మరోసారి గొప్ప మనసు చాటుకున్న మహేష్ బాబు-నమ్రత, ఈసారి ఏం చేశారంటే..?

Published : Mar 11, 2023, 07:55 AM IST
మరోసారి గొప్ప మనసు చాటుకున్న మహేష్ బాబు-నమ్రత, ఈసారి ఏం చేశారంటే..?

సారాంశం

సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి మంచి మనసు చాటుకున్నారు. ఖాలేజా సినిమాలో చూపించినట్టు పేదల పాలిట దేవుడిలా మారాడు మహేష్. ఎందరో చిన్నారుల గుండెలను ఆగిపోకుండా కాపాడుతున్నసూపర్ స్టార్.. ఈసారి పేద విద్యార్ధుల పాలిట భగవంతుడయ్యాడు.   

మహేష్ ఫౌండేషన్ ద్వారా ఆగిపోబోతున్న ఎందరో చిన్నారుల గుండెలను నిలబెట్టాడు మహేష్ బాబు. ఇప్పటికే వేల మంది చిన్నారుల జీవితంలో వెలుగులు నింపిని మహేష్ బాబు..  చిన్న పిల్లలకు హార్ట్ సర్జరీస్ చేయిస్తూ.. ప్రాణాలు పోస్తున్నాడు. ఇక ఆయన వెన్నంటే నడుస్తూ.. సూపర్ స్టార్ కు సాయం అందిస్తుందతి ఆయన భార్య నమ్రత. ఒక వైపు ఇంటిని ... పిల్లల్ని చూసుకుంటూనే.. మరో వైపు ఇన్ని పనులు చేస్తున్నారు జంట. ఇక ఈసారి టాలెంట్ ఉండీ.. చదువుకునే స్థోమత లేని పేద విద్యార్ధికి సాయం అందించి, మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు స్టార్ కపుల్. ఓ పేద విద్యార్ధి చదువుకోవడానికి ఆర్థికంగా సాయం  చేశారు మహేష్, నమ్రత. 

రీసెంట్ గా  జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. ఓ విద్యార్ధికి ల్యాప్ టాప్ ని బహుమతిగా ఇచ్చారు మ్రత. ఆ విద్యార్ధిని  ఓవియేషన్ కోర్స్ చదువుతుండటంతో.. ఫ్యూచర్ స్టడీస్ కు ఉపయోగపడేలా ల్యాప్ టాప్ అందించడంతో పాటు.. చదువుకోసం ఆర్థికంగా సహాయం కూడా చేశారు నమ్రత. ఫ్యూచర్ లో కూడా ఇలానే  సహకరిస్తాము అని హామీ ఇచ్చారు. ఇక నమ్రత చేతుల మీదగా ల్యాప్ టాప్ అందుకున్న ఆ విద్యార్థిని ఎంతో సంతోషించింది. మహేష్ ,నమ్రత లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.అంతే కాదు ఆ విద్యార్థి తల్లీ,తండ్రులు కూడా మహేష్ కు నమ్రతకుప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. 

ఇక ఈ విషయం తెలిసి సూపర్ స్టార్ ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు. ఇండస్ట్రీలో ఎంత మంది హీరోలు ఉన్నా.. మహేష్ మాత్రం రియల్ హీరో అనిపించుకుంటున్నారని ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. దీనికి సబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇక మహేష్ బాబు ప్రస్తుతం  త్రివిక్రమ్ డైరెక్షన్ లో SSMB28 సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది సినిమా. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈసినిమా ఈ ఏడాది రిలీజ్ కాబోతోంది.  ఇక ఈమూవీ కంప్లీట్ చేసిన తరువాత రాజమౌళి రూపొందించబోతున్న భారీ బడ్జెట్ సినిమాలో జాయిన్ కాబోతున్నాడు మహేష్. పార్ వరల్డ్ స్థాయిలో ఈసినిమాను తెరకెక్కిస్తారని సమాచారం.  

PREV
click me!

Recommended Stories

Demon Pavan Remuneration : 15 లక్షల జాక్ పాట్ తో పాటు, డిమాన్ పవన్ రెమ్యునరేషన్ టోటల్ గా ఎంతో తెలుసా?
Bigg Boss Telugu: ఈ విషయంలో అందరూ ఫెయిల్ అయ్యారు, బిగ్ బాస్ పై మండిపడ్డ రోహిణీ