాకేం అభ్యంతరం ఉంటుంది అనడంతో అందరూ అతని మాటలకు ఆశ్చర్యపోతారు. ఇప్పుడు దివ్య పెళ్లి కొడుకు ఇద్దరు కలిసి మాట్లాడుకోవడానికి బయటకు వెళ్తారు. అప్పుడు దివ్య ఏదైనా అడగాలి మాట్లాడాలి అనుకుంటున్నారా అనడంతో అడిగింది మీరు మీరు మాట్లాడండి అనడంతో ఈ పెళ్లి సెట్ అవుతుందని మీరు అనుకుంటున్నారా అని దివ్య అడగగా నాకేం తక్కువ నన్ను ఎందుకు రిజెక్ట్ చేస్తారు అని అంటాడు పెళ్ళికొడుకు. మరోవైపు లాస్య ఏం జరుగుతుందో అని టెన్షన్ పడుతూ ఉంటుంది. భర్తగా నేను సంపాదిస్తాను నువ్వు భార్యగా పిల్లలను చూసుకుంటూ ఇంటి బాధ్యతలను చూసుకుంటే చాలు అని చెప్పడంతో సరే వెళ్దాం పదండి అని అంటుంది దివ్య.
తర్వాత దివ్య పెళ్ళికొడుకు లోపలికి వెళ్లడంతో అప్పుడు మీరు ఓకే అంటే నాకు ఓకే మమ్మీ అని పెళ్ళికొడుకు అనడంతో అందరూ నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడు దివ్య కానీ నాకు మాత్రం ఒకే కాదు. ఈ సంబంధం నాకు ఇష్టం లేదు అనగా అప్పుడు లాస్య షాక్ అయ్యి సాయంత్రం చెప్తాము తన ఏదో సరదాగా మాట్లాడుతుంది అనడంతో ఎప్పుడు చెప్పిన ఇదే మాటే అనడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అప్పుడు నందు అది కాదమ్మా అని అనడంతో పెళ్లి తర్వాత భార్యకి ఎటువంటి స్థానాన్ని ఇవాలో తెలియని వాడికి నేను లైవ్ పార్ట్నర్ గా వెళ్ళలేను నాన్న అని అంటుంది. అప్పటి నుంచి అతను నాకంటే మొబైల్ ఫోన్ వైపే ఎక్కువగా చూస్తున్నాడు అప్పుడే అర్థమైంది కాబోయే భార్యకు అతడు ఏమాత్రం ఇంపార్టెన్స్ ఇస్తాడు అని అంటుంది దివ్య.
అప్పుడు చేతులు జోడించి వెళ్లిపోండి అనడంతో వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు నందు, లాస్య ఆగండి అంటూ పెళ్ళికొడుకు వాళ్ళ వెనకాలే వెళ్తారు. అప్పుడు హాస్పిటల్ కి వెళ్తావా అని తులసి అడగడంతో ఇంతలో లాస్య కోపంతో అక్కడికి వచ్చి దివ్య కాళ్ల వరకు వచ్చిన బంగారం లాంటి సంబంధాన్ని కాదని జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావా అని కోపంగా మాట్లాడుతుంది. అప్పుడు అలా పడటం తప్పేమో దివ్య అని నందు అనడంతో వెంటనే లాస్య తులసి వైపు చూసి మనం ఇంతలా టెన్షన్ పడుతున్న ఆవిడ గారి ముఖంలో టెన్షన్ చూసావా అని తులసి మీదికి విడుచుకుపడుతుంది లాస్య. ప్రతిదానికి నన్ను నిందించడం నీకు అలవాటు అయిపోయింది నా కూతురు పెళ్లి సంబంధాన్ని నేను ఎందుకు చెడగొట్టుకుంటాను అని అంటుంది తులసి.
మరి దివ్య చెంప పగలగొట్టి ఎందుకు నిలదీయలేదు అనడంతో దివ్య చిన్నపిల్ల కాదు కాబోయే భర్త విషయంలో తనకి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి అని అంటుంది తులసి. అప్పుడు లాస్య మరింత అపార్థం చేసుకుంటూ సంబంధం నా ద్వారా వచ్చిందని సెట్ అయితే ఆ క్రెడిట్ అంతా నాకే వస్తుందని కావాలనే చెడగొట్టావు అని నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతుంది లాస్య. అప్పుడు దివ్య సీరియస్ అవుతూ ఆపుతావా నాకు ఇష్టం లేకపోయినా అమ్మ చెప్పిందని పెళ్లి చూపుల్లో కూర్చున్నాను అన్నీ నచ్చితే ఓకే చెబుదామని అనుకున్నాను ఏదీ తెలియకుండా మీరు నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతున్నారు అని అంటుంది దివ్య. దివ్య లాస్యకి వార్నింగ్ ఇస్తూ ఛాన్స్ దొరికింది కదా అని అమ్మ మీదికి వస్తే మర్యాదగా ఉండదు. నీ లిమిట్స్ లో నువ్వు ఉండు అని స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇస్తుంది.
మరొకవైపు రాజ్యలక్ష్మి తన కొత్త హాస్పిటల్ కన్స్ట్రక్షన్ గురించి ఒక అతని పరిచయం చేస్తూ అతని గురించి గొప్పగా చెబుతూ ఉంటుంది. అప్పుడు విక్రమ్ వాళ్ళ తాతయ్య ఇప్పటికే ఉన్న హాస్పిటల్ చూసుకోవడం సరిపోలేదు ఇంకొకటి అవసరమా అనడంతో నేను మన కుటుంబం కోసమే ఆలోచిస్తున్నాను అని అంటుంది రాజ్యలక్ష్మి. ఒకసారి నీ భర్తతో నువ్వు చివరగా ఎప్పుడు మాట్లాడావు గుండెల మీద చేయి వేసుకొని ఆలోచించుకో అని అంటాడు. అప్పుడు మధ్యలో విక్రమ్ వల్ల మామయ్య మాట్లాడడంతో వాళ్ళ తాతయ్య గట్టిగా బుద్ధి చెబుతాడు. తర్వాత విక్రమ్ అక్కడికి రావడంతో అందరూ కలిసి భోజనం చేద్దాము అనగా విక్రమ్ కింద కూర్చోవడంతో అప్పుడు ఇంటికి వచ్చిన ఆఫీసర్ అదేంటి ఇంత సింప్లిసిటీ అని అడుగుతాడు. నాకు ఇలా కూర్చుంటేనే బాగుంటుంది సార్ అని అంటాడు విక్రమ్.
అప్పుడు ప్రతి దానికి విక్రమ్ వాళ్ళ మామయ్య మధ్యలో దూరి రాజ్యలక్ష్మిని వెనకేసుకుని మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు విక్రమ్ వాళ్ళ తాతయ్య విక్రం వాళ్ళ నాన్న గురించి బాధపడుతూ వాడు పక్షవాతం వచ్చి మూలన పడిన వాడి గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు అనడంతో ఈ విషయం అందరికి తెలుసు కదా నువ్వు ఎందుకు పదేపదే ఆ విషయం గురించి ప్రస్తావిస్తున్నావు అని అంటాడు. అప్పుడు రాజ్యలక్ష్మి కావాలనే విక్రం వాళ్ళ తాతయ్యని చెడుగా చూపించడం కోసం భోజనం చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు విక్రమ్ వాళ్ళ తాతయ్య మీద సీరియస్ అవ్వడంతో రాజ్యలక్ష్మి నవ్వుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మరొకవైపు దివ్య తులసిని హత్తుకుని స్వారీ చెబుతుంది. అప్పుడు వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు.