కొత్తింట్లోకి అడుగు పెట్టబోతున్న డాక్టర్ బాబు ఫ్యామిలీ, తండ్రిని తలుచుకుని ఎమోషనల్ అయిన నిరుపమ్

Published : Mar 11, 2023, 08:46 AM ISTUpdated : Mar 11, 2023, 09:13 AM IST
కొత్తింట్లోకి అడుగు పెట్టబోతున్న డాక్టర్ బాబు ఫ్యామిలీ, తండ్రిని తలుచుకుని ఎమోషనల్ అయిన నిరుపమ్

సారాంశం

చాలా కాలంగా టెలివిజన్ రంగంలో స్టార్స్ గా కొనసాగుతున్నారు నిరుపమ్, మంజుల. ఇన్నేళ్లుగా టీవీరంగంలో ఉన్న వీళ్లు..ఇంత కాలానికి ఓ ఇంటివారు అయ్యారు. కొత్తింటిలోకి   గృహ ప్రవేశం చేయబోతున్నారు.

వెండితెరపై స్టార్ హీరోలకు ఎంత  ఫాలోయింగ్ ఉంటుందో.... బుల్లితెరపై కూడా సీరియల్  హీరోలకు అంతే ఫాలోయింగ్ ఉంటుంది. అలా స్మాల్ స్క్రీన్ పై హీరోగా వెలుగు వెలిగారు నిరుపమ్ అలియాస్ డాక్టర్ బాబు. ఫ్యామిలీ ఆడియన్స్ మనసు దోచుకున్న నిరుపమ్.. కార్తీక దీపం సీరియల్ తో టీర్పీ రేటింగ్స్ కూడా కొల్లగొట్టి.. బుల్లితెర స్టార్ గా మారాడు . ఇక నిరుపమ్ కు సినిమా  హీరోకు ఉన్నంత క్రేజ్ ఉంది బుల్లితెరపై. నిరుపమ్ కు అంత క్రేజ్ రావడానికి కారణం కార్తీక దీపం సీరియల్ లో డాక్టర్ బాబు పాత్ర వేయడమే. 

ఇక నిరుపమ్ భార్య మంజుల కూడా.. టీవీ సీరియల్స్ లో నటిస్తూ..బాగా ఫేమస్ అయ్యింది. చంద్రముఖీ సీరియల్ తో ఈ ఇద్దరి స్నేహం మొదలయ్యి.. అది ప్రేమగా మారింది. పెళ్ళికి దారితీసింది. అయితే పెళ్ళి తరువాత మంజుల సీరియల్స్ కు దూరం అయ్యింది. అయితే ఈ మధ్య.. కొత్తగా యూట్యూబ్ ఛానెల్ స్టార్ చేసింది మంజుల. తమ ఫ్యామిలీకి సబంధించిన విషయాలు ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటుంది. ఈక్రమంలో వారి కొత్త ఇంటి గురించి ఓ వీడియో చేశారు ఈజంట. ఈ వీడియోలో కొన్ని చిత్రమైన సంఘటనలగురించి పంచుకున్నారు. 

తాజా వీడియోలో నిరుపమ్ మాట్లాడుతూ.. తమకు ఓ కొత్త ఇల్లు ఉందని, త్వరలోనే ఆ ఇంట్లోకి వెళ్ళబోతున్నామని తెలిపారు.అయితే ఈ ఇల్లు తమకు సుమారు 18 సంవత్సరాల క్రితమే వచ్చినట్టు తెలిపారు నిరుపమ్. మరి ఇంతకాలం ఈ ఇంట్లోకి ఎందుకు వెళ్ళలేదో కూడా.. ఈ వీడియోలో వివరించారు యంగ్ స్టార్. ప్రస్తుతం ఈ ఇంట్లో ఇంటీరియల్ పనులు జరుగుతున్నాయి అంటూ.. తమ వీడియోలో  కొత్త ఇంటికి సబంధించి విశేషాలు పంచుకున్నారు.

 

నిరుపమ్ మాట్లాడుతూ..ఈ ఇంటిని మా నాన్న బుక్ చేశారు. గతంలో ప్రభుత్వం సినీకార్మికుల కోసం మంజూరు చేసిన హౌసింగ్ సొసైటీ ద్వారా ఈ ఇల్లు వచ్చింది. ఇక నాన్న లేకపోవడంతో.. ఆ ఇల్లు నాకు వచ్చింది. అయితే ఆ ఇల్లును బుక్ చేసి దాదాపు 18 ఏళ్లు అవుతోంది. లేట్ అయినా.. ఇల్లు చేతికి వచ్చింది అది సంతోషం అన్నారు.  ప్రస్తుతం  ఇంటీరియల్ డిజైనింగ్ పనుల అవుతున్నాయి ఇవి అయిపోగానే గృహప్రవేశం అని చెప్పారు నిరుపమ్. ఇక నిరుపమ్ తండ్రి ఓంకార్.. ఆయన టాలీవుడ్ లో రైటర్ గా, నటుడిగా ఎంతో పేరు గడించారు. ఆయన మరణం తరువాత వారసుడిగా నిరుపమ్ ఈ ఫీల్డ్ లోకి ఎంటర్ అయ్యారు. 


దాదాపు 18 సంవత్సరాల తర్వాత సోంత ఇంట్లోకి వెళ్తుండటంతో నిరుపమ్ జంట సంతోషంలో మునిగి తేలుతున్నారు. ఇంట్లో జరుగుతున్న పనుల గురించి మంజుల తన యూట్యూబ్ ఛానల్ లో వీడియో ద్వారా వివరించింది. ఇక ప్రస్తుతం కార్తీక దీపం సీరియల్ అయిపోవడంతో నిరుపమ్ టీవీ ప్రోగ్రామ్స్ లో అప్పుడప్పుడు మెరుస్తున్నాడు. కార్తీక దీపం సీజన్ 2స్టార్ట్ అవుతుందని ఇండస్ట్రీ నుంచి టాక్. ఇవి కాకుండా బయట వారుకొన్ని బిజినెస్ లు చేస్తున్నట్టు సమాచారం. 
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?