గరుడ గా మహేష్ బాబు... రాజమౌళి అలా ప్లాన్ చేశాడా? సంచలనం రేపుతున్న సోషల్ మీడియా పోస్ట్!

By Sambi Reddy  |  First Published Aug 24, 2024, 12:11 PM IST


మహేష్ బాబు-రాజమౌళి కాంబోలో ఎస్ఎస్ఎంబి 29 తెరకెక్కనుంది. కాగా ఈ చిత్రానికి పనిచేస్తున్న విజువల్ డెవలెప్మెంట్ ఆర్టిస్ట్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ టాలీవుడ్ వర్గాల్లో చర్చకు దారి తీసింది. 
 


హీరో మహేష్ బాబు ఎస్ఎస్ఎంబి 28కి సిద్ధం అవుతున్నారు. త్వరలో ఈ భారీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుండగా మేకోవర్ సాధించే పనిలో ఉన్నారు. మహేష్ బాబు గతంలో పోకిరి, అతిథి చిత్రాల్లో లాంగ్ హెయిర్ తో కనిపించారు. ఈ రెండు చిత్రాలకు మించి పొడవాటి జుట్టులో కనిపిస్తున్నారు. గడ్డం కూడా పెంచడం కొసమెరుపు. తన హీరోలను గత చిత్రాలకు భిన్నంగా ప్రెజెంట్ చేయాలని రాజమౌళి భావిస్తారు. ఎస్ఎస్ఎంబి 29లో మహేష్ లుక్ పై రాజమౌళి చాలా కసరత్తే చేశారని సమాచారం. 

ఎస్ఎస్ఎంబి 29 ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్లే అవకాశం కలదు. ఆగస్టు 9న మహేష్ బాబు జన్మదినం కాగా... ఎస్ఎస్ఎంబి 29 అప్డేట్ ఉంటుందని ఫ్యాన్స్ భావించారు. వారికి నిరాశే ఎదురైంది. కనీసం బర్త్ డే విషెస్ పోస్టర్ కూడా నిర్మాతలు విడుదల చేయలేదు. ప్రాజెక్ట్ మొదలుపెట్టే ముందు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం రాజమౌళికి అలవాటు. మహేష్ బాబు, రాజమౌళి, నిర్మాతలు పాల్గొనే ఈ ప్రెస్ మీట్ కోసం టాలీవుడ్ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. 

Latest Videos

ఇక ఆర్ ఆర్ ఆర్ తో గ్లోబల్ ఫేమ్ రాబట్టిన రాజమౌళి మహేష్ బాబుతో పాన్ వరల్డ్ మూవీ ప్లాన్ చేశాడు. ఎస్ఎస్ఎంబి 29 జంగిల్ అడ్వెంచర్ డ్రామా అని రచయిత విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. హాలీవుడ్ సెక్స్ ఫుల్ ఫ్రాంచైజ్ ఇండియానా జోన్స్ తరహాలో ఈ మూవీ ఉంటుందని రాజమౌళి స్వయంగా చెప్పాడు. ప్రపంచాన్ని చుట్టే సాహసికుడిగా మహేష్ బాబు కనిపిస్తారట. 

ఈ చిత్రానికి పని చేస్తున్న విజువల్ డెవలప్మెంట్ ఆర్టిస్ట్ టీపీ విజయన్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ చర్చకు దారి తీసింది. ఆయన బంగారు గరుడ రెక్కలను పోస్ట్ చేశారు. ఎస్ఎస్ఎంబి 29 అనే ట్యాగ్ జోడించాడు. అసలు గరుడ రెక్కలకు ఎస్ఎస్ఎంబి 29 చిత్రానికి సంబంధం ఏమిటనే సందేహాలు మొదలయ్యాయి. రాజమౌళి-మహేష్ బాబు మూవీ టైటిల్ గరుడ అనే ప్రచారం ఊపందుకుంది. గతంలో మహేష్ బాబు గరుడ పేరుతో ఒక ప్రాజెక్ట్ చేసే ఆలోచన ఉన్నట్లు వెల్లడించారు. అది ఇదేనా అనుమానం కలుగుతుంది. మొత్తంగా విజయన్ సోషల్ మీడియా పోస్ట్ తెలుగు ప్రేక్షకులను అయోమయంలో పడేసింది. 

click me!