తండ్రి చనిపోయి వారం కాలేదు.. గ్లామర్‌ ఫోటోలు పంచుకుని ట్రోల్‌ అయ్యింది!

Published : Nov 05, 2020, 01:27 PM IST
తండ్రి చనిపోయి వారం కాలేదు.. గ్లామర్‌ ఫోటోలు పంచుకుని ట్రోల్‌ అయ్యింది!

సారాంశం

ఇటీవల దివ్య అగర్వాల్‌ తండ్రి కరోనాతో మృతి చెందారు. ఆయన చనిపోయి వారం రోజులు కూడా పూర్తి కాలేదు. కానీ అప్పుడే హాట్‌ ఫోటోలతో రెచ్చిపోయింది దివ్య. ఓ మేగజీన్‌ని గ్లామర్‌ పోజులిస్తూ కనిపించింది. అంతేకాదు వాటిని తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది. 

హిందీ టీవీ నటి దివ్య అగర్వాల్‌ ట్రోల్‌కి గురయ్యింది. నెటిజన్లకి కోపానికి గురయ్యింది. అంతిమంగా వారి నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. మరి దివ్య అగర్వాల్‌ ఇలా బలవడానికి కారణాలు తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే. 

హిందీలో టీవీ నటిగా దివ్య అగర్వాల్‌ మంచి పేరుతెచ్చుకున్నారు. `ఎంటీవీ స్ప్లైట్‌విల్లా`, `ఎంటీవీ ఏస్‌ ఆఫ్‌ స్పేస్‌`లో విన్నర్‌గా నిలిచారు. `రాగిని ఎంఎంఎస్‌ః రిటర్న్స్ ` వెబ్‌ సిరీస్‌లో మెరిసి పాపులర్‌ అయ్యారు. మరోవైపు మ్యూజిక్‌ వీడియోలతోనూ అలరిస్తుంది. అంతేకాదు గతేడాది టైమ్స్ ప్రకటించిన మోస్ట్ డిజైరబుల్‌ ఉమెన్‌ టాప్‌ 20 లిస్ట్ లో స్థానం సంపాదించింది. దీంతోపాటు తన గ్లామర్‌ ఫోటోలను సోషల్‌ మీడియాలో పంచుకుంటూ అలరిస్తుంటుంది. 

ఇంత వరకు బాగానే ఉంది. కానీ ఇటీవల ఆమె తండ్రి కరోనాతో మృతి చెందారు. ఆయన చనిపోయి వారం రోజులు కూడా పూర్తి కాలేదు. కానీ అప్పుడే హాట్‌ ఫోటోలతో రెచ్చిపోయింది. ఓ మేగజీన్‌ని గ్లామర్‌ పోజులిస్తూ కనిపించింది. అంతేకాదు వాటిని తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది. తండ్రి మరణించిన వారం రోజుల్లో సోషల్‌ మీడియాలో గ్లామరస్‌ ఫోటోలను షేర్‌ చేసి ట్రోల్స్ కి గురయ్యింది. అప్పటి నుంచి నెటిజన్లు దివ్య తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 

తండ్రి చనిపోయాడన్న బాధ కొంచెం కూడా లేకుండా ఎలా ఉండగలుగుతున్నావంటూ ఆమెని ట్రోల్స్ చేస్తున్నారు. దీనిపై దివ్య అగర్వాల్‌ సైతం ఘాటుగానే స్పందించారు. ప్రస్తుత సమాజం కేవలం ఎదుటి వాళ్ల బాధనే కోరుకుంటున్నట్టు అనిపిస్తుంది. జీవితంలో మూవ్‌ ఆన్‌ అయి మళ్ళీ సాధారణ జీవితం గడిపితే జనాలు చూడలేకపోతున్నారేమో అని సమాధానం చెప్పింది. దీంతో అగ్గిమీద మరింత ఉప్పు చల్లినట్టయ్యింది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Demon Pavan : రీతూ తో జంటగా డీమాన్ పవన్ మరో స్పెషల్ షో, స్టేజ్ పై రెచ్చిపోయి రొమాన్స్ చేయబోతున్న జోడి.. నిజమెంత?
2026 కోసం రిషబ్ శెట్టి మాస్టర్ ప్లాన్ రెడీ.. జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయబోతన్నాడా?