
ఈరోజు ఎపిసోడ్లో దివ్య శిరీష ని మోసం చేసింది విక్రమే అనుకొని గంగి గోవులా చూడ్డానికి అమాయకంగానే కనిపించాడు కానీ ఇంత దుర్మార్గుడు అని అనుకోలేదు అనగా ఇంతలోనే శిరీష వాళ్ళ అమ్మ ఆ అబ్బాయి మీకు తెలుసా అమ్మ అనడంతో తెలుసు అని అంటుంది దివ్య. తెలుసు అడిగి అడగగానే అడిగినంత డబ్బు ఇచ్చి అమ్మాయిలను ట్రాప్ చేసి ముగ్గులోకి దింపుతాడు అంటూ విక్రమ్ గురించి నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతూ ఉంటుంది దివ్య. అదృష్టం బాగుంది కాబట్టి వాడి బారి నుంచి నేను తప్పించుకున్నాను లేదంటే నాకు ఇదే పరిస్థితి వచ్చేదేమో అనుకుంటూ ఉంటుంది దివ్య. అప్పుడు శిరీష వాళ్ళ అమ్మ ఏడుస్తూ ఉండగా దివ్య ధైర్యం చెప్పి మీరేం భయపడకండి నేను మీ అమ్మాయికి న్యాయం చేస్తాను వాడికి శిక్ష పడేలా చేస్తాను అని అంటుంది.
మరొకవైపు రాజ్యలక్ష్మి బసవయ్యతో మాట్లాడుతూ ఎలా అయినా ఈ పెళ్లి సంబంధం కుదరాలి. ఎక్కడ ఉన్నాడు మన కీలుబొమ్మ అనడంతో అదిగో వస్తున్నాడు అని విక్రమ్ అక్కడికి వస్తాడు. అప్పుడు రాజ్యలక్ష్మి విక్రమ్ మీద దొంగ ప్రేమ కురిపిస్తూ నా దిష్టే తగిలేలా ఉంది అనడంతో ఇంతలో బసవయ్య ఆహాహా ఈ తల్లి కొడుకులకు నా దిష్టి తగిలేలా ఉంది అని అంటాడు. నాన్న ఇన్ని రోజులు నీకు అమ్మ స్థానంలో నేను ఉన్నాను మరి కొద్ది రోజుల్లో ఆ స్థానాన్ని భార్య తీసుకోబోతోంది అనడంతో అప్పుడు విక్రమ్ రాజ్యలక్ష్మి మాటలను గుడ్డిగా నమ్ముతూ ఇప్పటికీ నాకు అమ్మ స్థానంలో నువ్వు మాత్రమే ఉంటావు ఇంకెవరు రారు అని అనడంతో బసవయ్య బిస్కెట్లు వేస్తూ విక్రమ్ రాజ్యలక్ష్మి ల బంధం గురించి పొగుడుతూ ఉంటాడు. బలిచ్చే మేకపోవుతుంది. బలిచ్చే మేకను పెంచినట్లు పెంచుతున్నావు కానీ వాడికి ఆ విషయం తెలియక నిన్ను గొర్రె కసాయి వాడిని నమ్ముతున్నట్లు వాడు నిన్ను నమ్ముతున్నాడు అని బసవయ్య తన మనసులో అనుకుంటూ ఉంటాడు.
ఇంతలోనే పెళ్లి వాళ్ళు రావడంతో బసవయ్య లోపలికి పిలుచుకొని వచ్చి అందర్నీ పరిచయం చేస్తూ ఉంటాడు. పెళ్లి కూతురు ఫోటో చూడగానే ఈ అమ్మాయి తెగ నచ్చేసింది అందుకే మిమ్మల్ని పిలిపించాము అని లేనిపోనివన్నీ చెప్తూ ఉంటాడు బసవయ్య. ఇంతలోనే అక్కడికి విక్రమ్ వాళ్ళ తాతయ్య వస్తాడు. ఇంతలో అక్కడికి సంజయ్ రావడంతో సంజయ్ అదిగో మీ వదిన అనగా నీకు పర్ఫెక్ట్ జోడి అన్నయ్య అని సంజయ్ కూడా విక్రమ్ ని మోసం చేస్తూ ఉంటాడు. అప్పుడు నీకు నచ్చింది కదా అన్నయ్య అనగా అప్పుడు విక్రమ్ ఇంతకుముందే చెప్పాను కదా అమ్మకు ఇష్టమైతే నాకు ఓకే అని అంటాడు. అప్పుడు రాజ్యలక్ష్మి అందరూ దొంగ నవ్వులు నవ్వుతూ ఉంటారు. అప్పుడు దేవుడు విక్రం వాళ్ళ తాతయ్యకి అసలు అమ్మాయికి పెళ్లి ఇష్టం లేనట్టుంది ఈ కారణం చాలు మనం పెళ్లి సంబంధం చెడగొట్టడానికి అని సలహా ఇస్తాడు.
అప్పుడు విక్రమ్ వాళ్ళ తాతయ్య అమ్మాయితో ఏమైనా మాట్లాడాలి అనుకుంటే బయటకు తీసుకెళ్లి మాట్లాడు అనగా నేను మాట్లాడడానికి ఏమీ లేదు అనడంతో పెళ్లికూతురు నేను మాట్లాడాలి అని అనగా విక్రమ్ షాక్ అవుతాడు. మరొకవైపు నందు వాళ్ళ ఫ్రెండ్ వాసుదేవ్ కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తూ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంకొద్ది సేపట్లో వాడు వస్తాడు వానికి నిజం తెలిస్తే ఇంట్లోకి రాకుండా అలాగే వెళ్ళిపోతాడు అనుకుంటూ ఉంటాడు. ఇంతలోనే నందు వాళ్ళ ఫ్రెండ్ వాసుదేవ్ వస్తాడు. ఇప్పుడు పరంధామయ్య అందువల్ల వెళ్లి ప్రేమగా పలకరిస్తూ ఉంటారు. అప్పుడు నందు నిజం తెలిస్తే ఏమనుకుంటాడో అని టెన్షన్ పడుతూ ఉండగా ఏంటి నందు నాతో డీలింగ్ కుదుర్చుకోవడం నీకు ఇష్టం లేదా అనగా అదేం లేదు నువ్వు సడన్ గా వచ్చేసరికి టెన్షన్ గా ఉంది అని కవర్ చేసుకుంటూ ఉంటాడు నందు.
అప్పుడు వాసుదేవ్ ఏంటమ్మా తులసి కనిపించడం లేదు అనగా హారతి తీసుకొని వచ్చేసరికి లేట్ అయింది అన్నయ్య అని అంటుంది తులసి. ఆ తర్వాత అందరూ వెళ్లి లోపల కూర్చుని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు వాసుదేవ్ తులసి నందు ఇద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ అనుకొని మాట్లాడుతూ ఉండగా నందు లోలోపల టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడు తులసి అవును అన్న మీరు అన్నది నిజమే ఆయన చలువ వల్లే నేను లోకమంటే ఏంటో తెలుసుకోగలిగాను నాకు అలా మీద నేను బతుకుతున్నాను అని అనడంతో నందు టెన్షన్ పడుతూ ఉంటాడు.
అప్పుడు వాసుదేవ్ అసలు విషయం తెలియక నందు ని పొగుడుతూ ఉంటాడు. ఆ తర్వాత తులసి కాఫీ తీసుకోవడానికి కిచెన్ లోకి వెళ్ళగా అప్పుడు నందు వెళ్లడంతో మోసం చేయడం అంత మంచిది కాదు మీరే వెళ్లి అన్నయ్యకు అసలు నిజం చెప్పేయండి అన్నంతో నందు బిక్క మొఖం వేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
ఆ తర్వాత దివ్య పేషంట్ దగ్గరికి వెళ్ళగానే నమస్తే డాక్టర్ చెప్పాను కదా ఈ డాక్టర్ అమ్మే నాకు ధైర్యం చెప్పింది అని అంటుంది. ఇప్పుడు శిరీష చాలా థ్యాంక్స్ డాక్టర్ అని అంటుంది. మీ అమ్మకి కాదు నీకు కూడా నేను హెల్ప్ ఫుల్ గా ఉంటాను మోసపోయిన నీకు నేను అండగా నిలుస్తాను అని అంటుంది దివ్య. విక్రమ్ మీద పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అనగా విక్రమ్ మీదనా అనడంతో డబ్బున్న వాడు అని భయపడకు నీకు నేను ఉన్నాను ఆ రోజు మీరు ఇద్దరు కాఫీ షాప్ లో మాట్లాడుకున్న మాటలు అన్నీ నేను విన్నాను అని అంటుంది దివ్య. అప్పుడు శిరీష మీరెక్కడో పొరపాటు పడ్డారు విక్రమ్ నా వెల్విషర్ అనడంతో దివ్య షాక్ అవుతుంది. అప్పుడు ఏం మాట్లాడుతున్నావు అనడంతో అప్పుడు శిరీష జరిగింది మొత్తం వివరించగా దివ్య షాక్ అవుతుంది.
నిజంగా నిన్ను విక్రమ్ మోసం చేయలేదా అనగా అప్పుడు శిరీష చి చి నన్నే కాదు కలలో కూడా ఏ అమ్మాయిని మోసం చేయాలి అనుకోడు అవసరమైతే సహాయం చేస్తాడు అని అంటుంది. విక్రమ్ ని చేసుకునే అమ్మాయి ఎవరో కానీ చాలా అదృష్టవంతురాలు అని అనడంతో దివ్య లోపల సంతోషపడుతూ ఉంటుంది. మీరు ఏదో తప్పుగా అపార్థం చేసుకున్నట్టు ఉన్నారు అనడంతో అవును ఒకసారి కాదు రెండుసార్లు అని అంటుంది దివ్య. ఏం పర్లేదు కలిసి సారీ చెప్పండి ఈజీగా తీసుకుంటాడు కోపం పెంచుకోడు నవ్వుతూ మాట్లాడతాడు అనడంతో చాలా థాంక్యూ అనగా దివ్య సంతోష పడుతూ ఉంటుంది. నేను నీకు హెల్ప్ చేయడం కాదు నువ్వే నాకు హెల్ప్ చేశావు మంచి మనిషి గురించి నేను చాలా తప్పుగా అనుకున్నాను అని అంటుంది దివ్య. శిరీషకి చాక్లెట్ ఇచ్చి సంతోషంతో దివ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
మరోవైపు విక్రమ్ తో పెళ్లికూతురు మాట్లాడుతూ మీరు కోటీశ్వరులు మీ కారు విలువచేవు మా బతుకులు అలాంటిది మీరు నన్నే ఎందుకు పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు మీరు కో అంటే కోటి మంది అమ్మాయిలు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి క్యూ కడతారు కదా అని అంటుంది. మా అమ్మకు నచ్చారని అనగా మీకు నచ్చలేదా అని అనడంతో ఇందాకే చెప్పాను కదా మా అమ్మకు నచ్చితే నాకు నచ్చినట్లే అని అన్నాడు విక్రమ్. ఇప్పుడు పెళ్లికూతురు నాకు చదువు లేదు మీకు కూడా చదువులేదు నాకు చదువు లేదు కాబట్టి పుట్టే పిల్లలకు అయినా మంచిగా చదివించాలని అనుకున్నాను అనడంతో నేను చదువుకోలేదన్న విషయం మీ ఇంట్లో వాళ్ళు చెప్పలేదా అనగా చదువు కాదు డబ్బులు చూసి ఆశపడ్డారు అని అంటుంది. నాకు ఈ సంబంధం ఇష్టం లేదు మీరే ఎలాగైనా చెప్పాలి అనడంతో నేను కాదు మీరే చెప్పండి అని అంటాడు విక్రమ్.