Vikram OTT: కమల్‌ హాసన్‌ `విక్రమ్‌` మూవీ ఓటీటీ రైట్స్ సోల్డ్ ఔట్‌.. ఏ సంస్థ దక్కించుకుందంటే?

Published : May 04, 2022, 08:22 PM ISTUpdated : May 04, 2022, 08:23 PM IST
Vikram OTT: కమల్‌ హాసన్‌ `విక్రమ్‌` మూవీ ఓటీటీ రైట్స్ సోల్డ్ ఔట్‌.. ఏ సంస్థ దక్కించుకుందంటే?

సారాంశం

విశ్వ నటుడు కమల్‌ హాసన్‌ నటిస్తున్న కొత్త సినిమా `విక్రమ్‌`. యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందుతుంది.ఇప్పటికే విడుదలైన టీజర్‌ ఆద్యంతం కట్టిపడేసింది. సినిమాపై అంచనాలను పెంచింది.

లోక నాయకుడు కమల్‌ హాసన్‌ నటిస్తున్న లేటెస్ట్ మూవీ `విక్రమ్‌`. లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. రాజ్‌ కమల్‌ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్‌ పతాకంపై కమల్‌ హాసన్‌ నిర్మిస్తున్న చిత్రమిది. యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందుతుంది. ఇందులో విజయ్‌ సేతుపతి, ఫహద్‌ ఫాజిల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం నుంచి మరో బిగ్గెస్ట్ అప్‌డేట్‌ వచ్చింది. ఓటీటీ రైట్స్ అమ్ముడు పోయాయి. 

ప్రముఖ దిగ్గజ ఓటీటీ సంస్థ అయిన డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ `విక్రమ్‌` సినిమా అన్ని భాషల డిజిటల్‌ రైట్స్ ని దక్కించుకుంది. తమిళంతోపాటు తెలుగు, కన్నడ, హిందీ, మలయాళం భాషల ఓటీటీ రైటర్స్ ని దక్కించుకుంది. అయితే భారీ మొత్తానికి ఈ డిజిటల్‌ రైట్స్ అమ్ముడుపోయినట్టు సమాచారం. ఇదిలా ఉంటే శాటిలైట్‌ రైట్స్ కూడా సోల్డ్ అయ్యాయి. తెలుగు, తమిళం, కన్నడ, హిందీలో స్టార్‌ ఇండియా దక్కించుకుంది. తెలుగులో` స్టార్‌ మా` దక్కించుకోగా, మలయాళంలో ఏషియానెస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానెల్‌ శాటిలైట్‌ రైట్‌ ని సొంతం చేసుకోవడం విశేషం. 

ఇదిలా ఉంటే `విక్రమ్‌` సినిమా మరో అరుదైన ఘనత సాధించబోతుంది. ఈ చిత్ర ట్రైలర్‌ని పారిస్‌లోని కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబోతున్నారు. ఇటీవల చిత్ర బృందం ఈ విషయాన్ని వెల్లడించింది. ఓ భారతీయ సినిమా ట్రైలర్‌ కేన్స్ లో లాంచ్‌ చేయడమనేది ఫస్ట్ కావడం విశేషం. మే 15న ఆడియోతోపాటు ట్రైలర్‌ని విడుదల చేయనున్నారు. అనంతరం మే 18న కేన్స్ లో ప్రదర్శిస్తారు. ఇక సినిమాని జూన్‌ 3న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టిన మాజీ ఎమ్మెల్యే కూతురు.. ఇప్పుడు ఆఫర్స్ లేక ఇంస్టాగ్రామ్ లో సంపాదన
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పిన స్టార్ డైరెక్టర్, ఇక ఆ సినిమా సీక్వెల్ లేనట్టే..