
ఈరోజు ఎపిసోడ్ లో ఫణింద్ర దేవయాని ఏంటి నీ ప్రాబ్లం అనడంతో నాది కాదండి రిషి ది అని అంటుంది. రిషి ప్రాబ్లం అయితే రిషి సాల్వ్ చేసుకుంటాడు మద్యలో నువ్వు ఎందుకు అవడం అని అంటాడు. ఇదే అండి మీతో వచ్చిన సమస్య ఇంట్లో కాలేజీలో సమస్యలు కాలేజీలో ఇంట్లో సమస్యలు మాట్లాడుతారు అదేంటి అంటే నా నోరు మూయిస్తారు అని అంటుంది. అసలు మీకు రిషి గురించి బాగా బాధ్యత ఉందా అని అడుగుతుంది దేవయాని. బాగుంది దేవయాని రిషి ఏమైనా చిన్న పిల్లవాడా అనగా ఇన్నాళ్లు ఇవే మాటలు చెబుతూ వచ్చారు. ఆ వసుధార విషయంలో నేను ఎంత మొత్తుకున్నా కూడా వినలేదు.
అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అనగా రిషి ఫ్యూచర్ గురించి ఆలోచించాలి అని దేవయాని అంటుండగా ఇంతలోనే అక్కడికి జగతి వాళ్ళు వస్తారు. ఏంటి అన్నయ్య ఏదో రిషి అంటున్నారు అనడంతో అప్పుడు ఫణీంద్ర చెప్పబోతుందిగా మీరు ఆగండి అని దేవయాని ఏం లేదులే మహేంద్ర నా బాధ లేవో నేను చెప్పుకుంటున్నాను మీకు ఎలాగో రిషి గురించి పట్టదు కదా అని అంటుంది. రిషి ఎక్కడికి వెళ్లాడు అనడంతో రిషి ఎక్కడికో వెళ్లారు వదిన అని మహేంద్ర అనగా చూసారా ఇది వీళ్ళ వరస అని అంటుంది దేవయాని. అప్పుడు అందరికంటే తనకే రిషి మీద ప్రేమ ఉన్నట్టుగా నటిస్తూ ఏంటి జగతి రిషి ఎక్కడికెళ్లాడో తెలుసుకోవాలి కదా అని అంటుంది దేవయాని.
రిషి కచ్చితంగా ఆ వసుధార దగ్గరికి వెళ్లి ఉంటాడు అనుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది దేవయాని. మరొకవైపు రిషి పసుధార కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. అప్పుడు వసుధార నార్మల్గా డ్రెస్ వేసుకొని రావడంతో ఏంటిది అనగానే నేను ఇలాంటి డ్రెస్లే వేసుకుంటాను కదా సార్ అనడంతో నేను బయటకు వెళ్దామని అన్నాను మరి నువ్వు ఇలాంటి డ్రెస్ వేసుకున్నావ్ ఏంటి అని అడుగుతాడు రిషి. మీరు ఎక్కడికి వెళ్లాలో చెప్పలేదు కదా వెళ్లే స్థలాన్ని బట్టి మనం డ్రెస్ వేసుకోవాలి సౌకర్యం ఉండాలి కదా అని అంటుంది వసుధార. నాకు ఈ డ్రెస్ నచ్చలేదు వెళ్లి డ్రస్సు మార్చుకొని రా వసుధార అని అనగా అప్పుడు వాళ్ళిద్దరూ డ్రస్సు విషయంలో ఫన్నీగా వాదించుకుంటూ ఉంటారు.
అప్పుడు రిషి డ్రెస్ మార్చుకోవడానికి వెయిట్ చేస్తుంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వసుధార గదిలోకి వెళ్లి ప్రగతికి ఫోన్ చేసి ఏంటి మేడం మీ అబ్బాయి నా మీద పెత్తనం చెలాఇస్తుస్తాడు ఏంటి నందు ఏంటి వసుధార పొద్దున్నే నా కొడుకు మీద కంప్లైంట్ బాక్స్ ఓపెన్ చేసావు అని అంటుంది జగతి. అప్పుడు రిషి చేసిన విషయాలు అన్నీ ఒక్కొకటిగా చెప్పడంతో జగతి మురిసిపోతూ ఉంటుంది. వసు ఒక్క నిమిషం ఆగు రిషి ని అడగాల్సిన ప్రశ్నలన్ని నన్ను అడుగుతావేంటి అయినా మన మీద పెత్తనం చెలాఇస్తున్నారు అంటే మన మీద ప్రేమ ఉన్నట్లే కదా అని అంటుంది జగతి. మామూలుగా రిషి ఎవరి మీద అధికారం చలాయించడు కానీ నిన్ను శాసిస్తున్నాడు అంటే నీ మీద ప్రేమ పెరిగినట్లు కదా అని అంటుంది జగతి.
ఆ విషయం అర్థం చేసుకోకుండా అలుగుతావేంటి వసుధార నాకు అర్థం కావడం లేదు అని అనగా నేను తన భార్యని కాదు అన్నప్పుడు అధికారం చలా ఇస్తే నేను ఊరికే ఉండాలా మేడం అని అంటుంది వసుధార. నువ్వు పరిస్థితి తగ్గట్టుగా కాస్త కూల్ గా ఉండు వసుధర అని చెబుతుంది జగతి. ఆ తర్వాత రిషి వసుధార కోసం ఎదురు చూస్తూ ఉండగా అప్పుడు వసుధార సారీ కట్టుకొని రావడంతో వసుధార వైపు అలాగే చూస్తూ ఉంటాడు రిషి. అప్పుడు రిషి,వసుధారని అలాగే చూస్తూ ఉండిపోతాడు. అప్పుడు ఈ చీరని ఎక్కడో చూసినట్టు ఉంది ఉండగా అప్పుడు వసుధార ఈ చీర నాకు పెళ్లికి గిఫ్ట్ గా వచ్చింది అనడంతో అప్పుడు మినిస్టర్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసుకుంటాడు రిషి.
తరువాత వసు,రిషి ఇద్దరు కలిసి అక్కడి నుంచి బయలుదేరుతారు. తర్వాత వసుధార రిషి కార్లో వెళ్తుండగా అప్పుడు వసుధార ఏంటి సార్ సర్ప్రైజ్ ప్లాన్ చేశారా ఎక్కడికి వెళ్తున్నారో చెప్పలేదు చెప్పొచ్చు కదా సార్ అని అంటుంది. మెడలో తాళిబొట్టు చూసి సార్ ఈ తాళిబొట్టు చూసినప్పుడు మీరు ఏమనుకుంటున్నారు అని అడగగా అప్పుడు రిషి కావాలనే పాటలు పెడతాడు. మరొకవైపు జగతి మహేంద్ర ఇద్దరూ రిషి, వసుధారలు ఎక్కడికి వెళ్లి ఉంటారు అని ఫన్నీగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు మహేంద్ర కాస్త వెటకారంగా ఫన్నీగా చేస్తుండగా జగతి నవ్వుకుంటూ ఉంటుంది. అప్పుడు వాళ్ళిద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే అక్కడికి ధరణి వస్తుంది. అప్పుడు మహేంద్ర వెటకారంగా మాట్లాడుతూ ఫన్నీగా యాడ్ చేస్తుండడంతో అది చూసి ధరణి, జగతి ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు.
ఆ తర్వాత వసుధార,రిషి ఇద్దరు మినిస్టర్ ఇంటికి వెళ్లడంతో సార్ ఏంటి ఇక్కడికి వచ్చాము అనగా మినిస్టర్ గారు మన ఇద్దరినీ భోజనానికి రమ్మని చెప్పారు మనిద్దరం కొత్త దంపతులం కదా అని అంటాడు రిషి. అప్పుడు రిషి చెయ్యి ఇచ్చి పదండి శ్రీమతి గారు అనడంతో వసుధార రిషి చేయి పట్టుకొని నవ్వుతూ అక్కడ నుంచి లోపలికి వెళ్తుంది. ఆ తర్వాత వసుధార,రిషి ఇద్దరు లోపలికి వెళ్లడంతో రండి కొత్త దంపతులు అంటూ మినిస్టర్ వసుధార, రిషి ల గురించి గొప్పగా పొగుడుతూ ఉంటాడు. అప్పుడు మినిస్టర్ మాటలకు వసుధర రిషి ఇద్దరు సంతోషపడుతూ ఉంటారు. ఆ తర్వాత మినిస్టర్ వసుధార రిషి ముగ్గురు కలిసి భోజనం చేస్తూ ఉంటారు.