హైదరాబాద్ ఎల్ బి నగర్ లోని కామినేని హాస్పటిల్స్ లో ఈ ఆపరేషన్ చేయించుకున్నారు
తెలుగు స్టార్ డైరెక్టర్స్ లో వివి వినాయక్ ఒకరు. ఆయన ఖాతాలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. ఆది సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యిన వినాయక్ మొదటి సినిమాతోనే భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. ఆ తర్వాత బాలయ్య తో చెన్నకేశవ రెడ్డి, యంగ్ హీరో నితిన్ తో దిల్, మెగాస్టార్ చిరంజీవితో ఠాగూర్ సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకొని స్టార్ దర్శకుడిగా మారారు. ఆయన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించి మెప్పించారు. టాలీవుడ్ లో టాప్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఆయన గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు . అయితే ఇప్పుడు వినాయక్ కు సంబందించిన ఓ వార్త ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.
వినాయక్ గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. దాంతో ఆయన హాస్పటిల్ లో చూపించుకోగా లివర్ కు మేజర్ ఆపరేషన్ చేయాల్సి వచ్చిందని, ప్రస్తుతం రికవరీ మోడ్ లో ఉన్నారని తెలుస్తోంది. ఆయన హైదరాబాద్ ఎల్ బి నగర్ లోని కామినేని హాస్పటిల్స్ లో ఈ ఆపరేషన్ చేయించుకున్నారు. త్వరలోనే ఆయన్ను డిస్చార్చ్ చేస్తారు. ఆ తర్వాత కొద్ది కాలం పాటు ఆయన రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ విషయమై వినాయక్ కుటుంబం నుంచి అఫీషియల్ సమాచారం అయితే ఏమీ లేదు.
ఇంక వినాయిక్ కొద్ది కాలం క్రితం హిందీలో ఛత్రపతి రీమేక్ ని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో చేసారు. ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత వివి వినాయక్ ఏ సినిమాను అనౌన్స్ చేయలేదు. దానికి కూడా అనారోగ్య సమస్యే కారణం అని అంటున్నారు. దాంతో వినాయక్ శారీరకంగానూ తగ్గిపోయారని అంటున్నారు. ఇక వినాయక్ దర్శకుడిగానే కాదు హీరోగా సినిమా చేశాడు. కానీ ఆ సినిమా బయటకు రాలేదు. వివి వినాయక్ ఆరోగ్యం పై వస్తున్న వార్తలతో టాలీవుడ్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అలాగే ఆయన రాయిదుర్గంలో ప్రైమ్ లొకేషన్ లో ఉన్న ఖరీదైన బంగ్లాని అమ్మేసి కోకా పేటలోని అపార్టమెంట్ స్పేస్ కు షిప్ట్ అయ్యి అక్కడ ఉంటున్నారు. ఆయన త్వరలోనే కోలుకుని మళ్లీ సినిమాలు తీయాలని కోరుకుందాం.