`ఆషిఖి` ఫేమ్‌, బిగ్‌బాస్‌ విన్నర్‌ రాహుల్‌ రాయ్‌ బ్రెయిన్‌ స్ట్రోక్..

Published : Nov 30, 2020, 08:09 AM ISTUpdated : Nov 30, 2020, 08:12 AM IST
`ఆషిఖి` ఫేమ్‌, బిగ్‌బాస్‌ విన్నర్‌ రాహుల్‌ రాయ్‌ బ్రెయిన్‌ స్ట్రోక్..

సారాంశం

`ఆషిఖి` ఫేమ్‌, హిందీ బిగ్‌బాస్‌ మొదటి సీజన్‌ విన్నర్‌ రాహుల్‌ రాయ్‌ బ్రెయిన్‌ స్ట్రోక్‌కి గురయ్యాడు. ఆయన కార్గిల్‌లో సినిమా షూటింగ్‌లో ఉండగా, అకస్మాత్తుగా బ్రెయిన్‌ స్ట్రోక్‌కి గురికావడంతో ముంబయి తరలించారు. ప్రస్తుతం ఆయన ముంబయిలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

`ఆషిఖి` ఫేమ్‌, హిందీ బిగ్‌బాస్‌ మొదటి సీజన్‌ విన్నర్‌ రాహుల్‌ రాయ్‌ బ్రెయిన్‌ స్ట్రోక్‌కి గురయ్యాడు. ఆయన కార్గిల్‌లో సినిమా షూటింగ్‌లో ఉండగా, అకస్మాత్తుగా బ్రెయిన్‌ స్ట్రోక్‌కి గురికావడంతో ముంబయి తరలించారు. ప్రస్తుతం ఆయన ముంబయిలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ట్రీట్‌మెంట్‌కి సహకరిస్తున్నారని సమాచారం. 

ప్రస్తుతం రాహుల్‌ రాయ్‌ `ఎల్‌ఏసిః లైవ్‌ ది బ్యాటిల్‌` చిత్రంలో నటిస్తున్నారు. నితిన్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం కార్గిల్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇక్కడ చిత్రీకరణ జరిగే సమయంలో రాహుల్‌ అస్వస్థతకి గురయ్యారట. వెంటనే ఆయన్ని శ్రీనగర్‌కి తరలించి, అట్నుంచి ముంబయి తీసుకొచ్చారు. అక్కడ తీవ్రమైన వాతావరణ పరిస్థితుల కారణంగానే ఆయన బ్రెయిన్‌ స్ట్రోక్‌కి గురయ్యారని వైద్యులు చెబుతున్నారు. 

ఇక రాహుల్‌ రాయ్‌ తన 22ఏళ్ళ వయసులో మహేష్‌ భట్‌ రూపొందించిన `ఆషిఖి` చిత్రంతో పాపులర్‌ అయ్యారు. ఆ తర్వాత 1990లో `జునూన్‌`, `ఫిర్‌ తేరి కహానీ యాద్‌ ఆయే` చిత్రాలు చేసి మరింత పాపులారిటీని సొంతం చేసుకున్నారు. అంతేకాడు 2006లో హిందీ మొదటి సీజన్‌ బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు. మొదటిసారే విన్నర్‌గా నిలవడం విశేషం. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Varun Tej కు ఏమయ్యింది? మెగా డాటర్ నిహారిక సంచలన ప్రకటనలో ఏముంది?
Dacoit Collections : 5వ రోజు 5 కోట్లు కూడా రాలేదు, డెకాయిట్ ఇప్పటి వరకూ ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?