రూమర్స్ కి కౌంటర్ ఇచ్చిన డిస్కో రాజా

Published : May 06, 2019, 04:10 PM IST
రూమర్స్ కి కౌంటర్ ఇచ్చిన డిస్కో రాజా

సారాంశం

  అమర్ అక్బర్ ఆంటోని సినిమాతో మరో డిజాస్టర్ అందుకున్న మాస్ రాజా కెరీర్ డైలమాలో పడ్డట్లు గత కొంత కాలంగా అనేక వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. మెయిన్ గా ఇదివరకు ఒప్పుకున్నా సినిమాలు సైతం ఆగిపోయే స్థితిలో ఉన్నట్లు టాక్ వచ్చింది. 

అమర్ అక్బర్ ఆంటోని సినిమాతో మరో డిజాస్టర్ అందుకున్న మాస్ రాజా కెరీర్ డైలమాలో పడ్డట్లు గత కొంత కాలంగా అనేక వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. మెయిన్ గా ఇదివరకు ఒప్పుకున్నా సినిమాలు సైతం ఆగిపోయే స్థితిలో ఉన్నట్లు టాక్ వచ్చింది. ఇక పట్టాలెక్కిన డిస్కో రాజా కూడా ఫస్ట్ షెడ్యూల్ అనంతరం ఆగిపోయినట్లు కథనాలు వచ్చాయి. 

స్క్రిప్ట్ విషయంలో కూడా చిత్ర యూనిట్ మధ్య విబేధాలు వచ్చినట్లు రూమర్స్ రావడంతో  ఫైనల్ గా చిత్ర యూనిట్ ఒక పోస్టర్ తో రూమర్స్ కి చెక్ కౌంటర్ ఇచ్చింది. కొన్ని నెలల క్రితం మొదటి షెడ్యూల్ ని ఫినిష్ చేసిన డిస్కో రాజా గ్యాంగ్ ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ ని గ్రాండ్ గా మొదలెట్టడానికి సిద్ధమైంది. 

ఈ నెల 27న రెండవ షెడ్యూల్ కి సంబందించిన సీన్స్ ను షూట్ చేయనున్నారు. విఐ.ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రవితేజ డిఫరెంట్ షేడ్స్ లో కనిపించనున్నాడు. స్కై ఫై డ్రామాగా దర్శకుడు సినిమాను తెరకెక్కిస్తున్నాడు. పాయల్ రాజ్ పుత్ - నభ నటేష్ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు.    

PREV
click me!

Recommended Stories

ఇదెక్కడి ట్విస్ట్ బాబూ.! నాగచైతన్యతో సమంత, శోభిత.. అసలు మ్యాటర్ ఇది
Illu Illalu Pillalu Today Episode Dec 23: అమూల్యను విశ్వ ట్రాప్ చేశాడని తెలుసుకున్న ధీరజ్, ఇంగ్లిష్ టీచర్ వల్లి