Intinti Gruhalakshmi: పెళ్లిచూపుల్లో హడావిడి చేస్తున్న లాస్య.. విక్రమ్ కి ఫోన్ చేసిన దివ్య?

Published : Mar 03, 2023, 08:56 AM IST
Intinti Gruhalakshmi: పెళ్లిచూపుల్లో హడావిడి చేస్తున్న లాస్య.. విక్రమ్ కి ఫోన్ చేసిన దివ్య?

సారాంశం

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు మార్చి 3వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.  

ఈరోజు ఎపిసోడ్ లో దివ్య మొబైల్ కోసం వెతుకుతూ ఉండగా అప్పుడు హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేయడంతో విక్రమ్ ఇచ్చిన డబ్బులు చూసి విక్రమ్ ని అన్న మాటలు తలుచుకొని ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే శృతి అక్కడికి వస్తుంది. శృతి దివ్య ని అలాగే చూస్తుండగా ఏంటి వదిన అలాగే చూస్తున్నావు అనడంతో పెళ్లి కానీ ఆడపిల్ల అలా శూన్యంలోకి చూస్తూ ఆలోచిస్తూ ఉందంటే మామూలు నవ్వు కాదమ్మా ఎవరో మనసును కదిలించి ఉండాలి అని అంటుంది శృతి. ఎవరో నీ జ్ఞాపకాలు నుంచి తొంగి చూస్తూ నవ్విస్తుంటే వచ్చే నవ్వు అని అంటుంది. అదేం లేదు వదిన నువ్వు ఏవేవో మనసులో అనుకోకు అసలు నాకు మనసులో ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన కూడా లేదు అదే విషయాన్ని అమ్మకి కూడా చెప్పాను అని అంటుంది దివ్య.

తప్పనిసరి పరిస్థితులలో రేపు పెళ్లి చూపుల్లో కూర్చుంటున్నాను అని అంటుంది దివ్య. ఈ నవ్వు దేనికి అనడంతో దానికి చిన్న కథ ఉందిలే అనడంతో కథ కూడా ఉందా అని అంటుంది శృతి. ఇప్పుడు దివ్య జరిగింది మొత్తం శృతికి వివరిస్తుంది. అప్పుడు శృతి నువ్వు నమ్మిన నమ్మకపోయినా ఒక విషయం చెప్తాను ప్రేమ కథలన్నీ ఇలాగే మొదలవుతాయి అతను ఎవరో నీతో మాట్లాడడానికి నిన్ను మళ్ళీ కలవడానికి ఇలా రెండు లక్షలు పెట్టుబడి పెట్టాడు అనడంతో అదేం లేదులే వదినా అని అంటుంది దివ్య. లేకపోతే ఏ తప్పు చేయకుండా నీ చేతిలో రెండు లక్షలు ఎందుకు పెట్టాడు అని అడుగుతుంది శృతి.

ఇప్పుడు డబ్బులు ఇవ్వడానికి నువ్వు అతనికి ఫోన్ చేస్తే అతను ఫోన్ లిఫ్ట్ చేయడు అనగా నిజంగానే లిఫ్ట్ చేయలేదు వదిన అనడంతో అలా నువ్వు పదే పదే ఫోన్ చేస్తూ అతని గురించి ఆలోచిస్తావు అనడంతో అంత లేదు వదిన అనగా నీ వైపు నుంచి లేకపోయినా అతని సైడ్ నుంచి ఉంటుంది అని అంటుంది శృతి. అతనికి డబ్బులు ఇచ్చే వరకు నేను ఫోన్ చేస్తాను ఆ తర్వాత అసలు అతని పట్టించుకోవడం పట్టించుకోను. ఉండు ఇప్పుడే ఆ గురుడికి ఫోన్ చేస్తాను అని అంటుంది దివ్య. ఇప్పుడు చేస్తే బాగుంటుందా వద్దులే అని అనుకుంటుంది దివ్య. మరొకవైపు ఇంట్లో అందరూ హడావిడి చేయకుండా మౌనంగా ఉండడంతో ఇంతలో లాస్య అక్కడికి వచ్చి మీ అందరికీ ఏమయింది ఈరోజు ఇంట్లో పెళ్లి చూపులు జరుగుతున్నాయి అందరూ ఇలా ఉన్నారు ఏంటి అని అడుగుతుంది.

 ఇంతలోనే నందు అక్కడికి రావడంతో చూసావా నందు ఎవరికి బాధ్యత లేదు అన్నట్టుగా ఎలా కూర్చున్నారో అని అంటుంది. అలా మాట్లాడకు లాస్య అని అంటుంది తులసి. పెళ్లి చూపులు హడావిడి కనిపించలేదు అన్నాను కదా అనగా ఇంకా టైం ఉంది కదా అని అంటుంది తులసి. పెళ్లికూతురు దివ్య అన్న రెడీ అయిందా ఫోన్ మాట్లాడుతోంది అని అనసూయ అనగా ఈ టైంలో ఫోన్ ఏంటి అంటూ తెగ హడావిడి చేస్తూ ఉంటుంది లాస్య. ఇంతలోనే దివ్య అక్కడికి వచ్చి దివ్యని చాలా సూపర్ గా రెడీ అయ్యారు అసలు పెళ్లి చూపులు మీకా నాకా అని అడగడంతో అందరూ నవ్వుకుంటూ ఉంటారు. నన్ను చూసి గ్రాండ్ గా రెడీ అవుతావని నా తాపత్రయం అనడంతో నో వే నేను సింపుల్ గానే రెడీ అవుతాను అని అంటుంది దివ్య.

 అలా కాదు దివ్య నా మాట విను వాళ్లు కోటీశ్వరులు అని అంటుంది లాస్య. లాస్య అంటే ఏమనుకున్నావు అని తన గురించి తాను పొగుడుతూ ఉండగా అందరూ నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడు నందు స్వీట్లు అవి ఏమి తీసుకుని రావద్దు నేను ఆల్రెడీ కాజు స్వీట్ బందర్ లడ్డు లాంటిది తెచ్చాను అనడంతో ఇంట్లో చేస్తున్నాను కదా అని తులసి అనగా మాకు తెలుసులే నువ్వు రవ్వ లడ్డు, బూందీతో సరి పెడతావు అని అంటుంది లాస్య. అప్పుడు లాస్య తెగ ఇక హడావిడి చేస్తూ ఓవరాక్షన్ చేస్తూ ఉండగా అది చూసి అందరూ నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడు తులసి దివ్యనీ రెడీ చేయడానికి పిలుచుకొని వెళ్తుంది.

మరొకవైపు దేవుడు బట్టలు ఐరన్ చేయకుండా అలాగే కూర్చుని ఉండగా ఇంతలో విక్రమ్ అక్కడికి వచ్చి దేవుడు పై జోకులు వేస్తూ ఉంటాడు. దేవుడు చీరలు ఐరన్ చేయడానికి తిప్పలు పడుతూ బాధపడుతూ ఉండగా అప్పుడు విక్రమ్ జోకులు వేసి నవ్వుకుంటూ ఉంటాడు. అప్పుడు దేవుడు నాకు చీర ఐరన్ చేయడం రాదని అమ్మగారికి చెప్తాను అనగా వెళ్లి చూడు తర్వాత ఏం జరుగుతుందో ఒకసారి ఊహించుకో అని అంటాడు విక్రమ్. అప్పుడు మరి ఈ చీర సంగతి ఎలా బాబు అనగా నేను చేస్తూ ఉంటాను అని ఐరన్ చేస్తూ ఉండగా ఇంతలో వాళ్ళ తాత ఎక్కడికొచ్చి ఒరేయ్ ఏం చేస్తున్నావురా అనడంతో అమ్మ చీర ఐరన్ చేస్తున్నాను తాతయ్య వారికి చేయి బాగోలేదంట అని అంటాడు విక్రమ్.

ఇంతలోనే అక్కడికి సంజు ఐరన్ కోసం షర్టు తీసుకుని రావడంతో ఏరా నీకు ఐరన్ కావాలా అక్కడ పెట్టి నేను చేస్తాను అని అంటాడు. అప్పుడు మీరంటే హాస్పిటల్ లో పనిచేస్తారని ఏం చేస్తానో చెప్పు తమ్ముడు నువ్వు వెళ్లి నేను ఐరన్ చేసి ఇస్తాను అని అంటాడు విక్రమ్. అప్పుడు విక్రమ్ మాటలకు వాళ్ళ తాతయ్య ఆలోచనలో పడతాడు. మరొకవైపు దివ్య పెళ్లి చూపులకు రెడీ అవుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి శృతి పూలు తీసుకుని రావడంతో ఎందుకు వదిన ఇవన్నీ నాకు పెళ్లి చూపుల లేక శోభనమా అని సెటైర్లు వేస్తూ మాట్లాడుతుంది దివ్య. అదేంటి దివ్య అనడంతో పెళ్లి పెద్ద లాస్య అంది అన్నప్పుడే నాకు మూడు ఉత్సాహం అన్ని పోయాయి వదిన అని అంటుంది దివ్య. చూసావు కదా వదినా ఎలా మాట్లాడుతుందో నాన్న మొఖం చూసి కంట్రోల్ చేసుకుంటున్నాను అని అంటుంది దివ్య.

 ఇప్పుడు శృతి రాత్రి ఆ రెండు లక్షల కుర్రాడికి కాల్ చేస్తాను అన్నావు చేసావా అనడంతో ఓహో విక్రమ్ కా ఇప్పుడే చేస్తాను ఉండు అని దివ్య శృతి ముందు విక్రమ్ కి ఫోన్ చేస్తుంది. మరోవైపు విక్రమ్ ఫోన్ ని దేవుడు లిఫ్ట్ చేస్తాడు. అప్పుడు ఏదేదో తింగరి తింగరిగా మాట్లాడుతూ ఉంటాడు దేవుడు. ఇప్పుడు దివ్య మీ విక్రమ్ సార్  కి ఒకసారి ఫోన్ ఇవ్వండి అనడంతో సార్ బిజీగా ఉన్నారు ఏదో చెప్పండి అనడంతో ఏమీ లేదు నిన్న మీ సార్ తో నేను ఒక చిన్న పొరపాటు వల్ల రెండు లక్షలు ఇప్పించుకున్నాను అని దివ్య అనడంతో మా సార్  రెండు లక్షలు ఏమి కర్మ తీసుకునే వాళ్ళు ఉండాలి కానీ అలా ఇచ్చుకుంటూ పోతాడు దానధర్మాలు చేస్తాడు అని దేవుడు విక్రం గురించి గొప్ప గొప్పగా చెబుతూ ఉంటాడు. అలా ఇచ్చుకుంటూ పోవడానికి మీ సార్ ఏమన్నా మదర్ తెరిసా అని అంటుంది దివ్య.

కాదు ఫాదర్ తెరిసా అంటూ తింగరి తింగరిగా మాట్లాడుతూ ఉంటాడు దేవుడు. అప్పుడు దివ్య ఫోన్ చేసిన విషయం చెప్పకుండా ఏదోదో మాట్లాడుతూ ఉంటాడు దేవుడు. మరొకవైపు శృతి దివ్య ఇద్దరు ఇదేంటి ఈ పర్సన్ ఇలా ఉన్నాడు అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. అర్థమయింది కదా అతనికి డబ్బు తిరిగి ఇచ్చే ఉపాయం ఏదైనా ఉంటే చెప్పు వదిన అని అంటుంది దివ్య. మళ్లీ ఇంకొకసారి కాల్ ట్రై చెయ్ అతను లైన్ లోకి వస్తాడేమో చూద్దాం అని అంటుంది శృతి. అప్పుడు దివ్య రెడీ అవుతూ ఉంటుంది.మరోవైపు పెళ్లి చూపులు చూసుకోవడానికి పెళ్లి కొడుకు వారు రావడంతో లాస్య తెగ హడావిడి చేస్తూ ఉంటుంది.

అప్పుడు పెళ్లి కొడుకు తల్లి తండ్రి ఇల్లు చాలా బాగుంది అనడంతో ఇంటిని శుభ్రంగా నేనే ఉంచుతాను అసలు ఇల్లు శుభ్రంగా లేకపోతే నాకు అస్సలు తోచదు. గంటకు ఒకసారి నేను ఇంటిని దులుపుతూ ఉంటాను అని లాస్య ఓవర్ యాక్షన్ చేస్తూ తన గురించి తానే గొప్పలు చెప్పుకుంటూ ఉండగా అది చూసి అందరూ నవ్వుకుంటూ ఉంటారు. ఇల్లు శుభ్రంగా ఉండాలి రోజులో సగం టైం నేను ఇంటికి స్పెండ్ చేస్తాను అంటూ ఓవరాక్షన్ చేస్తూ ఉంటుంది లాస్య. అప్పుడు నందు ఉన్న లాస్య స్నాక్స్ తీసుకొస్తావా అనడంతో తులసి స్నాక్ చేసావ్ కదా వెళ్లి తీసుకుని రాపో అనడంతో సరే అని తులసి అవన్నీ ఏమొద్దు నాకు కొంచెం అర్జెంటు మీటింగ్ ఉంది అని అనగా నందు తులసి వెళ్లి దివ్యని తీసుకుని రాపో అని అంటాడు. మరోవైపు దివ్య పని చేసుకుంటూ ఉండగా ఇంతలో తులసి అక్కడికి రావడంతో ఏ ఆడపిల్ల కైనా తొలిపెల్లి చూపులు అంటే కొంచెం సంబరం ఉంటుంది కానీ నాకు ఇవి బలవంతపు పెళ్లి చూపులు అని అంటుంది దివ్య.

PREV
click me!

Recommended Stories

చిరంజీవి, అనిల్ రావిపూడి రెమ్యునరేషన్స్ కే బడ్జెట్ మొత్తం అయిపోయిందా ? ఇక సినిమా పరిస్థితి ఏంటి ?
Illu Illalu Pillalu Today Episode Dec 17: వల్లిని గట్టిగా నిలదీసిన రామరాజు, దొంగ సర్టిఫికెట్లతో భాగ్యం