Intinti Gruhalakshmi: నందు మాటలకు సంతోషపడుతున్న తులసి.. విక్రమ్ ని తప్పుగా అపార్థం చేసుకున్న దివ్య?

Published : Mar 08, 2023, 09:35 AM IST
Intinti Gruhalakshmi: నందు మాటలకు సంతోషపడుతున్న తులసి.. విక్రమ్ ని తప్పుగా అపార్థం చేసుకున్న దివ్య?

సారాంశం

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు మార్చి 8వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.  

ఈరోజు ఎపిసోడ్ లో దివ్య, విక్రమ్ గురించి పొగుడుతూ రాముడు మంచి బాలుడు అంటాడు కదా ఆ టైప్ అన్నమాట అనడంతో ఓహో నచ్చాడు అన్నమాట అనడంతో నచ్చడం ఏంటమ్మా అనగా నచ్చడం అంటే నచ్చడమే అని కన్ఫ్యూజ్ చేస్తుంది తెలుస్తుంది. అప్పుడు దివ్య నువ్వు ఏదో తేడాగా మాట్లాడుతున్నావు అనడంతో తులసి ముసి ముసి నవ్వులు నవ్వుతూ ఉంటుంది. అప్పుడు తులసి ఆ డబ్బులు తీసుకొని ఇంత డబ్బులు మన దగ్గర ఉండడం కరెక్ట్ కాదు వెంటనే ఈ డబ్బులు అతనికి ఇచ్చేయ్ అని అంటుంది. వీలైతే అతన్ని ఒకసారి మన ఇంటికి పిలుచుకొని రా అనడంతో ఎందుకమ్మా అనడంతో నుదిటి మీద బొట్టు, పెదాలపై చిరునవ్వు, మొహంలో ప్రశాంతత ఇవన్నీ నేను కూడా చూద్దామని అని చెప్పి తులసి అక్కడి నుంచి నవ్వుతూ వెళ్ళిపోతుంది.

మరొకవైపు విక్రమ్ కార్లో వెళ్తూ దివ్య గురించి ఆలోచిస్తూ అమ్మా నా మనసులో అయితే ఒకరు ఉన్నారు కానీ ఆ అమ్మాయి మనసులోకి వెళ్లే అంతా స్నేహం చనువు మా మధ్య లేదు అనుకుంటూ ఉంటాడు. ఇంతలోనే దివ్య ఫోన్ చేసి మొదట పల్లెటూరి అమ్మాయి మాట్లాడినట్లు మాట్లాడడంతో విక్రమ్ కన్ఫ్యూజ్ అవుతాడు. ఆ తర్వాత దివ్య నేను డాక్టర్ దివ్య ని ఆరోజు హాస్పిటల్ డబ్బులు ఇచ్చారు కదా గుర్తుందా అనడంతో మర్చిపోతే కదా అనుకుంటూ ఉంటాడు విక్రమ్. మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నాను అనడంతో ఏంటిది చదువుకున్న వాళ్ళు ఇంత స్పీడుగా ఉంటారా నేను కూడా రెడీగా ఉన్నాను ఎప్పుడు కలుద్దాం అనగా దివ్య ఇప్పుడే కలుద్దాము ఒక అడ్రస్ పంపుతాను అక్కడికి వచ్చేయండి అని అంటుంది. అప్పుడు విక్రమ్ ఫోన్ కట్ చేసి సంతోష పడుతూ ఉంటాడు.

ఆ తర్వాత నందు వాళ్ళ ఫ్రెండ్ వాసుదేవ్ తో సరదాగా ఫోన్లో మాట్లాడుతూ ఉండగా సరే నేను డైరెక్ట్ గా మీ ఇంటికి వస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు వాసుదేవ్. అప్పుడు నందు సంతోషపడుతూ డాన్స్ చేస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి తులసి వస్తుంది. అప్పుడు తులసి ఏంటి అనడంతో ఇంట్లో ఏవైనా స్వీట్స్ ఉన్నాయా అనగా లేవు చేయమంటే చేస్తాను అనడంతో రేపు నా జీవితంలోకి అదృష్టం రాబోతోంది. రేపటి నుంచి   నందగోపాల్ కి రాజయోగం పట్టబోతోంది అని గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు. అప్పుడు తులసి నందు మాటలు అర్థం కాక అయోమయ పడుతూ ఉంటుంది. అప్పుడు నీకు మా ఫ్రెండ్ వాసుదేవ్ గుర్తున్నాడా అనడంతో ఏ వాసుదేవ్ అని అడగగా గుర్తు ఉన్నాడు అని అంటుంది తులసి.

అక్కడికి వెళ్లి బాగా సంపాదించుకున్నాడు ఇండియాలో కూడా డెవలప్ చేద్దామనుకుంటున్నాడు అందుకే ఇండియాకు వస్తున్నాడు అనడంతో తులసి సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడు తులసి కూడా సంతోష పడుతూ ఉంటుంది. ఆ తర్వాత నందు ఫ్రెండ్ వాసుదేవ్ ఫోన్ చేసి మా చెల్లెలు చేతి వంటకాలు తినడానికి వస్తున్నాను మా చెల్లెల్ని అన్ని వంటకాలు చేసి ఉండమని చెప్పు అనడంతో నందు ఏం మాట్లాడకుండా మౌనంగా టెన్షన్ పడుతూ ఉంటాడు. తులసి డివోర్స్ తీసుకున్న విషయం వాసుదేవ్ కు తెలియదు వారికి తెలిస్తే బాధపడతాడు ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటూ ఉంటాడు నందు.

విడాకులు తీసుకున్న విషయం వానికి తెలిస్తే బిజినెస్ విషయం పక్కన పెడితే మా ఇంటికి కూడా రాడు ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు నందు. మరోవైపు విక్రమ్,దివ్య రమ్మన్న చోటికి వచ్చి దివ్య కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. అప్పుడు విక్రం సంతోషపడుతూ ఏంట్రా విక్రమ్ ఒక అమ్మాయి కాఫీ షాప్ కి రమ్మంది నీకు ఏదేదో అయిపోతుంది అనుకుంటూ తనలో తానే సంతోషపడుతూ ఉంటాడు. ఇంతలోనే వాళ్ళ ఫ్రెండ్ శిరీష కనిపించడంతో ఏంటి శిరీష అమెరికాకు వెళ్తున్నావా అంత డబ్బులు ఎక్కడివి అనడంతో మేము ఉన్న ఇల్లు అమ్మేస్తున్నాను అనగా మరి మీ అమ్మానాన్న వాళ్ళు ఎక్కడ ఉంటారు వాళ్లకు వయసు అయిపోయింది ఎక్కడో చోటు ఉంటారు ఇప్పుడిప్పుడే నా లైఫ్ సెటిల్ అవుతుంది అంటూ స్వార్ధంగా మాట్లాడుతుంది. 

చాలా పెద్ద తప్పు చూస్తున్నావు శిరీష అనడంతో ఏంటి తప్పు ఆల్రెడీ వాళ్ళు లైఫ్ని ఎంజాయ్ చేశారు ఇప్పుడే నా లైఫ్ ని నేను ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను అనడంతో అప్పుడు విక్రమ్ వాళ్ళ ఫ్రెండ్ శిరీషకి మంచి మాటలు చెబుతూ ఉంటాడు. అప్పుడు వాళ్ళిద్దరూ వాదించుకుంటూ ఉండగా ఇంతలోనే అక్కడికి దివ్య వస్తుంది. అప్పుడు దివ్య అక్కడికి వచ్చేసరికి అప్పుడు వాళ్ళిద్దరూ వాదించుకుంటూ ఉండగా అప్పుడు విక్రమ్ తప్పుగా అపార్థం చేసుకుంటుంది దివ్య. రాముడు అనుకున్నాను కానీ బొట్టు పెట్టుకున్న రావణాసురుడు అనుకుంటూ అక్కడికి వస్తుంది దివ్య. అప్పుడు వచ్చేసారా అని విక్రమ్ అనడంతో  ఏం రాకూడని టైంలో చాలా వచ్చానా అనగా నేను అలా అనలేదు అని అంటాడు విక్రమ్.

 అప్పుడు విక్రమ్ అరగంట నుంచి మీకోసం నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను అండి అనడంతో ఒక ఆడపిల్ల చీ కొట్టగానే మరో ఆడపిల్లకి లైన్ వేయడం అమ్మో మామూలు విషయం కాదు అనడంతో అప్పుడు విక్రమ్ దివ్య మాటలు అర్థం కాక ఏంటండీ ఏం మాట్లాడుతున్నారు అని అంటాడు. అప్పుడు మేడం మీరు ఏదో పొరపాటు పడుతున్నారు నేను అలాంటి వాడిని కాదు అనడంతో అయినా కూడా దివ్య విక్రమ్ తప్పుగా అపార్థం చేసుకుని అలాగే మాట్లాడుతుంది. ఇప్పుడు దివ్య విక్రమ్ ని తప్పుగా అపార్థం చేసుకుని అందరి ముందు తిట్టి చేతిలో డబ్బులు పెట్టి ఎక్కడినుంచి వెళ్లిపోవడంతో విక్రమ్ కన్నీళ్లు పెట్టుకుంటాడు. అసలేం తప్పు చేశాను చెప్పకుండా అన్ని మాటలు అని ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది అనుకుంటూ ఉంటాడు.

ఆ తర్వాత తులసి కిచెన్ లో పాటలు వంటలు చేస్తూ ఉండగా అప్పుడు దివ్య కోపంతో ఇంటికి వస్తుంది. అప్పుడు జరిగిన విషయాన్ని తలుచుకొని కోపంతో రగిలిపోతూ ఉంటుంది దివ్య. అప్పుడు తులసి పాటలు ఆఫ్ చేయడానికి కిచెన్ లోకి వెళ్ళగా అప్పుడు తులసినే పాటలు ఆఫ్ చేస్తుంది. అప్పుడు దివ్య ముఖంలో కోపాన్ని గమనించి వెళ్లేటప్పుడు సంతోషంగానే వెళ్ళింది ఏం జరిగింది అని మనసులో అనుకుంటూ ఉంటుంది తులసి. అప్పుడు తులసి ఏమన్నాడే అనడంతో ఎవరు అనడంతో తులసి మళ్లీ దివ్య చెప్పిన డైలాగ్ ని దివ్యకి చెబుతుంది. సవాలక్ష చెబుతాం అమ్మ అన్నవన్నీ అవుతాయా ఏంటి ఫ్లోలో చాలా చెప్తాము అని అంటుంది దివ్య. ఇప్పుడు తులసి మళ్లీ పాటలు పెట్టడంతో ఏంటమ్మా ఆ పాటలు అంటూ విసుక్కుంటూ ఉంటుంది దివ్య. దివ్యను చూసి తులసి సంతోష పడుతూ ఉంటుంది.   అప్పుడు దివ్య అసలు విషయం చెప్పకుండా తులసి మీద పాటలు మీద సీరియస్ అవుతూ ఉంటుంది.

PREV
click me!

Recommended Stories

Actor Sreenivasan: ప్రముఖ నటుడు, దర్శకుడు శ్రీనివాసన్ కన్నుమూత.. 48 ఏళ్ల సినీ ప్రస్థానానికి ముగింపు
Bigg Boss Telugu 9: చివరి రోజు ఓటింగ్‌ తలక్రిందులు, పక్కా ప్లాన్‌ ప్రకారమే.. టాప్‌లో ఉన్నదెవరంటే?